డీలర్‌షిప్‌ల ఏర్పాటుపై వేగం పెంచిన Revolt Motors: అప్పుడు వైజాగ్, ఇప్పుడు విజయవాడ

భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో తన డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. ఇది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రెండవ డీలర్‌షిప్‌. ఇంతకుముందు కంపెనీ వైజాగ్ లో కూడా తన డీలర్‌షిప్‌ ప్రారంభించింది.

డీలర్‌షిప్‌ల ఏర్పాటుపై వేగం పెంచిన Revolt Motors: అప్పుడు వైజాగ్, ఇప్పుడు విజయవాడ

రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) దేశంలో తన ఉనికిని భారతదేశంలో మొత్తం చాటుకోవడానికి తగిన ప్రయత్నాలు సిద్ధం చేస్తోంది. ఇటీవల కాలంలో కంపెనీ బెంగళూరు, జైపూర్, సూరత్, వైజాగ్, కలకత్తా మరియు తమిళనాడులోని మధురై వంటి నగరాలలో డీలర్‌షిప్‌లను ప్రారంభించింది. అయితే కంపెనీ ప్రారంభించిన ఈ డీలర్‌షిప్ సంఖ్య పరంగా 20.

డీలర్‌షిప్‌ల ఏర్పాటుపై వేగం పెంచిన Revolt Motors: అప్పుడు వైజాగ్, ఇప్పుడు విజయవాడ

రివోల్ట్ మోటార్స్ కంపెనీ ప్రస్తుతం రెండు బైక్‌లను విక్రయిస్తోంది. కంపెనీ తన వాహనాలను 2019లో విక్రయించడం ప్రారంభించింది మరియు ప్రస్తుతం దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ తయారీదారుగా అవతరించింది. రివోల్ట్ మోటార్స్ ప్రస్తుతం హర్యానాలోని మనేసర్‌లో తమ బైక్‌లను ఉత్పత్తి చేస్తోంది.

ప్రస్తుతం, ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో ఎలక్ట్రిక్ బైక్‌ల మార్కెట్ వాటా అంటే భారతదేశంలో 10 శాతం మాత్రమే ఉంది, అయితే ఎలక్ట్రిక్ స్కూటర్‌లు 90 శాతం కలిగి ఉన్నాయి. ఇప్పుడు రివోల్ట్‌తో పాటు ఎవోలెట్ ఇండియా, అల్ట్రావైలెట్ ఆటోమోటివ్ వంటి కంపెనీలు ఈ విభాగంలోకి ప్రవేశించాయి.

డీలర్‌షిప్‌ల ఏర్పాటుపై వేగం పెంచిన Revolt Motors: అప్పుడు వైజాగ్, ఇప్పుడు విజయవాడ

భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయడంలో కంపెనీ నిమగ్నమై ఉంది. గత నెలలో, రివోల్ట్ మోటార్స్ దేశంలోని 70 నగరాల్లో బుకింగ్ ప్రారంభించింది. కావున ఈ పరిస్థితిలో ఈ నగరాల్లో డీలర్‌షిప్‌లను ప్రరారంభించాల్సిన ఆసారాం ఎంతైనా ఉంది.

డీలర్‌షిప్‌ల ఏర్పాటుపై వేగం పెంచిన Revolt Motors: అప్పుడు వైజాగ్, ఇప్పుడు విజయవాడ

ఇప్పటి వరకు కంపెనీ 20 నగరాల్లో తన డీలర్‌షిప్‌లను ప్రారంభించింది. 2022 నాటికి 59 నగరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. రివోల్ట్ మోటార్స్ అక్టోబర్ నెలలో 3 నగరాల్లో డీలర్‌షిప్‌లను ప్రారంభించింది, ఆ తర్వాత నవంబర్ నెలలో కంపెనీ 5 డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసింది.

కంపెనీ ఈ 2021 డిసెంబర్ నెలలో మరిన్ని డీలర్‌షిప్‌లను ప్రారభించే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా కంపెనీ కొత్త ప్రాంతాలలో దూసుకుపోతోంది, అమ్మకాలు మరియు అమ్మకాల తర్వాత కావాల్సిన సర్వీస్ మరియు విడిభాగాలు కొత్త డీలర్‌షిప్‌లో విక్రయించబడతాయి.

డీలర్‌షిప్‌ల ఏర్పాటుపై వేగం పెంచిన Revolt Motors: అప్పుడు వైజాగ్, ఇప్పుడు విజయవాడ

పెరుగుతున్న పెట్రోల్ ధరల కారణంగా ఎలక్ట్రిక్ బైక్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉందని కంపెనీ తెలిపింది. తమ ఎలక్ట్రిక్ బైక్‌లు కేవలం 9 రూపాయలలో 100 కి.మీల దూరాన్ని చేరుకోగలవని కంపెనీ పేర్కొంది. గత నెల కంపెనీ అక్టోబర్ 21 న 70 నగరాలకు బుకింగ్ ప్రారంభించింది.

డీలర్‌షిప్‌ల ఏర్పాటుపై వేగం పెంచిన Revolt Motors: అప్పుడు వైజాగ్, ఇప్పుడు విజయవాడ

ఈ కొత్త బ్యాచ్ యొక్క డెలివరీని డిసెంబర్-జనవరిలో ప్రారంభించే అవకాశం ఉంటుంది. దీని కోసం కంపెనీ అనేక నగరాల డెలివరీ టైమ్‌లైన్ గురించి సమాచారాన్ని కూడా ఇచ్చింది. ఏప్రిల్‌లో కంపెనీ తన నెట్‌వర్క్‌ను 35 నగరాలకు విస్తరించనున్నట్లు ఏప్రిల్‌లో ప్రకటించింది, ఏప్రిల్ నాటికి కంపెనీ కేవలం 6 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

డీలర్‌షిప్‌ల ఏర్పాటుపై వేగం పెంచిన Revolt Motors: అప్పుడు వైజాగ్, ఇప్పుడు విజయవాడ

Revolt Electric Motorcycles ఇటీవల రతన్ఇండియా ఎంటర్‌ప్రైజెస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది మరియు కొత్త పెట్టుబడిలో భాగంగా, కంపెనీ అత్యాధునిక సాంకేతికతతో ముందుకు వచ్చింది మరియు కొత్త నగరాలకు విస్తరించాలని యోచిస్తోంది. రివోల్ట్‌లో 50% వాటా కంపెనీకి చేరింది. మొత్తానికి రానున్న రోజుల్లో తన ఉనికిని విస్తరించడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది.

రివోల్ట్ కంపెనీ యొక్క RV400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ బైక్ 3 కిలోవాట్ మోటార్‌తో వస్తుంది. అంతే కాకూండా ఇది 72 V, 3.24 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో శక్తిని పొందుతుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 85 కి.మీ వరకు ఉంటుంది.

డీలర్‌షిప్‌ల ఏర్పాటుపై వేగం పెంచిన Revolt Motors: అప్పుడు వైజాగ్, ఇప్పుడు విజయవాడ

Revolt RV400 బైక్ ఒక ఫుల్ ఛార్జింగ్ తో దాదాపు 156 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. ఇది మూడు రైడింగ్ మోడ్‌లను పొందుతుంది. అవి ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్స్ మోడ్లు. ఈ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 4.5 నుండి 5 గంటల సమయం పడుతుంది.

డీలర్‌షిప్‌ల ఏర్పాటుపై వేగం పెంచిన Revolt Motors: అప్పుడు వైజాగ్, ఇప్పుడు విజయవాడ

ఇందులో బైక్ లొకేటర్ మరియు జియో-ఫెన్సింగ్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించే MyRevolt యాప్ ద్వారా బైక్ ఫీచర్లను ఆపరేట్ చేయవచ్చు. ఇది కాకుండా, బ్యాటరీ స్టేటస్, మెయింటెనెన్స్, రైడ్ డేటా, రైడింగ్ హిస్టరీ, బైక్ సౌండ్ మరియు ఛార్జింగ్ స్టేషన్‌తో సహా అనేక సమాచారాన్ని ఈ అప్లికేషన్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఇదిలా ఉండగా కంపెనీ ఇటీవల తన బైక్‌ల ధరలను అమాంతం పెంచినట్లు తెలిపింది. ఈ కారణంగా Revolt RV400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ధర మునుపటికంటే రూ. 18,000 పెరిగింది. అయితే పెరిగిన ఈ ధరలు FAME 2 సబ్సిడీని పరిగణనలోకి తీసుకుంటే, ముంబై మినహా దేశవ్యాప్తంగా Revolt RV 400 ధర ఎక్స్-షోరూమ్ మరియు రాష్ట్ర సబ్సిడీలు మినహాయించి రూ. 1.25 లక్షలు వరకు ఉంటుంది. కానీ ముంబై మినహా దేశవ్యాప్తంగా ఈ బైక్ ధర రూ. 1.26 లక్షలు అందుబాటులో ఉంటుంది.

డీలర్‌షిప్‌ల ఏర్పాటుపై వేగం పెంచిన Revolt Motors: అప్పుడు వైజాగ్, ఇప్పుడు విజయవాడ

కంపెనీ అందించిన తాజా సమాచారం ప్రకారం, మార్కెట్లో ముడి పదార్థాల ధరలో ఆకస్మిక మరియు గణనీయమైన పెరుగుదల కారణంగా Revolt RV400 ధర కూడా పెరిగింది అని తెలుస్తుంది. అంతే కాకుండా, బుకింగ్ సమయంలో ప్రస్తుత ధరకు బైక్‌ను డెలివరీ చేయలేమని కంపెనీ తెలిపింది.

అయితే ఈ ప్రకటనకు ముందు మోటార్‌సైకిల్‌ను బుక్ చేసుకున్న కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను తీసుకునేటప్పుడు ప్రస్తుతం పెరిగిన ధరను చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది కొనుగోలుదారులపైన ఎటువంటి ప్రభావం చూపుతుందో ముందు ముందు తెలుస్తుంది. Revolt RV400 ధరల పెంపుతో పాటు, ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ బ్యాటరీ వారెంటీకి సంబంధించి బ్రాండ్ మరో ప్రకటన చేసింది. ఇంతకుముందు RV400 యొక్క 3.24 kWh బ్యాటరీ ప్యాక్ 8 సంవత్సరాలు లేదా 1.50 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ కవరేజీని అందించింది. కానీ ఇప్పుడు కంపెనీ తన బ్యాటరీపై కేవలం 6 సంవత్సరాలు లేదా 1 లక్ష కిమీ వారెంటీ కవరేజీని మాత్రమే అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 14, 2021, 19:40 [IST]
English summary
Revolt motors opens new dealership in vijayawada details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+