మార్కెట్లో BMW F850 GS మరియు F850 GS Adventure మోటార్‌సైకిళ్ల విడుదల: ధరలు, ఫీచర్లు

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ (BMW Motorrad) భారత మార్కెట్లో మరో రెండు కొత్త మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్ విభాగంలో బిఎమ్‌డబ్ల్యూ ఎఫ్850 జిఎస్ (BMW F850 GS) ఎఫ్850 జిఎస్ అడ్వెంచర్ (F850 GS Adventure) అనే రెండు కొత్త మోడళ్లను కంపెనీ విడుదల చేసింది. దేశీయ విపణిలో వీటి ధరలు వరుసగా రూ. 12.5 లక్షలు మరియు రూ. 13.25 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి.

మార్కెట్లో BMW F850 GS మరియు F850 GS Adventure మోటార్‌సైకిళ్ల విడుదల: ధరలు, ఫీచర్లు

బిఎమ్‌డబ్ల్యూ ఎఫ్850 జిఎస్ మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎఫ్850 జిఎస్ అడ్వెంచర్ రెండూ కూడా ఇంపోర్టెడ్ మోటార్‌సైకిళ్లు. బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ ఈ రెండు మోటార్‌సైకిళ్లను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో పూర్తిగా విదేశాలలో తయారు చేయబడిన వాటిని భారతదేశానికి దిగుమతి చేసుకొని విక్రయిస్తుంది. కంపెనీ ఇప్పటికే ఈ కొత్త మోటార్‌సైకిళ్ల కోసం బుకింగ్‌లను స్వీకరించడం కూడా ప్రారంభించింది. సమాచారం ప్రకారం, జూన్ 2022 నెల నుండి ఈ బైక్ డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.

మార్కెట్లో BMW F850 GS మరియు F850 GS Adventure మోటార్‌సైకిళ్ల విడుదల: ధరలు, ఫీచర్లు

బిఎమ్‌డబ్ల్యూ ఎఫ్850 జిఎస్ మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎఫ్850 జిఎస్ అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లు రెండూ కూడా డిజైన్ పరంగా స్వల్ప వ్యత్యాసాలను కలిగి ఉన్నప్పటికీ, ఇంజన్ పరంగా మరియు మెకానికల్‌గా ఒకే రకంగా ఉంటాయి. ఈ రెండు మోడళ్లలో ఒకే రకమైన 853 సిసి లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్ ప్యారలల్-ట్విన్ ఇంజన్ ఉపయోగించబడి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 94 బిహెచ్‌పి పవర్ ను మరియు 6,250 ఆర్‌పిఎమ్ వద్ద 92 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సున్నితమైన మరియు త్వరిత గేర్ చేంజ్ రెస్పాన్స్ కోసం ఇది కౌంటర్ బ్యాలెన్సర్‌లను కలిగి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

మార్కెట్లో BMW F850 GS మరియు F850 GS Adventure మోటార్‌సైకిళ్ల విడుదల: ధరలు, ఫీచర్లు

కొత్త బిఎమ్‌డబ్ల్యూ F850 ​​GS మరియు F850 ​​GS అడ్వెంచర్ రెండూ కూడా 'ప్రో' రైడింగ్ మోడ్స్‌తో లభ్యం కానున్నాయి. ఇవి కాకుండా, ఇందులో సాధారణ రోడ్ మరియు రెయిన్ మోడ్‌లతో పాటు 2 అదనపు రైడింగ్ మోడ్‌లు కూడా ఉంటాయి. ఈ రెండు 'ప్రో' రైడింగ్ మోడ్‌లలో ఒకటి డైనమిక్ మోడ్ కాగా మరొకటి ఎండ్యూరో మోడ్. ఈ అధునాతన లగ్జరీ బైక్‌లలో ఏబిఎస్, ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్‌తో సహా అనేక ఇతర భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంకా ఇందులో డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్‌గా సర్దుబాటు చేయగల సస్పెన్షన్ మరియు బ్యాంకింగ్ సామర్థ్యం గల 'ABS ప్రో' వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

మార్కెట్లో BMW F850 GS మరియు F850 GS Adventure మోటార్‌సైకిళ్ల విడుదల: ధరలు, ఫీచర్లు

అంతేకాకుండా, కంపెనీ ఈ రెండు మోడళ్లలో పెద్ద 6.5 ఇంచ్ టిఎఫ్‌టి డిస్‌ప్లేను కూడా అందిస్తోంది. ఇది లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. ఇందులోని బ్లూటూత్ కనెక్టివిటీ టెక్నాలజీ ద్వారా రైడర్‌లు తమ స్మార్ట్‌ఫోన్‌ను బైక్‌తో రిమోట్‌గా అనుసంధానించుకోవచ్చు. దాని సాయంతో టెలిఫోన్ కాల్‌లు చేయడం మరియు సంగీతం వినడం వంటి టాస్క్ లు చేయవచ్చు. అంతేకాకుండా, రైడర్‌లు BMW Motorrad యొక్క మల్టీ-కంట్రోలర్‌ని ఉపయోగించి వాహనంలోని వివిధ ఫీచర్లను మరియు కనెక్టివిటీ ఫంక్షన్‌లను కూడా యాక్సెస్ చేయవచ్చు.

మార్కెట్లో BMW F850 GS మరియు F850 GS Adventure మోటార్‌సైకిళ్ల విడుదల: ధరలు, ఫీచర్లు

ఈ బైక్‌లలో గూగుల్ ఆధారిత నావిగేషన్ కూడా ఉంటుంది. రైడర్లు BMW Motorrad కనెక్ట్ యాప్‌తో, టిఎఫ్‌టి డిస్‌ప్లేలో నేరుగా నావిగేషన్‌కు యాక్సెస్‌ను పొందవచ్చు. కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే, BMW F850 ​​GS రేసింగ్ బ్లూ మెటాలిక్ పెయింట్ స్కీమ్‌తో ర్యాలీ స్టైల్ లో అందుబాటులో ఉంటుంది. కాగా, BMW F850 GS Adventure కలమటా మెటాలిక్ మ్యాట్ పెయింట్‌వర్క్ తో కూడిన ర్యాలీ స్టైల్ లో కానీ లేదా బ్లాక్ స్టార్మ్ మెటాలిక్ కలర్ స్కీమ్‌ తో కూడిన స్టైల్ ట్రిపుల్ బ్లాక్ ప్యాకేజ్ లో కానీ అందుబాటులో ఉంటుంది.

మార్కెట్లో BMW F850 GS మరియు F850 GS Adventure మోటార్‌సైకిళ్ల విడుదల: ధరలు, ఫీచర్లు

కొత్త బిఎమ్‌డబ్ల్యూ F850 ​​GS మరియు F850 ​​GS అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లను భారత మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా, బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవా మాట్లాడుతూ, తమ F850 ​​GS సిరీస్ మోటార్‌సైకిళ్లు అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్ ఔత్సాహికుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడ్డాయని, ఇవి రైడర్లకు కొత్త రకం ఆఫ్-రోడింగ్ అనుభూతిని అందిస్తాయని తెలిపారు. ఈ అడ్వెంచర్ బైక్ ల పట్ల ఆసక్తి ఉన్న కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్ లో కానీ లేదా బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ డీలర్‌షిప్‌లో కానీ బుక్ చేసుకోవచ్చు.

మార్కెట్లో BMW F850 GS మరియు F850 GS Adventure మోటార్‌సైకిళ్ల విడుదల: ధరలు, ఫీచర్లు

ఇదిలా ఉంటే, బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ (BMW Motorrad) తమ టూవీలర్లలో ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతను పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే, తాజాగా డ్రైవర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా మరియు సర్దుబాటు చేయడానికి వీలుండేలా ఓ ప్రత్యేకమైన సీటును డిజైన్ చేసింది. త్వరలోనే ఇది కంపెనీ విక్రయిస్తున్న ప్రముఖ ద్విచక్ర వాహనాల్లో కూడా అందుబాటులోకి రానుంది. - దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Thursday, April 14, 2022, 17:23 [IST]
English summary
Bmw motorrad launches f 850 gs and gs adventure bikes in india price specs features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+