ఇదే అత్యంత చవకైన హీరో బైక్; ధర కేవలం రూ.49,400 మాత్రమే..!

భారతదేశపు అగ్రగామి మోటార్‌సైకిల్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, దేశంలో అత్యంత సరసమైన మోటార్‌సైకిల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. హీరో హెచ్‌ఎఫ్ 100 పేరుతో విడుదలైన ఈ మోటార్‌సైకిల్ ధర కేవలం రూ.49,400 (ఎక్స్-షోరూమ్) మాత్రమే.

ఇదే అత్యంత చవకైన హీరో బైక్; ధర కేవలం రూ.49,400 మాత్రమే..!

హీరో మోటోకార్ప్ విడుదల చేసిన ఈ కొత్త హెచ్‌ఎఫ్ 100 మోటార్‌సైకిల్ భారతదేశంలోనే అత్యంత చవకైనది. ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ విభాగంలో విడుదలైన హీరో హెచ్ఎఫ్ 100 ఈ విభాగంలో నేరుగా బజాజ్ సిటి100తో పోటీ పడుతుంది.

ఇదే అత్యంత చవకైన హీరో బైక్; ధర కేవలం రూ.49,400 మాత్రమే..!

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త మోటార్‌సైకిల్‌ను తయారు చేశారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ ధరతో పోల్చుకుంటే కొత్త హెచ్‌ఎఫ్ 100 బైక్ ధర కేవలం రూ.1,300 మాత్రమే తక్కువగా ఉంటుంది.

MOST READ:బజాజ్ ఆటో లాంచ్ చేసిన కొత్త బైక్; పూర్తి వివరాలు

ఇదే అత్యంత చవకైన హీరో బైక్; ధర కేవలం రూ.49,400 మాత్రమే..!

కొత్త హీరో హెచ్ఎఫ్100 చూడటానికి అచ్చం హెచ్ఎఫ్ డీలక్స్ మాదిరిగానే అనిపిస్తుంది. కాకపోతే, ఇందులో కొన్ని ఫీచర్లను తగ్గించారు. ఇందులో ఎలక్ట్రిక్ స్టార్ట్ ఆప్షనల్‌గా కూడా అందుబాటులో లేదు. మోటార్‌సైకిల్ ఖర్చు తగ్గించేందుకు గాను కంపెనీ ఈ మార్పులు చేసింది.

ఇదే అత్యంత చవకైన హీరో బైక్; ధర కేవలం రూ.49,400 మాత్రమే..!

అంతేకాకుండా, హెచ్‌ఎఫ్ డీలక్స్‌లోని చంకీ సిల్వర్-కలర్ పిలియన్ గ్రాబ్ రైలుతో పోలిస్తే, హెచ్‌ఎఫ్ 100లో వెనుక వైపు చాలా సింపుల్‌గా కనిపించే బ్లాక్ కలర్ పైప్‌తో కూడిన గ్రాబ్ రెయిల్ ఉంటుంది. ఇంజన్ మినహా మిగిలిన అన్ని భాగాలు బ్లాక్ కలర్‌లో కనిపిస్తాయి.

MOST READ:చిట్టి చిట్టి రోబో కాదు, పిజ్జా డెలివరీ రోబో, తెలుసా.. అయితే ఇది చూడండి

ఇదే అత్యంత చవకైన హీరో బైక్; ధర కేవలం రూ.49,400 మాత్రమే..!

ఇది చవకైన బైకే అయినప్పటికీ, ఇందులో ట్యూబ్‌లెస్ టైర్లతో కూడిన అల్లాయ్ వీల్స్‌ను అందిస్తున్నారు. ఆల్-బ్లాక్ థీమ్‌తో రూపుదిద్దుకున్న హీరో హెచ్‌ఎఫ్ 100 మోటార్‌సైకిల్ చూడటానికి చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. ఇంధన ట్యాంక్ యొక్క దిగువ భాగంలో మరియు సైడ్ ప్యానెల్స్ ఎగువ భాగంలో సింపుల్ గ్రాఫిక్స్‌ను కలిగి ఉంటుంది.

ఇదే అత్యంత చవకైన హీరో బైక్; ధర కేవలం రూ.49,400 మాత్రమే..!

ఇంజన్ విషయానికి హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్‌లో ఉపయోగించిన అదే ఇంజన్‌ను హెచ్ఎప్ 100లోను ఉపయోగించారు. ఇందులోని 97.2 సిసి, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 8 హెచ్‌పి పవర్‌ను మరియు 8 ఎన్‌ఎమ్‌ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ ఫోర్-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:2021 టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ రివ్యూ.. భారత మార్కెట్లో పవర్‌పుల్ ఎస్‌యూవీ

ఇదే అత్యంత చవకైన హీరో బైక్; ధర కేవలం రూ.49,400 మాత్రమే..!

హీరో హెచ్‌ఎఫ్ 100లో 9.1-లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంటుంది. హెచ్‌ఎఫ్ డీలక్స్ యొక్క ఫ్యూయెట్ ట్యాంక్‌తో పోలిస్తే ఇది 0.5-లీటర్ తక్కువగా ఉంటుంది. అలాగే, హెచ్ఎఫ్ డీలక్స్‌తో పోలిస్తే, ఈ బైక్ బరువును 1 కిలో ఎక్కువగా ఉంటుంది. దీని మొత్తం బరువు 110 కిలోలుగా ఉంటుంది.

ఇదే అత్యంత చవకైన హీరో బైక్; ధర కేవలం రూ.49,400 మాత్రమే..!

ఇది 805 మిమీ పొడవైన సీటును మరియు 165 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్ ఉపయోగించారు. మెరుగైన బ్రేకింగ్ సౌలభ్యం కోసం రెండు చక్రాలపై డ్రమ్ బ్రేక్‌లను ఆఫర్ చేస్తున్నారు.

MOST READ:బ్రేకింగ్ న్యూస్; బెంగళూరులో తిరగాలంటే మీ బైక్‌కి ఇది తప్పని సరి.. లేకుంటే?

ఇదే అత్యంత చవకైన హీరో బైక్; ధర కేవలం రూ.49,400 మాత్రమే..!

ఇవీ భారతదేశంలోనే అత్యంత సరసమైన మోటార్‌సైకిల్ యొక్క ప్రధాన లక్షణాలు. ఈ బైక్ రోజువారీ సిటీ ప్రయాణాలకు మరియు గ్రామీణ ద్విచక్ర వాహన వినియోగదారులకు చాలా అనువుగా ఉంటుంది. ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో, ఈ బైక్ మంచి మైలేజీని ఆఫర్ చేస్తూ, బడ్జెట్ ధరకే అందుబాటులో ఉంటుంది.

Most Read Articles

English summary
Hero MotoCorp Launches Most Affordable HF 100 Bike In India, Priced At INR 49,400. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X