ఆగస్టు 15 న ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభించనున్న సింపుల్ ఎనర్జీ; బుకింగ్ ప్రైస్ రూ. 1947 మాత్రమే

దేశీయ మార్కెట్లో సింపుల్ ఎనర్జీ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే సింపుల్ ఎనర్జీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ న్యూస్ విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ గురించి అధికారిక సమాచారం అందించింది.

ఆగస్టు 15 న ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభించనున్న సింపుల్ ఎనర్జీ; బుకింగ్ ప్రైస్ రూ. 1947 మాత్రమే

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఆగస్టు 15 నుండి ప్రారంభమౌతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ. 1947 తో బుక్ చేసుకోవచ్చు. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఆగష్టు 15 సాయంత్రం 5 గంటల నుండి కంపెనీ వెబ్‌సైట్ www.simpleenergy.in లో బుక్ చేసుకోవచ్చు. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, కానీ రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.20 లక్షల మధ్య ఉండనుంది.

ఆగస్టు 15 న ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభించనున్న సింపుల్ ఎనర్జీ; బుకింగ్ ప్రైస్ రూ. 1947 మాత్రమే

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత ప్రీ-బుకింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మొదటి దశలో 13 రాష్ట్రాలలో విడుదల చేయబడుతుంది. దీనికోసం ప్రత్యేకంగా తమిళనాడులోని హోసూర్‌లో ఉన్న 2 లక్షల చదరపు అడుగుల ఫ్యాక్టరీలో కంపెనీ పనిచేస్తోంది.

ఆగస్టు 15 న ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభించనున్న సింపుల్ ఎనర్జీ; బుకింగ్ ప్రైస్ రూ. 1947 మాత్రమే

సింపుల్ ఎనర్జీ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్‌లో కంపెనీ 4.8 కిలో వాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగిస్తోంది. ఈ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 240 కిమీ రేంజ్ ఇస్తుందని నివేదికల ద్వారా తెలిసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 3.6 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వరకు వేగవంతమవుతుంది. ఇది హై స్పీడ్ స్కూటర్, కావున దీని గరిష్ట వేగం గంటకు 100 కిమీ వరకు ఉంటుంది.

ఆగస్టు 15 న ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభించనున్న సింపుల్ ఎనర్జీ; బుకింగ్ ప్రైస్ రూ. 1947 మాత్రమే

దీని బ్యాటరీ ప్యాక్ గ్రే కలర్ లో ఉంటుంది, ఈ బ్యాటరీ బరువు 6 కిలోల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ భారతీయ ఉపయోగం కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది రిమూవబుల్ బ్యాటరీ, ఇది ఇంట్లో సులభంగా బయటకు తీసి ఛార్జ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అనేక ఆధునిక ఫీచర్లు మరియు పరికరాలు కలిగి ఉంటుంది.

ఆగస్టు 15 న ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభించనున్న సింపుల్ ఎనర్జీ; బుకింగ్ ప్రైస్ రూ. 1947 మాత్రమే

పైన చెప్పిన ఫీచర్స్ మాత్రమే కాకుండా, టచ్ స్క్రీన్, ఆన్ బోర్డ్ నావిగేషన్, బ్లూటూత్ వంటి స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించినప్పుడు, 1,000 మందికి పైగా కస్టమర్లు దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు.

ఆగస్టు 15 న ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభించనున్న సింపుల్ ఎనర్జీ; బుకింగ్ ప్రైస్ రూ. 1947 మాత్రమే

సింపుల్ ఎనర్జీ విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, కంపెనీ యొక్క కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 30 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. ఇది కస్టమర్‌ల అన్ని అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందించబడినది. ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఎన్నడూ లేనంత పెద్ద బూట్ స్పేస్.

ఆగస్టు 15 న ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభించనున్న సింపుల్ ఎనర్జీ; బుకింగ్ ప్రైస్ రూ. 1947 మాత్రమే

ఇది కాకుండా, సింపుల్ ఎనర్జీ తన ఛార్జర్‌లు, సింపుల్ లూప్‌ను కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఒక సాధారణ లూప్ ఫాస్ట్ ఛార్జర్ కూడా కలిగి ఉటుంది. దీనిని దేశ వ్యాప్తంగా కంపెనీ ఇన్‌స్టాల్ చేస్తుంది. కంపెనీ అందిన సమాచారం ప్రకారం, రాబోయే నెలల్లో సింపుల్ ఎనర్జీ ద్వారా 300 కంటే ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబడతాయి.

ఆగస్టు 15 న ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభించనున్న సింపుల్ ఎనర్జీ; బుకింగ్ ప్రైస్ రూ. 1947 మాత్రమే

ఈ ఛార్జింగ్ స్టేషన్లు అన్ని రకాల ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో ఉపయోగించడానికి సౌకర్యవంతంగా ఉంటాయి, తద్వారా అవి అందరికీ ఆచరణీయమైన ఎంపికగా ఉంటాయి. ఈ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి సింపుల్ ఎనర్జీ ప్రధాన షాపింగ్ కాంప్లెక్స్‌లు, రెస్టారెంట్లు మొదలైన వాటితో భాగస్వామి కుదుర్చుకుంది.

ఆగస్టు 15 న ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభించనున్న సింపుల్ ఎనర్జీ; బుకింగ్ ప్రైస్ రూ. 1947 మాత్రమే

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లో రాబోతున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కి ప్రత్యర్థిగా ఉంటుంది. దేశీయ మార్కెట్లో ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి. అంతే కాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అలా ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఎలాంటి పోటీ ఇవ్వగలదు అనే విషయం కూడా త్వరలో తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 12, 2021, 17:48 [IST]
English summary
Simple one electric scooter bookings start on 15th august details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+