మార్చి 2021లో ఇవే బెస్ట్ మోటార్‌సైకిల్స్; టాప్‌లో హీరో స్ప్లెండర్

గడచిన మార్చి 2021 నెలలో అత్యధికంగా అమ్ముడైన మోటార్‌సైకిళ్ల జాబితాలో హీరో మోటోకార్ప్ బ్రాండ్‌కి చెందిన ఉత్పత్తులే అధికంగా ఉన్నాయి. అమ్మకాల పరంగా కేవలం భారతదేశంలో కాకపండా ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారుగా ఉన్న హీరో మోటోకార్ప్, భారత టూవీలర్ విభాగంలో తన ఆధిపత్య స్థానాన్ని అలానే కొనసాగిస్తోంది.

మార్చి 2021లో ఇవే బెస్ట్ మోటార్‌సైకిల్స్; టాప్‌లో హీరో స్ప్లెండర్

హీరో మోటోకార్ప్ అందిస్తున్న స్ప్లెండర్ మోటార్‌సైకిల్ గత నెలలో అత్యధిక అమ్మకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ధర, మైలేజ్ మరియు విశ్వసనీయమైన బ్రాండ్ పరంగా మార్కెట్లో మంచి స్థానం సంపాధించుకున్న ఈ కమ్యూటర్ బైక్ గత నెలలో 2,80,090 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

మార్చి 2021లో ఇవే బెస్ట్ మోటార్‌సైకిల్స్; టాప్‌లో హీరో స్ప్లెండర్

అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (మార్చి 2020లో) హీరో స్ప్లెండర్ అమ్మకాలు 1,43,736 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో స్ప్లెండర్ అమ్మకాలు 94.8 శాతం వృద్ధిని సాధించాయి.

MOST READ:శవాన్ని తీసుకెళ్లడానికి రూ. 60 వేలు డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్.. తర్వాత ఏం జరిగిందంటే?

మార్చి 2021లో ఇవే బెస్ట్ మోటార్‌సైకిల్స్; టాప్‌లో హీరో స్ప్లెండర్

ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నది కూడీ హీరో మోటోకార్ప్‌కి చెందిన బ్రాండే. హీరో అందిస్తున్న మరొక ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్, హెచ్ఎఫ్ డీలక్స్ గత నెలలో 1,44,505 యూనిట్ల అమ్మకాలతో రెండవ స్థానంలో ఉంది. అంతకు ముందు ఇవి 1,14,969 యూనిట్లు ఉన్నాయి. ఈ సమయంలో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ అమ్మకాలు 25.6 శాతం పెరిగాయి.

మార్చి 2021లో ఇవే బెస్ట్ మోటార్‌సైకిల్స్; టాప్‌లో హీరో స్ప్లెండర్

హీరో మోటోకార్ప్ తమ హెచ్‌ఎఫ్ బ్రాండ్‌లో మరొక చవకైన వేరియంట్‌ను ఇటీవలే మార్కెట్లో ప్రవేశపెట్టింది. హీరో హెచ్‌ఎఫ్ 100 పేరుతో విడుదలైన ఈ మోటార్‌సైకిల్ ధర కేవలం రూ.49,400 (ఎక్స్-షోరూమ్) మాత్రమే. - ఈ బైక్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:కారు విలువ 10 లక్షలు.. రిపేర్ ఫీజు 20 లక్షలు; ఇదేంటనుకుంటున్నారా.. ఇది చూడండి

మార్చి 2021లో ఇవే బెస్ట్ మోటార్‌సైకిల్స్; టాప్‌లో హీరో స్ప్లెండర్

ఇక ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్న హోండా టూవీలర్స్‌కి చెందిన సిబి షైన్ మోడల్. గత మార్చి 2021లో హోండా సిబి షైన్ అమ్మకాలు 1,17,943 యూనిట్లుగా ఉన్నాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 86,633 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో షైన్ అమ్మకాలు 36 శాతం వృద్ధి చెందాయి.

మార్చి 2021లో ఇవే బెస్ట్ మోటార్‌సైకిల్స్; టాప్‌లో హీరో స్ప్లెండర్

బజాజ్ ఆటో అందిస్తున్న ఎంట్రీ లెవల్ మోడల్ ప్లాటినం గత నెలలో అత్యధికంగా అమ్ముడైన నాల్గవ బైక్‌గా నిలిచింది. ఈ సమయంలో బజాజ్ ప్లాటినం అమ్మకాలు 21,264 యూనిట్ల నుండి 69,025 యూనిట్లకు పెరిగి, 225 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

MOST READ:కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?

మార్చి 2021లో ఇవే బెస్ట్ మోటార్‌సైకిల్స్; టాప్‌లో హీరో స్ప్లెండర్

ఈ జాబితాలో ఐదవ స్థానాన్ని బజాజ్ పల్సర్ 125 దక్కించుకుంది. పల్సర్ సిరీస్‌లో సరసమైన బైక్‌గా ఉన్న ఈ 125సీసీ బైక్ గత నెలలో 41,956 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అంతకు ముందు ఇవి 15,059 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో బజాజ్ పల్సర్ 125 అమ్మకాలు 179 శాతం పెరిగాయి.

మార్చి 2021లో ఇవే బెస్ట్ మోటార్‌సైకిల్స్; టాప్‌లో హీరో స్ప్లెండర్

గత నెలలో టీవీఎస్ అపాచీ అమ్మకాలు 52 శాతం పెరిగి 21,764 యూనిట్ల నుండి 33,162 యూనిట్లకు పెరిగాయి. అలాగే, హీరో గ్లామర్ అమ్మకాలు 155 శాతం వృద్ధి చెంది 12,713 యూనిట్ల నుండి 32,371 యూనిట్లకు పెరిగాయి.

MOST READ:కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?

మార్చి 2021లో ఇవే బెస్ట్ మోటార్‌సైకిల్స్; టాప్‌లో హీరో స్ప్లెండర్

ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ అందిస్తున్న క్లాసిక్ 350 మోటార్‌సైకిల్ అమ్మకాలు గత నెలలో 31,694 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 24,304 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో ఈ మోడల్ అమ్మకాలు 30 శాతం పెరిగాయి.

మార్చి 2021లో ఇవే బెస్ట్ మోటార్‌సైకిల్స్; టాప్‌లో హీరో స్ప్లెండర్

ఈ జాబితాలో చివరి హీరో మోడల్ అయిన ప్యాషన్, గత నెలలో 30,464 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి 70 శాతం వృద్ధిని సాధించింది. టాప్ 10 జాబితాలో నాలుగు హీరో బ్రాండ్‌కి చెందిన ఉత్పత్తులే ఉన్నాయి. ఇక చివరిగా ఈ జాబితాలో బజాజ్ పల్సర్ 150 మోడల్ 22 శాతం వృద్ధితో 29,556 యూనిట్లను విక్రయించింది.

Most Read Articles

English summary
Top Selling Motorcycles In March 2021, Model Wise Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X