ఆర్15, ఎమ్‌టి 15 మోటార్‌సైకిళ్లలో కొత్త యమహా వై-కనెక్ట్ బ్లూటూత్ ఫీచర్, త్వరలోనే లాంచ్!

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఆర్15, ఎమ్‌టి 15 మోటార్‌సైకిళ్లు ఇప్పుడు సరికొత్త బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌తో రానున్నాయి. దేశీయ విపణిలో యమహా తమ సరికొత్త ఎఫ్‌జెడ్-ఎక్స్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసిన సందర్భంగా, కంపెనీ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఆర్15, ఎమ్‌టి 15 మోటార్‌సైకిళ్లలో కొత్త యమహా వై-కనెక్ట్ బ్లూటూత్ ఫీచర్, త్వరలోనే లాంచ్!

యమహా తమ అన్ని భారతీయ మోడళ్లలో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌ను అందించాలని ప్లాన్ చేస్తోంది. యమహా ఎఫ్‌జెడ్ సిరీస్ మోటార్‌సైకిళ్లలో కంపెనీ ఇప్పటికే అందిస్తున్న బ్లూటూత్ కనెక్టివిటీని, తాజాగా తమ ఫాసినో 125 మరియు రే జెడ్ఆర్ స్కూటర్లకు కూడా విస్తరించింది. మరికొన్ని రోజుల్లోనే ఈ అప్‌డేటెడ్ యమహా స్కూటర్ల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

ఆర్15, ఎమ్‌టి 15 మోటార్‌సైకిళ్లలో కొత్త యమహా వై-కనెక్ట్ బ్లూటూత్ ఫీచర్, త్వరలోనే లాంచ్!

కాగా, తాజాగా కంపెనీ అందిస్తున్న ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్‌లు అయిన ఆర్15 మరియు ఎమ్‌టి15 మోడళ్లలో కూడా కంపెనీ బ్లూటూత్ కనెక్టివిటీని తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు, ఇవి సరికొత్త వై-కనెక్ట్ అనే లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌ను కలిగి ఉండనున్నాయి. యమహా వై-కనెక్ట్ ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న కనెక్ట్ ఎక్స్ టెక్నాలజీ కన్నా ఎన్నో రెట్లుగా మెరుగ్గా ఉంటుంది.

ఆర్15, ఎమ్‌టి 15 మోటార్‌సైకిళ్లలో కొత్త యమహా వై-కనెక్ట్ బ్లూటూత్ ఫీచర్, త్వరలోనే లాంచ్!

ప్రస్తుతం యమహా భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎఫ్‌జెడ్ఎస్-ఎఫ్ఐ, ఎఫ్‌జెడ్ఎస్-ఎఫ్ఐ వింటేజ్ ఎడిషన్ వంటి కొన్ని మోడళ్లలో యమహా కనెక్ట్ ఎక్స్ అనే బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌ను అందిస్తోంది. కానీ, ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన సరికొత్త 2021 యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్‌లో మాత్రం కంపెనీ తమ సరికొత్త యమహా వై-కనెక్ట్ ఫీచర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది.

ఆర్15, ఎమ్‌టి 15 మోటార్‌సైకిళ్లలో కొత్త యమహా వై-కనెక్ట్ బ్లూటూత్ ఫీచర్, త్వరలోనే లాంచ్!

యమహా అందిస్తున్న కనెక్ట్ ఎక్స్ బ్లూటూత్ కనెక్టివిటీ కన్నా ఈ కొత్త వై కనెక్ట్ ఫీచర్ ఖచ్చితంగా డబ్బుకు ఎక్కువ విలువను అందిస్తుంది. ఈ టెక్నాలజీలో ఫోన్ కాల్స్ ఆన్సర్ మరియు రిజెక్ట్, ఎస్ఎమ్ఎస్ అలెర్ట్స్, బైక్‌కు కనెక్ట్ చేయబడిన ఫోన్ యొక్క బ్యాటరీ స్థాయి, ఇంధన వినియోగం, మెయింటినెన్స్ రిమైండర్, చివరిగా బైక్‌ను పార్క్ చేసిన ప్రదేశం, బైక్‌లోని లోపాలను తెలిపే నోటిఫికేషన్స్ మరియు ర్యాంకింగ్‌లు మొదలైన వివరాలను తెలుసుకోవచ్చు.

ఆర్15, ఎమ్‌టి 15 మోటార్‌సైకిళ్లలో కొత్త యమహా వై-కనెక్ట్ బ్లూటూత్ ఫీచర్, త్వరలోనే లాంచ్!

ఈ సరికొత్త యమహా వై-కనెక్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ టెక్నాలజీ సాయంతో ఆర్15 మరియు ఎమ్‌టి15 రైడర్లు తమ బైక్‌లను వారి స్మార్ట్‌ఫోన్‌లతో అనుసంధానం చేసుకొని పైన తెలిపిన ఫీచర్లను యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే, ఈ రెండు మోటార్‌సైకిళ్లలో కంపెనీ ఈ ప్రత్యేక ఫీచర్‌ను ఎప్పుడు ప్రవేశపెడుతుంది అనే విషయాన్ని ఇంకా ఖచ్చితంగా వెల్లడించలేదు.

ఆర్15, ఎమ్‌టి 15 మోటార్‌సైకిళ్లలో కొత్త యమహా వై-కనెక్ట్ బ్లూటూత్ ఫీచర్, త్వరలోనే లాంచ్!

ప్రస్తుత యమహా కనెక్ట్ ఎక్స్ బ్లూటూత్ టెక్నాలజీతో పోల్చుకుంటే ఈ సరికొత్త యమహా వై-కనెక్ట్ బ్లూటూత్ టెక్నాలజీ మరింత ప్రీమియంగా ఉంటుంది. కాబట్టి, ఈ ఫీచర్‌తో రాబోయే కొత్త మోటార్‌సైకిళ్ల ధరలు కూడా కాస్తంత ప్రీమియంగానే ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, యమహా ఎమ్‌టి-15 నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ మోటార్‌సైకిల్‌లో కంపెనీ ఓ డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్ వేరియంట్‌ను కూడా తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. - దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

ఆర్15, ఎమ్‌టి 15 మోటార్‌సైకిళ్లలో కొత్త యమహా వై-కనెక్ట్ బ్లూటూత్ ఫీచర్, త్వరలోనే లాంచ్!

యమహా ఎమ్‌టి-15 ఈ (150సీసీ) విభాగంలోనే భారత మార్కెట్లో విక్రయించబడుతున్న మోటార్‌సైకిళ్ళలో లిక్విడ్-కూలింగ్ టెక్నాలజీ కలిగి ఉన్న ఏకైక స్ట్రీట్ ఫైటర్ మోటార్‌సైకిల్. అంతేకాదు ఇది ఈ విభాగంలోనే అత్యంత శక్తివంతమైన స్ట్రీట్ మోటార్‌సైకిల్ కూడా. ఇందులోని 155సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 18.4 బిహెచ్‌పి శక్తిని మరియు 14.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్పర్ అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఆర్15, ఎమ్‌టి 15 మోటార్‌సైకిళ్లలో కొత్త యమహా వై-కనెక్ట్ బ్లూటూత్ ఫీచర్, త్వరలోనే లాంచ్!

ఇకపోతే, యమహా అందిస్తున్న ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ ఆర్15 వెర్షన్ 3.0లో కంపెనీ ఇటీవలే సైలెంట్‌గా ఓ కొత్త కలర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త 2021 మోడల్ యమహా ఆర్15 వి3.0 ఇప్పుడు స్పోర్టీ రెడ్ కలర్ ఆప్షన్‌లో లభ్యం కానుంది. ఇంజన్ విషయానికి వస్తే, ఈ బైక్‌లోని 155సిసి, సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 18 బిహెచ్‌పి పవర్‌ను మరియు 14.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్పర్ అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఆర్15, ఎమ్‌టి 15 మోటార్‌సైకిళ్లలో కొత్త యమహా వై-కనెక్ట్ బ్లూటూత్ ఫీచర్, త్వరలోనే లాంచ్!

ప్రస్తుతం భారత మార్కెట్లో యమహా ఎమ్‌టి-15 మోటార్‌సైకిల్ ప్రారంభ ధర రూ.1,41 లక్షలుగా ఉంటే, యమహా ఆర్15 ప్రారంభ ధర రూ.1.50 లక్షలు ఉంది (రెండు ధరలు ఎక్స్-షోరూమ్).

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha R15 And MT15 To Get All New Y-Connect Bluetooth Tech Update, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X