కొత్త TVS Raider రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & మరిన్ని వివరాలు

ప్రపంచంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్లో భారతీయ మార్కెట్ నుంచి అమ్ముడైన వాటిలో ఎక్కువ భాగం కమ్యూటర్ మోటార్‌సైకిల్స్ ఉన్నాయి. ఈ మోటార్ సైకిల్స్ వల్ల ప్రపంచ మార్కెట్లో భారత మార్కెట్ మంచి ఆదరణ పొందగలిగింది. కమ్యూటర్ మోటార్‌సైకిల్స్ లేకుండా, భారతీయ మార్కెట్ ఈ రోజు ఉండేది కాదు అంటే అతిశయోక్తి కాదు.

భారతదేశంలోని ప్రముఖ మరియు అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ బ్రాండ్ TVS Motor కంపెనీకి ఈ కమ్యూటర్ మోటార్‌సైకిల్ విభాగం కొత్తేమీ కాదు. కంపెనీ ఈ విభాగంలో Victor, Star City వంటి మోటార్‌సైకిళ్లతో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది.

కొత్త TVS Raider రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & మరిన్ని వివరాలు

ఇదిలా ఉండగా TVS కంపెనీ ఇప్పుడు ఒక సరికొత్త ప్రీమియం కమ్యూటర్ మోటార్‌సైకిల్‌తో ముందుకు వచ్చింది. TVS Motor కంపెనీ Raider మోటార్ సైకిల్ ని 125 సీసీ విభాగానికి తీసుకువచ్చింది. కొత్త TVS Raider ప్రారంభ ధర రూ. 77,500 (ఎక్స్-షోరూమ్). అయితే ఈ బైక్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి మమ్మల్ని హోసూర్ ఫ్యాక్టరీలోని కంపెనీ టెస్ట్ ట్రాక్‌కు ఆహ్వానించారు. TVS Raider యొక్క డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజిన్ పర్ఫామెన్స్ వంటి వాటి గురించి మరింత సమాచారం ఈ రివ్యూలో తెలుసుకుందాం.. రండి.

కొత్త TVS Raider రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & మరిన్ని వివరాలు

TVS Raider డిజైన్ మరియు స్టైల్:

TVS Raider చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. దేనిని మీరు మొదటిసారి చూడగానే 125cc కమ్యూటర్ బైక్ అని గుర్తించడం దాదాపు అసాధ్యం. ఇది చూడటానికి 160 సిసి 180 సిసి స్ట్రీట్ బైక్ లాగా చాలా అద్భుతంగా కనిపిస్తుంది.

కొత్త TVS Raider రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & మరిన్ని వివరాలు

ఇక్కడ మేము రైడ్ చేసిన మోటార్‌సైకిల్ 'ఫైరీ ఎల్లో కలర్' లో ఉంది. అంతే కాకుండా ఇది మల్టిపుల్ కలర్స్ లో అందుబాటులో ఉంది. ఇందులోని ఫ్యూయెల్ ట్యాంక్, ఫ్రంట్ మడ్‌గార్డ్ మరియు ఇంజిన్ బాష్‌ప్లేట్ కూడా ఎల్లో కలర్ లో ఉన్నాయి. అయితే ఫ్యూయెల్ ట్యాంక్ ఫినిషింగ్ గ్లోస్ బ్లాక్‌లో పూర్తయ్యింది. దాని కింద గ్రే ఎలిమెంట్ ఉంది. గ్రే కలర్ ఫినిషింగ్ బైక్ యొక్క వెనుక భాగంలో కూడా మీరు గమనించవచ్చు. ఇవన్నీ కూడా బైక్ ని చాలా ఫ్రీమియంగా కనిపించేలా చేస్తాయి.

కొత్త TVS Raider రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & మరిన్ని వివరాలు

TVS Raider యొక్క 'ఫైరీ ఎల్లో కలర్' మీకు నచ్చకపోతే ఆఫర్‌లో ఉన్న 'స్ట్రైకింగ్ రెడ్, వికెడ్ బ్లాక్ మరియు బ్లేజింగ్ బ్లూ' అనే మరో మూడు కలర్స్ ఎంచుకోవచ్చు. ఇందులోని వికెడ్ బ్లాక్ షేడ్ కలర్ బైక్ చాలా సరళంగా కనిపిస్తుంది, కానీబ్లేజింగ్ బ్లూ కలర్ బైక్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే ఈ కలర్స్ అనేవి మీ వ్యక్తిగత అభిరుచిపై ఆధారపడి ఉంటుంది.

కొత్త TVS Raider రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & మరిన్ని వివరాలు

TVS Raider కంపెనీ యొక్క కొత్త ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన సరికొత్త మోటార్‌సైకిల్ అయినప్పటికీ, డిజైన్ మాత్రం TVS Apache RTR 160 4V నుండి తీసుకోబడినట్లు కనిపిస్తోంది. TVS Raider లో అత్యంత విలక్షణమైన డిజైన్ ఎలిమెంట్ దాని ముందు భాగంలో ఉన్న LED హెడ్‌ల్యాంప్. ఇది హై మరియు లో బీమ్ కోసం ప్రత్యేకమైన X- ఆకారపు LED DRL మరియు LED తో వస్తుంది.

కొత్త TVS Raider రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & మరిన్ని వివరాలు

ఇందులో పైన ఒక చిన్న ఫ్లైస్క్రీన్ ఉంది, దాని వెనుక LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇన్స్ట్రుమెంటేషన్ బైక్ గురించి చాలా సమాచారాన్ని అందిస్తుంది. ఇందులోని ఫ్రంట్ మడ్‌గార్డ్ డ్యూయల్-టోన్ యూనిట్. పెటల్ డిస్క్ బ్రేక్ డిజైన్ కూడా అద్భుతంగా ఉంటుంది.

కొత్త TVS Raider రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & మరిన్ని వివరాలు

TVS Raider సైడ్ ప్రొఫైల్ వెంటనే ఆకర్శించేలా ఉంది.ఈ మోటార్‌సైకిల్ సైజులో పెద్దగా లేదు, కానీ ఈ ఫ్యూయెల్ ట్యాంక్ మాత్రం కొంత పెద్దదిగా అనిపిస్తుంది. ఇందులోని ఫ్యూయెల్ ట్యాంక్ మోటార్ సైకిల్ మొత్తం డిజైన్ ను ప్రభావితం చేస్తుంది.

కొత్త TVS Raider రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & మరిన్ని వివరాలు

ఇంజిన్ కింద ఉన్న బాష్‌ప్లేట్ మరింత స్పోర్టివ్ డిజైన్‌ని అందిస్తుంది. సైడ్ ప్యానెల్స్‌పై Raider బ్యాడ్జింగ్, ఇంజిన్‌పై కూలింగ్ ఫిన్‌లు, స్ప్లిట్ సీట్ అరేంజ్‌మెంట్, అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్ మరియు లార్జ్ గ్రాబ్రెయిల్ ఈ కొత్త బైక్ లో గుర్తించదగిన డిజైన్ ఎలిమెంట్స్. మోటార్‌సైకిల్ సింపుల్ 6-స్పోక్ అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది.

కొత్త TVS Raider రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & మరిన్ని వివరాలు

TVS Raider యొక్క రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇది చాలా సింపుల్ గ ఉండటమే కాకుండా, చాలా స్పోర్టీవ్ సెటప్‌తో వస్తుంది. టెయిల్ ల్యాంప్ ఒక ప్రత్యేకమైన డిజైన్‌తో స్ప్లిట్ LED యూనిట్ కలిగి ఉంటుంది. టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ హాలోజన్ బల్బులను కలిగి ఉంటుంది. శ్యారీ గార్డ్ మరొక డిజైన్ ఎలిమెంట్, ఇది చాలా పెద్దదిగా ఉండి, సైడ్-స్టెప్ కూడా కలిగి ఉంటుంది. మొత్తం మీద, ఇది చాలా స్పోర్టివ్ మరియు ఆకర్షణీయంగా కనిపించే ప్రీమియం కమ్యూటర్ బైక్. ఇది వాహన వినియోగదారులను ఆకర్శించడంలో చాలా అనుకూలంగా నిర్మించబడి ఉంటుంది.

కొత్త TVS Raider రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & మరిన్ని వివరాలు

TVS Raider ఫీచర్స్:

TVS Raider బైక్ ప్రపంచవ్యాప్తంగా యువ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుంది. ఇందులో భాగంగానే ఈ బైక్ అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది చూడగానే ఆకర్షించే విధంగా ఉండటమే కాకుండా, రైడర్లకు అనుకూలమైన దాదాపు అన్ని ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

కొత్త TVS Raider రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & మరిన్ని వివరాలు

TVS Raider 125 సిసి సెగ్మెంట్‌లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌తో కూడిన ఏకైక మోటార్‌సైకిల్‌గా నిలుస్తుంది. సాధారణ బైక్ కేవలం LED DRL లతో వస్తుంది. అయితే ఇందులో మేము LED ఇండికేటర్స్ ఆశిస్తున్నాము. అయితే అది ఈ బైక్ ధరను దాదాపు 1,000 రూపాయలు పెంచే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇందులో హాలోజన్ సెటప్ ఉంది.

కొత్త TVS Raider రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & మరిన్ని వివరాలు

ఇన్‌స్ట్రుమెంటేషన్ సూపర్ ఇన్ఫర్మేటివ్ ఇన్‌వర్టెడ్ ఎల్‌సిడి స్క్రీన్ ద్వారా నిర్వహించబడుతుంది. ఇది స్పీడోమీటర్, ఓడోమీటర్, టాకోమీటర్, ట్రిప్ మీటర్లు, రేంజ్, ఫ్యూయల్ ఎకానమీ మరియు రైడ్ మోడ్‌లను ప్రదర్శిస్తుంది, అంతే కాకుండా ఇది టాప్/యావరేజ్ స్పీడ్ రికార్డర్‌ను కూడా పొందుతుంది.

కొత్త TVS Raider రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & మరిన్ని వివరాలు

TVS మోటార్‌సైకిల్ యొక్క టాప్-స్పెక్ వేరియంట్‌ను రిటైల్ చేస్తుంది, ఇందులో 5 ఇంచెస్ TFT డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్‌ప్లే TVS 'SmartXConnect స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ సూట్‌తో సహా ఫీచర్‌లతో లోడ్ చేయబడుతుంది. ఇది హై-స్పీడ్ అలర్ట్‌లు, మెసేజ్ నోటిఫికేషన్ అలర్ట్‌లు, డిజిటల్ డాక్యుమెంట్ డిస్‌ప్లే మొదలైనవి పొందుతుంది.

కొత్త TVS Raider రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & మరిన్ని వివరాలు

ఈ బైక్ లోని స్విచ్ గేర్ సరికొత్తది. హ్యాండిల్ బార్ యొక్క ఎడమ వైపు లైటింగ్ మరియు హార్న్ కోసం స్విచ్‌లు ఉన్నాయి. కుడి వైపున వన్-టచ్ స్టార్టర్ బటన్ ఉంది. వీటితో పాటు రైడ్ మోడ్‌ల కోసం కూడా స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ యొక్క ఫ్లిక్ వద్ద మీరు ఎకో మరియు పవర్ మోడ్‌ల మధ్య ఎంచుకోవచ్చు.

కొత్త TVS Raider రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & మరిన్ని వివరాలు

అయితే, మీరు ఇంజిన్ ఆఫ్ చేయడానికి ఇంజిన్ కిల్ స్విచ్‌ని ఉపయోగించడం అలవాటు చేసుకుంటే, ఈ కొత్త రైడ్ మోడ్ స్విచ్ కొంత అలవాటు పడుతుంది. TVS రైడర్ మీ స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవడానికి ఫ్యూయెల్ ట్యాంక్ ముందు USB స్లాట్‌ను కూడా అందిస్తుంది.

కొత్త TVS Raider రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & మరిన్ని వివరాలు

ఇంజిన్ పర్ఫామెన్స్ అండ్ రైడింగ్ ఇంప్రెషన్స్:

TVS Raider స్టార్ట్ బటన్ స్టార్ట్ చేసిన వెంటనే మీకు ఒక ఫ్రీమియం అనుభూతి కలుగుతుంది. ఈ బైక్ నిశ్శబ్దంగా స్టార్ట్ అవుతుంది. కంపెనీ 125 సిసి సెగ్మెంట్‌కి సరికొత్త బాల్‌గేమ్‌ని తీసుకొచ్చిందని గ్రహించవచ్చు. ఇది ఇక్కడ పని చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ (ISG). గతంలో అనేక టీవీఎస్ మోటార్‌సైకిళ్లు లోతైన, బస్సీ ఎగ్జాస్ట్ నోట్‌లను కలిగి ఉన్నాయి, అదేవిధంగా ఈ కొత్త TVS Raider కూడా దానిని ముందుకు తీసుకువెళుతుంది.

కొత్త TVS Raider రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & మరిన్ని వివరాలు

బైక్ వైపు చూడకుండా ఎవరైనా దూరం నుండి ఈ ఎగ్సాస్ట్ నోట్ వింటే, అది 125 సిసి ఇంజిన్ ఈ ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది అని గుర్తించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. మోటార్‌సైకిల్ రివ్-రేంజ్ అంతటా గొప్ప సౌండ్‌ట్రాక్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6,500 ఆర్‌పిఎమ్ తర్వాత కొద్దిగా ఒత్తిడికి గురైనట్లు అనిపిస్తుంది.

కొత్త TVS Raider రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & మరిన్ని వివరాలు

మేము ఈ బైక్ బ్రాండ్ యొక్క హోసూర్ ప్రొడక్షన్ ఫెసిలిటీ లోపల ఉన్న TVS టెస్ట్ ట్రాక్‌లో రైడ్ చేసాము. ఇది ఒక రైడర్ టెస్ట్ చేయడానికి ఒక అనువైన ప్రదేశం కాదు. మేము ఈ బైక్ ని త్వరలో వాస్తవ ప్రపంచంలో పరీక్షిస్తాము. అయితే ట్రాక్‌లోని రైడ్ TVS Raider యొక్క స్పోర్ట్‌నెస్‌తో పరిచయం చేయడానికి సహాయపడింది.

కొత్త TVS Raider రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & మరిన్ని వివరాలు

ఇది TVS రేసింగ్ బ్యాడ్జ్‌లకు తగినంత స్పోర్టివ్ కాదు, కానీ TVS రేసింగ్ లోగో అన్ని ఇతర మోటార్‌సైకిళ్ల కంటే స్పోర్టివ్‌గా ఉంటుంది. ఈ స్పోర్టీనెస్ యొక్క రహస్యం 'పవర్ టు వెయిట్ రేషియో'.

TVS Raider బైక్ 124.8 సీసీ, సింగిల్ సిలిండర్ ఎయిర్ అండ్ ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 11.2 బిహెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 11.2 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జత చేయబడి ఉంటుంది.

కొత్త TVS Raider రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & మరిన్ని వివరాలు

ప్రస్తుతం KTM 125 Duke, KTM RC 125 మరియు Bajaj Pulsar NS 125 తర్వాత భారతదేశంలో విక్రయించబడుతున్న నాల్గవ అత్యంత శక్తివంతమైన 125 సిసి మోటార్‌సైకిల్ ఈ TVS Raider. ఇది ప్రీమియం కమ్యూటర్ మోటార్‌సైకిల్ అయితే మిగిలినవి పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిళ్లు.

కొత్త TVS Raider రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & మరిన్ని వివరాలు

TVS Raider 123 కేజీల బరువును కలిగి ఉంటుంది, కావున ఇది పైన పేర్కొన్న బైకులకంటే కూడా తక్కువ బరువును కలిగి ఉంటుంది. యాక్సరేషన్ చాలా వేగంగా ఉంది, కావున మీకు తెలియకముందే, గంటకు 60 కిమీ దాటారు. గంటకు 90 కిమీ కూడా చాలా త్వరగా చేరుకుంటుంది. ఆ తర్వాత మోటార్‌సైకిల్ నెమ్మదిస్తుంది.

కొత్త TVS Raider రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & మరిన్ని వివరాలు

TVS Raider బైక్ గంటకు 99 కిమీ గరిష్ట వేగాన్ని క్లెయిమ్ చేస్తుంది, అయితే మేము స్పీడోమీటర్ లో గంటకు 107 కి.మీ గమనించాము.

TVS Raider యొక్క రైడింగ్ పొజిషన్ చాలా అనుకూలంగా ఉంటుంది. రైడర్ కి హ్యాండిల్‌బార్‌ చాల అనుకూలంగా ఉంటుంది. రైడర్ యొక్క బాడీ ఎగువ సగం రిలాక్స్డ్ పొజిషన్‌లో ఉంది. మరోవైపు, దిగువ సగం ఫుట్‌పెగ్‌ల స్థానం కూడా బాగుంది. ఇది రైడర్ ఇంధన ట్యాంకును బాగా పట్టుకోవడానికి కూడా అనుమతిస్తుంది.

కొత్త TVS Raider రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & మరిన్ని వివరాలు

ఈ కొత్త మోటార్‌సైకిల్ చాలా తేలికగా ఉండటమే కాకుండా చాలా షార్ప్ గా ఉందని గమనించాము. ఈ బైక్ నగర మరియు సాధారణ ప్రాంతాలలో ఉపయోగించడానికి అనుగుణంగా ఉంది. లో-ఎండ్ టార్క్ చాలా బాగుంది మరియు ఇది 5 వ గేర్‌లో 2,000 ఆర్‌పిఎమ్ కంటే తక్కువ నుండి లాగుతుంది. ఇది రైడింగ్‌కి మరింత సహాయపడుతుంది.

కొత్త TVS Raider రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & మరిన్ని వివరాలు

మీరు దానిని బహిరంగ రహదారిపైకి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటే, మోటార్‌సైకిల్ 5,000 ఆర్‌పిఎమ్ వద్ద గంటకు 70 కిమీ వరకు మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 90 కిమీ వరకు ఉంటుంది. గంటకు 90 కిమీ వద్ద ప్రయాణించడం కొంచెం ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంటుంది, కానీ గంటకు 70 నుంచి 75 కిమీ వేగంతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు.

కొత్త TVS Raider రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & మరిన్ని వివరాలు

ఈ బైక్ యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో 30 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో 5-స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ ద్వారా నిర్వహించబడతాయి. సస్పెన్షన్ సెటప్ చాలా స్మూత్ గా ఉంటుంది కావున, అధిక వేగంలో కూడా స్థిరత్వాన్ని అందిస్తుంది. అంతే కాకుండా ఎలాంటి రోడ్డులో అయినా సజావుగా ముందుకు సాగుతుంది.

కొత్త TVS Raider రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & మరిన్ని వివరాలు

ఇందులోని బ్రేకింగ్ సెటప్ విషయానికి వస్తే, ముందు భాగంలో 240 మిమీ పెటల్ డిస్క్ మరియు వెనుక భాగంలో 130 మిమీ డిస్క్‌ బ్రేక్ ఉంటుంది. ఇది కంబైన్డ్ బ్రేకింగ్ మెకానిజంతో అనుబంధంగా ఉంటుంది. TVS Raider బైక్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ కలిగి యూరోగ్రిప్ రెమోరా టైర్లతో నడుస్తుంది. రిమోరా బ్రాండ్ టైర్లు ఎల్లప్పుడూ అద్భుతమైనవి మరియు అసాధారణమైన పట్టును అందిస్తాయి.

కొత్త TVS Raider రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & మరిన్ని వివరాలు

కాంపిటీషన్:

ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం 125 సిసి విభాగంలో ద్విచక్ర వాహన కొనుగోలుదారులు కేవలం కమ్యూటర్ మోటార్‌సైకిల్స్ మాత్రమే కొనుగోలు చేశారు. కానీ కాలక్రమంలో 125 సిసి విభాగం కమ్యూటర్ మోటార్‌సైకిల్స్ మరియు పర్ఫామెన్స్ మోటార్‌సైకిల్స్ అని విభజించబడ్డాయి.

కొత్త TVS Raider రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & మరిన్ని వివరాలు

మార్కెట్లో KTM 125 Duke, RC 125 మరియు Bajaj Pulsar వంటి బైక్‌లు పర్ఫామెన్స్ బైకులు కాగా, మరోవైపు Honda SP 125, Bajaj Pulsar 125, Honda CB Shine మరియు Hero Glamour i3S వంటి బైకులు కమ్యూటర్ విభాగంలో ఉన్నాయి. ఏది ఏమైనా TVS Raider బైక్ చాలా స్పోర్టివ్‌గా ఉండి, రోజు వారీ ప్రయాణికులు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ కొత్త TVS Raider యువ కొనుగోలుదారులకు ఆకర్షణీయమై ఎంపిక అవుతుంది.

కొత్త TVS Raider రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & మరిన్ని వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

కమ్యూటర్ మోటార్ సైకిల్ విభాగంలో TVS Raider మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉండి, అద్భుతమైన పవర్‌ట్రెయిన్‌ అందించి ఈ సెగ్మెంట్‌లో మంచి ఆదరణ పొందే అవకాశం ఉంది.

మేము ఈ కొత్త TVS Raider మోటార్‌సైకిల్‌ను ట్రాక్‌పై మాత్రమే నడిపాము, కానీ ఇది మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. వాస్తవ ప్రపంచంలో బైక్ నడపడం కోసం మేము ఎదురు చూస్తున్నాము. త్వరలో రోడ్ టెస్ట్ చేస్తాము. రోడ్ టెస్ట్ రివ్యూ కోసం మరియు ఎప్పటికప్పుడు కొత్త బైక్స్ మరియు కార్లకు సంబంధిచిన సమాచారం కోసం మా DriveSpark ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Tvs raider 125 telugu review riding impressions engine specs performance features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X