సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ వచ్చేసింది; ధర & వివరాలు ఇక్కడ చూడండి

సింపుల్ ఎనర్జీ తన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. భారతీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 1.09 లక్షలు. ఈ స్కూటర్ సింగిల్ వేరియంట్ మరియు 4 కలర్ స్కీమ్‌లలో లభిస్తుంది. ఈ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభించబడ్డాయి. కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు రూ. 1,947 టోకెన్ మొత్తంలో బుక్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.

భారత్‌లో విడుదలైన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌; ధర & వివరాలు

ఇదివరకు చెప్పుకున్నట్లుగా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ నమ్మ రెడ్(Namma Red), గ్రేస్ వైట్, అజూర్ బ్లూ మరియు బ్రెజెన్ బ్లాక్ కలర్స్ లో అందుబాటులో ఉంటుంది.

భారత్‌లో విడుదలైన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌; ధర & వివరాలు

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ విషయానికి వస్తే, ఇది త్రిభుజాకార ఎల్ఈడీ డిఆర్ఎల్ లు, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు టర్న్-సిగ్నల్ ఇండికేటర్స్ వంటి వాటిని కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఎల్ఈడీ టెయిల్-లాంప్, సింగిల్-పీస్ సీట్, ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్, 30-లీటర్స్ అండర్-సీట్ స్టోరేజ్, అల్లాయ్ వీల్స్, రియర్ గ్రాబ్ రైల్స్ మరియు కాంటూర్డ్ రియర్ వ్యూ మిర్రర్స్ వంటివి ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌; ధర & వివరాలు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 4.8 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీతో జతచేయబడిన 4.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ కలిగి ఉంటుంది. గ్రే కలర్ బ్యాటరీ ప్యాక్ మరియు 6 కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ భారతీయ వినియోగదారులకు కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది రిమూవబుల్ బ్యాటరీ, కావున దీనిని సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

భారత్‌లో విడుదలైన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌; ధర & వివరాలు

ఈ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 240 కిమీ రేంజ్ ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 3.6 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వరకు వేగవంతమవుతుంది. ఇది హై స్పీడ్ స్కూటర్, కావున దీని గరిష్ట వేగం గంటకు 100 కిమీ వరకు ఉంటుంది. ఇది ఎకో మోడ్‌లో 203 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

భారత్‌లో విడుదలైన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌; ధర & వివరాలు

ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జర్ సింపుల్ లూప్ సహాయంతో, కేవలం 60 సెకన్లలో 2.5 కిమీ రేంజ్ వరకు ఛార్జ్ అవుతుంది. ఇది హోమ్ ఛార్జర్ ద్వారా 2.75 గంటల్లో 0 నుంచి 80 శాతం ఛార్జ్ చేస్తుంది. రాబోయే నెలల్లో దేశవ్యాప్తంగా 300 ఛార్జింగ్ స్టేషన్లను కంపెనీ ఏర్పాటు చేయబోతోంది, ఇక్కడ వినియోగదారులు ఫాస్ట్ ఛార్జింగ్ ప్రయోజనాన్ని పొందవచ్చు.

భారత్‌లో విడుదలైన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌; ధర & వివరాలు

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ నాలుగు రైడింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అవి ఎకో, రైడ్, డాష్ మరియు సోనిక్ మోడ్స్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 2.9 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది.

భారత్‌లో విడుదలైన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌; ధర & వివరాలు

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, ఈ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుకవైపు మోనో షాక్ సెటప్ ఉంటుంది. అదే విధముగా ఇందులో అద్భుతమైన బ్రేకింగ్ సిస్టం ఉంటుంది. ఈ స్కూటర్ ముందు మరియు వెనుక భాగంలో 90 మిమీ డ్రమ్ బ్రేకులు ఉంటాయి. ఈ స్కూటర్ యొక్క టైర్ పరిమాణం 12 ఇంచెస్ ఉంటుంది. ఈ స్కూటర్ బరువు 110 కేజీలు.

భారత్‌లో విడుదలైన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌; ధర & వివరాలు

కంపెనీ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మొదటి దశలో 75 నగరాల్లో ప్రారంభిస్తోంది, ఇది రాబోయే నెలల్లో మరిన్ని నగరాల్లో లాంచ్ చేయబడుతుంది. కంపెనీ ఈ స్కూటర్ల కోసం ఛార్జింగ్ స్టేసన్స్ ఏర్పాటు చేయనుంది. ఈ ఛార్జింగ్ స్టేషన్లు అన్ని రకాల ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో ఉపయోగించడానికి సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి సింపుల్ ఎనర్జీ ప్రధాన షాపింగ్ కాంప్లెక్స్‌లు, రెస్టారెంట్లు మొదలైన వాటితో భాగస్వామి కుదుర్చుకుంది.

భారత్‌లో విడుదలైన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌; ధర & వివరాలు

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ తమిళనాడులోని హోసూర్‌లోని ప్లాంట్‌లో తయారు చేయబడుతుంది. ఈ ఫ్యాక్టరీలో ప్రతి సంవత్సరం 1 మిలియన్ ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేయవచ్చని కంపెనీ పేర్కొంది. దేశీయ మార్కెట్లో విడుదలైన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కి ప్రత్యర్థిగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒకే సారి విడుదల కావడం వల్ల ఇందులో ఏది ఎక్కువ అమ్మకాలను పొందుతుంది, మరియు దాని ప్రత్యర్థిగా సరైన పోటీ ఇవ్వగలదా అనే విషయాలు త్వరలో తెలుస్తాయి.

More from DriveSpark

Article Published On: Sunday, August 15, 2021, 17:50 [IST]
English summary
Simple one electric scooter launched price 1 09 lakh range charging time features details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+