భారీగా పెరిగిన Revolt RV400 బైక్ ధరలు: పూర్తి వివరాలు

ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ తయారీదారు రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే ఎలక్ట్రిక్ వాహన విభాగాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుంది. కంపెనీ యొక్క RV400 బైక్ అతి తక్కువ కాలంలోనే విపరీతమైన ఆదరణ పొందగలిగింది. ఇందులో భాగంగానే ఈ బైక్ యొక్క బుకింగ్స్ ఓపెన్ చేసిన కొంత సేపటికే మొత్తం బుక్ చేయబడుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈ బైక్ కి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో తెలుసుకోవచ్చు.

భారీగా పెరిగిన Revolt RV400 బైక్ ధరలు: పూర్తి వివరాలు

ఇదిలా ఉండగా కంపెనీ ఇటీవల తన బైక్‌ల ధరలను అమాంతం పెంచినట్లు తెలిపింది. ఈ కారణంగా Revolt RV400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ధర మునుపటికంటే రూ. 18,000 పెరిగింది. అయితే పెరిగిన ఈ ధరలు FAME 2 సబ్సిడీని పరిగణనలోకి తీసుకుంటే, ముంబై మినహా దేశవ్యాప్తంగా Revolt RV 400 ధర ఎక్స్-షోరూమ్ మరియు రాష్ట్ర సబ్సిడీలు మినహాయించి రూ. 1.25 లక్షలు వరకు ఉంటుంది. కానీ ముంబై మినహా దేశవ్యాప్తంగా ఈ బైక్ ధర రూ. 1.26 లక్షలు అందుబాటులో ఉంటుంది.

భారీగా పెరిగిన Revolt RV400 బైక్ ధరలు: పూర్తి వివరాలు

కంపెనీ అందించిన తాజా సమాచారం ప్రకారం, మార్కెట్లో ముడి పదార్థాల ధరలో ఆకస్మిక మరియు గణనీయమైన పెరుగుదల కారణంగా Revolt RV400 ధర కూడా పెరిగింది అని తెలుస్తుంది. అంతే కాకుండా, బుకింగ్ సమయంలో ప్రస్తుత ధరకు బైక్‌ను డెలివరీ చేయలేమని కంపెనీ తెలిపింది.

భారీగా పెరిగిన Revolt RV400 బైక్ ధరలు: పూర్తి వివరాలు

అయితే ఈ ప్రకటనకు ముందు మోటార్‌సైకిల్‌ను బుక్ చేసుకున్న కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను తీసుకునేటప్పుడు ప్రస్తుతం పెరిగిన ధరను చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది కొనుగోలుదారులపైన ఎటువంటి ప్రభావం చూపుతుందో ముందు ముందు తెలుస్తుంది.

భారీగా పెరిగిన Revolt RV400 బైక్ ధరలు: పూర్తి వివరాలు

Revolt RV400 ధరల పెంపుతో పాటు, ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ బ్యాటరీ వారెంటీకి సంబంధించి బ్రాండ్ మరో ప్రకటన చేసింది. ఇంతకుముందు RV400 యొక్క 3.24 kWh బ్యాటరీ ప్యాక్ 8 సంవత్సరాలు లేదా 1.50 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ కవరేజీని అందించింది. కానీ ఇప్పుడు కంపెనీ తన బ్యాటరీపై కేవలం 6 సంవత్సరాలు లేదా 1 లక్ష కిమీ వారెంటీ కవరేజీని మాత్రమే అందిస్తుంది.

భారీగా పెరిగిన Revolt RV400 బైక్ ధరలు: పూర్తి వివరాలు

కంపెనీ నివేదికల ప్రకారం, వచ్చే ఏడాది 2022 ప్రారంభంలో రివోల్ట్ ఆర్‌వి1 అనే కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అందించడంతో తన ఉనికిని దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంటుంది. రివోల్ట్ మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రివోల్ట్ ఆర్‌వి400 కోసం గత నెల నుండి బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించింది.

భారీగా పెరిగిన Revolt RV400 బైక్ ధరలు: పూర్తి వివరాలు

కంపెనీ గత నెలలో ప్రారంభించిన బుకింగ్స్ తో చేరి, ఈ సంవత్సరం మూడవసారి బుకింగ్స్ ప్రారంభించినట్లు కూడా తెలుస్తుంది. కొత్త Revolt RV 400 బుకింగ్‌లు భారతదేశంలోని 70 నగరాలకు విస్తరించబడ్డాయి. దేశవ్యాప్తంగా మరిన్ని స్థానాలను చేర్చేందుకు తమ నెట్వర్క్ విస్తరించినట్లు కంపెనీ ఇంతకుముందు ప్రకటించింది.

భారీగా పెరిగిన Revolt RV400 బైక్ ధరలు: పూర్తి వివరాలు

ప్రస్తుతం దేశవ్యప్తంగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మరియు చెన్నై వంటి మెట్రో నగరాలతో పాటు, హుబ్లీ, బెల్గాం, హల్ద్వానీ, వరంగల్, తిరుపతి, కర్నాల్, పానిపట్, వాపి, సోలన్ మరియు ఇతర టైర్-II మరియు టైర్-III నగరాల్లో నివసించే ప్రజలు కూడా ఈ రివోల్ట్ RV 400 బుక్ చేసుకోవచ్చు.

భారీగా పెరిగిన Revolt RV400 బైక్ ధరలు: పూర్తి వివరాలు

Revolt RV400 బైక్ ఒక ఫుల్ ఛార్జింగ్ తో దాదాపు 156 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. దీనికోసం కంపెనీ ఇందులో 5kW ఎలక్ట్రిక్ మోటార్‌ను అందించింది. అంతే కాకుండా ఈ బైక్ 3.24kWh యొక్క స్వాప్ చేయగల బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. ఇది మూడు రైడింగ్ మోడ్‌లను పొందుతుంది. అవి ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్స్ మోడ్లు. బైక్ యొక్క గరిష్ట వేగం గంటకు 85 కి.మీ. ఈ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 4.5 నుండి 5 గంటల సమయం పడుతుంది.

భారీగా పెరిగిన Revolt RV400 బైక్ ధరలు: పూర్తి వివరాలు

రివాల్ట్ యొక్క ఎలక్ట్రిక్ బైకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. దీని కారణంగా ఇవి అత్యంత ఆధునిక బైకులుగా మారాయి. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ డిఆర్ఎల్ లు మరియు ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు ఉన్నాయి. Revolt RV400 మరియు RV300 లలో పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ బటన్‌లు మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కీలెస్ ఇగ్నిషన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

భారీగా పెరిగిన Revolt RV400 బైక్ ధరలు: పూర్తి వివరాలు

ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్‌లను కూడా మొబైల్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయవచ్చు. దీని ద్వారా జియోఫెన్సింగ్, లైవ్ వెహికల్ ట్రాకింగ్, ఛార్జింగ్ స్టేషన్ లొకేషన్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, రియల్ టైమ్ పొజిషనింగ్ మరియు బ్యాటరీ హెల్త్ ఫీచర్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉపయోగించవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, November 29, 2021, 14:45 [IST]
English summary
Revolt motors hiked price for rv400 electric motorcycle details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+