మీకు తెలుసా.. Revolt Motors డీలర్‌షిప్‌ ఇప్పుడు కలకత్తాలో కూడా..

ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థ రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుంటూ, తన ఉనికిని రోజురోజుకి మరింత విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ బెంగళూరు, జైపూర్, సూరత్ మరియు వైజాగ్ వంటి నగరాలలో డీలర్‌షిప్‌లను ప్రారంభించింది. అయితే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజధాని నగరం కలకత్తాలో ప్రజలకు మరింత చేరువగా ఉండటానికి కొత్త డీలర్‌షిప్‌ ప్రారంభించింది.

మీకు తెలుసా.. Revolt Motors డీలర్‌షిప్‌ ఇప్పుడు కలకత్తాలో కూడా

ఇప్పటికే రివోల్ట్ మోటార్స్ యొక్క డీలర్‌షిప్‌లు కోయంబత్తూర్, వైజాగ్, మదురై మరియు విజయవాడ వంటి ప్రాంతాలలో కూడా ఉన్నాయి. కంపెనీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లలో కలకత్తా డీలర్‌షిప్ 16 వ రిటైల్ స్టోర్‌ అవుతుంది.

మీకు తెలుసా.. Revolt Motors డీలర్‌షిప్‌ ఇప్పుడు కలకత్తాలో కూడా

ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతున్న కారణంగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా ఎలక్ట్రిక్ వాహన వినియోగం పెంచాలనే ఉద్దేశ్యంతో, అక్కడి ప్రభుత్వం 2025 నాటికి 10 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మీకు తెలుసా.. Revolt Motors డీలర్‌షిప్‌ ఇప్పుడు కలకత్తాలో కూడా

అయితే రివోల్ట్ కంపెనీ కూడా వినియోగదారుల డిమాండ్‌ను తీర్చాలనే లక్ష్యంతో, 2022 ప్రారంభంలో చండీగఢ్, లక్నో వంటి మొత్తం 59 కొత్త నగరాల్లోకి ప్రవేశించదానికి కూడా తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. కంపెనీ ఈ గత నెలలో ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో తన మొదటి రిటైల్ స్టోర్‌ ప్రారంభించింది.

మీకు తెలుసా.. Revolt Motors డీలర్‌షిప్‌ ఇప్పుడు కలకత్తాలో కూడా

రివోల్ట్ కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ బైకులకు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ కారణంగా ఈ ఎలక్ట్రిక్ బైకులకు మంచి బుకింగ్స్ కూడా వస్తున్నాయి. అయితే కంపెనీ యొక్క తమ బైకులను బుక్ చేసుకోవాలనుకునే వారు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ www.revoltmotors.com ద్వారా బుక్ చేసుకోవచ్చు.

మీకు తెలుసా.. Revolt Motors డీలర్‌షిప్‌ ఇప్పుడు కలకత్తాలో కూడా

కంపెనీ ఇప్పుడు ప్రారంభిస్తున్న విక్రయ కేంద్రాలలో, కస్టమర్‌లకు వాహనాన్ని అనుభవించడానికి మాత్రమే కాకుండా ఛార్జింగ్ ప్రక్రియను తెలుసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. టెస్ట్ రైడ్ తర్వాత, కస్టమర్‌లు తమ రైడింగ్ ప్యాటర్న్ గురించి కూడా తెలుసుకోవచ్చు. రివోల్ట్ మోటార్స్ దాని ఫ్లాగ్‌షిప్ RV400 కోసం కొనుగోలుదారుల నుండి అధిక స్పందనను పొందింది. కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభించిన కొంత సమయానికే ఇవి పూర్తిగా అమ్ముడవుతున్నాయి.

మీకు తెలుసా.. Revolt Motors డీలర్‌షిప్‌ ఇప్పుడు కలకత్తాలో కూడా

అంతే కాకూండా కంపెనీ తన కస్టమర్లకు అంతర్గతంగా అభివృద్ధి చెందిన కాంటాక్ట్‌లెస్ అనుభవాన్ని అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ కూడా ఉపయోగిస్తోంది. రివోల్ట్ కంపెనీ యొక్క RV400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ బైక్ 3 కిలోవాట్ మోటార్‌తో వస్తుంది. అంతే కాకూండా ఇది 72 V, 3.24 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో శక్తిని పొందుతుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 85 కి.మీ వరకు ఉంటుంది.

మీకు తెలుసా.. Revolt Motors డీలర్‌షిప్‌ ఇప్పుడు కలకత్తాలో కూడా

Revolt RV400 బైక్ ఒక ఫుల్ ఛార్జింగ్ తో దాదాపు 156 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. ఇది మూడు రైడింగ్ మోడ్‌లను పొందుతుంది. అవి ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్స్ మోడ్లు. ఈ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 4.5 నుండి 5 గంటల సమయం పడుతుంది.

మీకు తెలుసా.. Revolt Motors డీలర్‌షిప్‌ ఇప్పుడు కలకత్తాలో కూడా

ఇందులో బైక్ లొకేటర్ మరియు జియో-ఫెన్సింగ్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించే MyRevolt యాప్ ద్వారా బైక్ ఫీచర్లను ఆపరేట్ చేయవచ్చు. ఇది కాకుండా, బ్యాటరీ స్టేటస్, మెయింటెనెన్స్, రైడ్ డేటా, రైడింగ్ హిస్టరీ, బైక్ సౌండ్ మరియు ఛార్జింగ్ స్టేషన్‌తో సహా అనేక సమాచారాన్ని ఈ అప్లికేషన్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

మీకు తెలుసా.. Revolt Motors డీలర్‌షిప్‌ ఇప్పుడు కలకత్తాలో కూడా

MyRevolt అప్లికేషన్ సహాయంతో, బైక్ యొక్క ధ్వనిని స్క్రీన్‌పై ఒక్కసారి నొక్కడం ద్వారా మార్చవచ్చు. రివోల్ట్ RV 400 బైక్ నుండి బయటకు తీసి ఛార్జ్ చేయగల ఒక స్వాప్ బ్యాటరీని కూడా పొందుతుంది. బైక్ నుండి బ్యాటరీని తీసివేయడానికి 60 సెకన్ల కంటే తక్కువ సమయం పడుతుంది.

మీకు తెలుసా.. Revolt Motors డీలర్‌షిప్‌ ఇప్పుడు కలకత్తాలో కూడా

ఇదిలా ఉండగా కంపెనీ ఇటీవల తన బైక్‌ల ధరలను అమాంతం పెంచినట్లు తెలిపింది. ఈ కారణంగా Revolt RV400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ధర మునుపటికంటే రూ. 18,000 పెరిగింది. అయితే పెరిగిన ఈ ధరలు FAME 2 సబ్సిడీని పరిగణనలోకి తీసుకుంటే, ముంబై మినహా దేశవ్యాప్తంగా Revolt RV 400 ధర ఎక్స్-షోరూమ్ మరియు రాష్ట్ర సబ్సిడీలు మినహాయించి రూ. 1.25 లక్షలు వరకు ఉంటుంది. కానీ ముంబై మినహా దేశవ్యాప్తంగా ఈ బైక్ ధర రూ. 1.26 లక్షలు అందుబాటులో ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, December 3, 2021, 19:07 [IST]
English summary
Revolt opens dealership in kolkata plans new sales point in 59 cities by next year
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+