TVS Raider రివ్యూ వీడియో; మీ ప్రశ్నలన్నిటికి సమాధానం

భారత మార్కెట్లో TVS Motor కంపెనీ Raider మోటార్ సైకిల్ ని 125 సీసీ విభాగంలో విడుదల చేసింది. ఈ కొత్త TVS Raider ప్రారంభ ధర రూ. 77,500 (ఎక్స్-షోరూమ్). అయితే ఈ బైక్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి మమ్మల్ని ఇటీవల హోసూర్ ఫ్యాక్టరీలోని కంపెనీ టెస్ట్ ట్రాక్‌కు ఆహ్వానించారు. TVS Raider యొక్క డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజిన్ పర్ఫామెన్స్ వంటి వాటి గురించి మరింత సమాచారం కోసం ఈ కింది వీడియో చూడండి.

TVS Raider నాలుగు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. అవి ఫైరీ ఎల్లో, స్ట్రైకింగ్ రెడ్, వికెడ్ బ్లాక్ మరియు బ్లేజింగ్ బ్లూ కలర్స్ కలర్స్. మేము ఫైరీ ఎల్లో మోటార్ సైకిల్ రైడ్ చేసాము. ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

TVS Raider యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో డిస్‌క్టివ్ హెడ్‌ల్యాంప్ సెటప్ ఉంది, ఇందులో LED లైటింగ్ మరియు స్ప్లిట్ LED DRL లు ఉన్నాయి. మోటార్‌సైకిల్ వెనుక భాగంలో స్ప్లిట్ LED టెయిల్‌ల్యాంప్ కూడా ఉంది. ఈ బైక్ లో 10 లీటర్ డ్యూయల్ టోన్ ఫ్యూయల్ ట్యాంక్, సింగిల్-పీస్ హ్యాండిల్‌బార్, డ్యూయల్ టోన్ ఫ్రంట్ మడ్‌గార్డ్, క్రాష్ ప్రొటెక్టర్లు, ఇంజిన్ సంప్ గార్డ్, స్ప్లిట్-సీట్లు, అప్-స్వీప్డ్ ఎగ్జాస్ట్, శ్యారీ గార్డ్, 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరియు హాలోజన్ టర్న్-సిగ్నల్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బైక్ ని చాల ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి.

TVS Raider బైక్ 124.8 సీసీ, సింగిల్ సిలిండర్ ఎయిర్ అండ్ ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 11.2 బిహెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 11.2 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం 5.9 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 99 కిమీ.

ఈ బైక్ యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో 30 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో 5-స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ ద్వారా నిర్వహించబడతాయి. సస్పెన్షన్ సెటప్ చాలా స్మూత్ గా ఉంటుంది కావున, అధిక వేగంలో కూడా స్థిరత్వాన్ని అందిస్తుంది. అంతే కాకుండా ఎలాంటి రోడ్డులో అయినా సజావుగా ముందుకు సాగుతుంది.

ఇందులోని బ్రేకింగ్ సెటప్ విషయానికి వస్తే, ముందు భాగంలో 240 మిమీ పెటల్ డిస్క్ మరియు వెనుక భాగంలో 130 మిమీ డిస్క్‌ బ్రేక్ ఉంటుంది. ఇది కంబైన్డ్ బ్రేకింగ్ మెకానిజంతో అనుబంధంగా ఉంటుంది. TVS Raider బైక్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ కలిగి యూరోగ్రిప్ రెమోరా టైర్లతో నడుస్తుంది. రిమోరా బ్రాండ్ టైర్లు ఎల్లప్పుడూ అద్భుతమైనవి మరియు అసాధారణమైన పట్టును అందిస్తాయి.

కమ్యూటర్ మోటార్ సైకిల్ విభాగంలో TVS Raider మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉండి, అద్భుతమైన పవర్‌ట్రెయిన్‌ అందించి ఈ సెగ్మెంట్‌లో మంచి ఆదరణ పొందే అవకాశం ఉంది. TVS Raider గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

TVS Raider రివ్యూ వీడియో
Most Read Articles

English summary
Tvs raider 125 review video first riding impressions
Story first published: Friday, September 17, 2021, 11:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X