మొన్న కలకత్తా, నేడు మధురై.. రోజు రోజుకి పెరుగుతున్న Revolt Motors డీలర్‌షిప్‌లు

ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థ రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుంటూ, తన ఉనికిని రోజు రోజుకి మరింత విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ బెంగళూరు, జైపూర్, సూరత్, వైజాగ్ మరియు కలకత్తా వంటి నగరాలలో డీలర్‌షిప్‌లను ప్రారంభించింది. అయితే ఇప్పుడు తమిళనాడులోని మధురైలో తన కొత్త స్టోర్‌ను ప్రారంభించింది.

మొన్న కలకత్తా, నేడు మధురై.. రోజు రోజుకి పెరుగుతున్న Revolt Motors డీలర్‌షిప్‌లు

తమిళనాడులోని మధురైలో తన కొత్త స్టోర్‌ను ప్రారంభించడం వల్ల దక్షిణ భారతదేశంలో తన ఉనికిని శరవేగంగా విస్తరిస్తోంది. కంపెనీ ఇప్పుడు ప్రారంభించిన రిటైల్ స్టోర్ సంఖ్య పరంగా 17 వ రిటైల్ స్టోర్. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ కారణంగా, కంపెనీ కోయంబత్తూర్ మరియు విజయవాడ వంటి నగరాలలో 2021 డిసెంబర్ 8 మరియు 13 తేదీలలో వరుసగా మరో రెండు రిటైల్ స్టోర్‌లను కూడా ప్రారంభించనుంది.

మొన్న కలకత్తా, నేడు మధురై.. రోజు రోజుకి పెరుగుతున్న Revolt Motors డీలర్‌షిప్‌లు

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆకర్షణీయమైన రాయితీలను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే తమిళనాడు ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు 10 నుంచి 15 శాతం వరకు సబ్సిడీ అందిస్తుంది. కావున కొనుగోలుదారులు ఇటీల కాలంలో ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుచేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

మొన్న కలకత్తా, నేడు మధురై.. రోజు రోజుకి పెరుగుతున్న Revolt Motors డీలర్‌షిప్‌లు

తమిళనాడు దేశంలోనే అత్యుత్తమ బైక్ మార్గాలను కూడా అందిస్తుంది. కావున వాహన వినియోగదారులు ఇప్పుడు వారి స్వంత రివోల్ట్ మోటార్‌ సైకిల్‌లో పర్వత శ్రేణులు మరియు సముద్రతీర దృశ్యాలను ఆస్వాదించవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా స్వీకరించడానికి మరియు తయారీని ప్రోత్సహించడానికి అనేక విధానాలను కూడా ప్రవేశపెట్టింది. కొత్తగా కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ వాహనాలకు 100% రోడ్డు పన్ను మినహాయింపుతో సహా రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారుల కోసం వివిధ రాయితీలను అందిస్తుంది.

మొన్న కలకత్తా, నేడు మధురై.. రోజు రోజుకి పెరుగుతున్న Revolt Motors డీలర్‌షిప్‌లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం EV పాలసీ ఎలక్ట్రిక్ మొబిలిటీకి సంబంధించిన ప్రతి అంశానికి మద్దతు ఇస్తుంది. కావున త్వరితగతిన ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని పెంచడానికి ప్రభుత్వాలు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే రివోల్ట్ మోటార్స్ కూడా తమ ఉనికిని మరింత వేగంగా విస్తరిస్తూ ఉంది. ఈ కారణంగానే ఎక్కువ సంఖ్యలో డీలర్‌షిప్‌లను ప్రారంభిస్తోంది.

మొన్న కలకత్తా, నేడు మధురై.. రోజు రోజుకి పెరుగుతున్న Revolt Motors డీలర్‌షిప్‌లు

వినియోగదారుల డిమాండ్‌ను మరింత వేగంగా తీర్చడానికి, కంపెనీ 2022 ప్రారంభంలో చండీగఢ్, లక్నో మరియు NCR సహా భారతదేశంలోని 50 కి పైగా కొత్త నగరాల్లోకి ప్రవేశించడం ద్వారా తన విక్రయాల నెట్‌వర్క్‌ను విస్తరించాలని మరియు రిటైల్ ఉనికిని మరింత బలోపేతం చేయాలని కంపెనీ తగిన ఏర్పాట్లు చేస్తోంది.

మొన్న కలకత్తా, నేడు మధురై.. రోజు రోజుకి పెరుగుతున్న Revolt Motors డీలర్‌షిప్‌లు

రివోల్ట్ కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ బైకులకు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ కారణంగా ఈ ఎలక్ట్రిక్ బైకులకు మంచి బుకింగ్స్ కూడా వస్తున్నాయి. అయితే కంపెనీ యొక్క తమ బైకులను బుక్ చేసుకోవాలనుకునే వారు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ www.revoltmotors.com ద్వారా బుక్ చేసుకోవచ్చు.

మొన్న కలకత్తా, నేడు మధురై.. రోజు రోజుకి పెరుగుతున్న Revolt Motors డీలర్‌షిప్‌లు

కంపెనీ ఇప్పుడు ప్రారంభిస్తున్న విక్రయ కేంద్రాలలో, కస్టమర్‌లకు వాహనాన్ని అనుభవించడానికి మాత్రమే కాకుండా ఛార్జింగ్ ప్రక్రియను తెలుసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. టెస్ట్ రైడ్ తర్వాత, కస్టమర్‌లు తమ రైడింగ్ ప్యాటర్న్ గురించి కూడా తెలుసుకోవచ్చు. రివోల్ట్ మోటార్స్ దాని ఫ్లాగ్‌షిప్ RV400 కోసం కొనుగోలుదారుల నుండి అధిక స్పందనను పొందింది. కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభించిన కొంత సమయానికే ఇవి పూర్తిగా అమ్ముడవుతున్నాయి.

మొన్న కలకత్తా, నేడు మధురై.. రోజు రోజుకి పెరుగుతున్న Revolt Motors డీలర్‌షిప్‌లు

అంతే కాకూండా కంపెనీ తన కస్టమర్లకు అంతర్గతంగా అభివృద్ధి చెందిన కాంటాక్ట్‌లెస్ అనుభవాన్ని అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ కూడా ఉపయోగిస్తోంది. రివోల్ట్ కంపెనీ యొక్క RV400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ బైక్ 3 కిలోవాట్ మోటార్‌తో వస్తుంది. అంతే కాకూండా ఇది 72 V, 3.24 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో శక్తిని పొందుతుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 85 కి.మీ వరకు ఉంటుంది.

మొన్న కలకత్తా, నేడు మధురై.. రోజు రోజుకి పెరుగుతున్న Revolt Motors డీలర్‌షిప్‌లు

Revolt RV400 బైక్ ఒక ఫుల్ ఛార్జింగ్ తో దాదాపు 156 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. ఇది మూడు రైడింగ్ మోడ్‌లను పొందుతుంది. అవి ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్స్ మోడ్లు. ఈ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 4.5 నుండి 5 గంటల సమయం పడుతుంది.

ఇందులో బైక్ లొకేటర్ మరియు జియో-ఫెన్సింగ్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించే MyRevolt యాప్ ద్వారా బైక్ ఫీచర్లను ఆపరేట్ చేయవచ్చు. ఇది కాకుండా, బ్యాటరీ స్టేటస్, మెయింటెనెన్స్, రైడ్ డేటా, రైడింగ్ హిస్టరీ, బైక్ సౌండ్ మరియు ఛార్జింగ్ స్టేషన్‌తో సహా అనేక సమాచారాన్ని ఈ అప్లికేషన్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

మొన్న కలకత్తా, నేడు మధురై.. రోజు రోజుకి పెరుగుతున్న Revolt Motors డీలర్‌షిప్‌లు

MyRevolt అప్లికేషన్ సహాయంతో, బైక్ యొక్క ధ్వనిని స్క్రీన్‌పై ఒక్కసారి నొక్కడం ద్వారా మార్చవచ్చు. రివోల్ట్ RV 400 బైక్ నుండి బయటకు తీసి ఛార్జ్ చేయగల ఒక స్వాప్ బ్యాటరీని కూడా పొందుతుంది. బైక్ నుండి బ్యాటరీని తీసివేయడానికి 60 సెకన్ల కంటే తక్కువ సమయం పడుతుంది.

మొన్న కలకత్తా, నేడు మధురై.. రోజు రోజుకి పెరుగుతున్న Revolt Motors డీలర్‌షిప్‌లు

ఇదిలా ఉండగా కంపెనీ ఇటీవల తన బైక్‌ల ధరలను అమాంతం పెంచినట్లు తెలిపింది. ఈ కారణంగా Revolt RV400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ధర మునుపటికంటే రూ. 18,000 పెరిగింది. అయితే పెరిగిన ఈ ధరలు FAME 2 సబ్సిడీని పరిగణనలోకి తీసుకుంటే, ముంబై మినహా దేశవ్యాప్తంగా Revolt RV 400 ధర ఎక్స్-షోరూమ్ మరియు రాష్ట్ర సబ్సిడీలు మినహాయించి రూ. 1.25 లక్షలు వరకు ఉంటుంది. కానీ ముంబై మినహా దేశవ్యాప్తంగా ఈ బైక్ ధర రూ. 1.26 లక్షలు అందుబాటులో ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 7, 2021, 9:21 [IST]
English summary
Revolt motors opens new retail store in madurai tamil nadu details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+