వినియోగదారులకు మరింత చేరువలో.. వైజాగ్‌లో ప్రారంభమైన Revolt Motors డీలర్‌షిప్

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) ఎప్పటికప్పుడు దేశీయ మార్కెట్లో తన పరిధిని విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇంతకు ముందు బెంగళూరు, జైపూర్ మరియు సూరత్ వంటి ప్రాంతాలలో కొత్త షోరూమ్ లను ప్రారంభించింది. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా తన ఉనికిని విస్తరించడంతో భాగంగానే వైజాగ్‌లో తన మొదటి రిటైల్ స్టోర్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది.

వినియోగదారులకు మరింత చేరువలో.. వైజాగ్‌లో ప్రారంభమైన Revolt Motors డీలర్‌షిప్

కంపెనీ వైజాగ్‌లో ప్రారంభించిన ఈ మొదటి రిటైల్ స్టోర్‌ ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీకి చెందిన మొదటి రిటైల్ స్టోర్. అయితే ఇప్పుడు ఇది దేశంలో 15 రిటైల్ స్టోర్‌ అవుతుంది. 2022 ప్రారంభంలో కోల్‌కతా, చండీగఢ్, లక్నో మరియు NCR సహా భారతదేశంలోని 60 కొత్త నగరాల్లోకి ప్రవేశించడం ద్వారా కంపెనీ తన విక్రయాల నెట్‌వర్క్‌ను విస్తరించాలని మరియు రిటైల్ ఉనికిని మరింత బలోపేతం చేయాలని, దానివైపుగా కృషి చేస్తోంది.

వినియోగదారులకు మరింత చేరువలో.. వైజాగ్‌లో ప్రారంభమైన Revolt Motors డీలర్‌షిప్

2021 అక్టోబర్ నెలలో రివోల్ట్ మోటార్స్ బెంగళూరు, జైపూర్ మరియు సూరత్‌లలో రిటైల్ స్టోర్లను ప్రారంభించదమే కాకుండా, 70 నగరాల్లో రివోల్ట్ RV400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కోసం బుకింగ్‌లను ప్రకటించింది. కంపెనీ తన అన్ని కొత్త రివోల్ట్ స్టోర్‌లను ప్రధాన నగరాల్లో రిటైల్ భాగస్వాములు ఏర్పాటు చేస్తారు. కొత్త స్టోర్‌లు కంపెనీకి విక్రయ కేంద్రంగా మాత్రమే కాకుండా, కస్టమర్‌లు వాహనాన్ని అనుభవించడానికి మరియు ఛార్జింగ్ పాయింట్ యొక్క డిజైన్, ఛార్జింగ్ ప్రక్రియ మరియు ఇన్‌స్టాలేషన్ ద్వారా నడవడానికి అవకాశం కల్పిస్తాయి. ఇవన్నీ కూడా కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

వినియోగదారులకు మరింత చేరువలో.. వైజాగ్‌లో ప్రారంభమైన Revolt Motors డీలర్‌షిప్

రివోల్ట్ మోటార్స్ యొక్క RV400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కు కొనుగోలుదారుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ బైక్ సేల్ ప్రారంభమైన ప్రతిసారీ కొన్ని నిమిషాల్లోనే పూర్తిగా అమ్ముడైపోతుంది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క ఈ బైక్ కి ఎంత డిమాండ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

వినియోగదారులకు మరింత చేరువలో.. వైజాగ్‌లో ప్రారంభమైన Revolt Motors డీలర్‌షిప్

కంపెనీ తన వినియోగదారులకు అనుకూలంగా ఉండటం కోసం కాంటాక్ట్‌లెస్ అనుభవాన్ని అందించడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కూడా ఉపయోగిస్తోంది. బ్రాండ్ ప్రస్తుతం బెంగళూరు, జైపూర్, సూరత్, ఢిల్లీ, ముంబై, పూణె, చెన్నై, అహ్మదాబాద్ మరియు హైదరాబాద్ వంటి నగరాల్లో బైక్‌లను విక్రయిస్తోంది.

వినియోగదారులకు మరింత చేరువలో.. వైజాగ్‌లో ప్రారంభమైన Revolt Motors డీలర్‌షిప్

రివోల్ట్ కంపెనీ యొక్క RV400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ బైక్ 3 కిలోవాట్ మోటార్‌తో వస్తుంది. అంతే కాకూండా ఇది 72 V, 3.24 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో శక్తిని పొందుతుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 85 కి.మీ వరకు ఉంటుంది.

వినియోగదారులకు మరింత చేరువలో.. వైజాగ్‌లో ప్రారంభమైన Revolt Motors డీలర్‌షిప్

Revolt RV400 బైక్ ఒక ఫుల్ ఛార్జింగ్ తో దాదాపు 156 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. ఇది మూడు రైడింగ్ మోడ్‌లను పొందుతుంది. అవి ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్స్ మోడ్లు. ఈ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 4.5 నుండి 5 గంటల సమయం పడుతుంది. ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో అత్యధికంగా ఈ బైక్‌పై కంపెనీ 1.5 లక్షల కి.మీ వారంటీ ఇస్తోంది.

వినియోగదారులకు మరింత చేరువలో.. వైజాగ్‌లో ప్రారంభమైన Revolt Motors డీలర్‌షిప్

ఇందులో బైక్ లొకేటర్ మరియు జియో-ఫెన్సింగ్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించే MyRevolt యాప్ ద్వారా బైక్ ఫీచర్లను ఆపరేట్ చేయవచ్చు. ఇది కాకుండా, బ్యాటరీ స్టేటస్, మెయింటెనెన్స్, రైడ్ డేటా, రైడింగ్ హిస్టరీ, బైక్ సౌండ్ మరియు ఛార్జింగ్ స్టేషన్‌తో సహా అనేక సమాచారాన్ని ఈ అప్లికేషన్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

MyRevolt అప్లికేషన్ సహాయంతో, బైక్ యొక్క ధ్వనిని స్క్రీన్‌పై ఒక్కసారి నొక్కడం ద్వారా మార్చవచ్చు. రివోల్ట్ RV 400 బైక్ నుండి బయటకు తీసి ఛార్జ్ చేయగల ఒక స్వాప్ బ్యాటరీని కూడా పొందుతుంది. బైక్ నుండి బ్యాటరీని తీసివేయడానికి 60 సెకన్ల కంటే తక్కువ సమయం పడుతుంది.

వినియోగదారులకు మరింత చేరువలో.. వైజాగ్‌లో ప్రారంభమైన Revolt Motors డీలర్‌షిప్

భారతదేశంలో ఇప్పుడు అందుబాటులో ఉన్న FAME-2 స్కీమ్ కింద ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ కారణంగా, Revolt బైక్ ధర రూ.28,000 వరకు తగ్గుతుంది. అయితే ఈ తగ్గుదల దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధరకాలుగా ఉంటుంది. అయితే ప్రస్తుతం Revolt RV400 బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 90,799 కి చేరింది. గతంలో ఢిల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1,18,999.

వినియోగదారులకు మరింత చేరువలో.. వైజాగ్‌లో ప్రారంభమైన Revolt Motors డీలర్‌షిప్

అదే సమయంలో, గుజరాత్ ప్రభుత్వం యొక్క కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ప్రకారం, ఈ బైక్ ఇప్పుడు అహ్మదాబాద్‌లో రూ. 87,000 కు విక్రయించబడుతోంది. మహారాష్ట్రలో ఈ బైక్‌లపై సుమారు రూ.25,000 సబ్సిడీ ఇస్తుండగా, గుజరాత్‌లో ఈ సంఖ్య రూ. 20,000 గా ఉంది. ఢిల్లీ ప్రభుత్వ ప్రోత్సాహకాల వల్ల ఎలక్ట్రిక్ బైక్‌ల ధరలు సుమారు రూ. 16,000 తగ్గనుండగా, మేఘాలయలో రూ. 32,000 వరకు తగ్గుతున్నాయి. ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీల వల్ల ధరలు చాలా వరకు తగ్గుతాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, November 23, 2021, 9:37 [IST]
English summary
Revolt electric bikes launched in vizag details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+