Bounce Infinity E1 స్కూటర్ టెస్ట్ రైడ్ షురూ.. హైదరాబాద్‌లో టెస్ట్ రైడ్ ఎప్పుడంటే?
భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఉన్న కారణంగా బౌన్స్ కంపెనీ తన 'బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1' ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఇప్పటికే విడుదల చేసింది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెస్ట్ రైడ్స్ అనేవి ఫిబ్రవరి 24 నుంచి దేశంలో ఎంపిక చేసిన నగరాల్లో ప్రారంభమయ్యాయి. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

'బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1' ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్స్ యొక్క ఫేజ్ 1 ఇప్పుడు ప్రారంభమైంది. కావున ఈ దశలో టెస్ట్ రైడ్ బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సిఆర్, ముంబై, హైదరాబాద్, పూణే, చెన్నై మరియు కొచ్చి వంటి నగరాల్లో ప్రారంభమవుతుంది. కావున టెస్ట్ రైడ్ చేయాలనుకునే కస్టమర్లు ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చు.

బౌన్స్ కంపెనీ అనేది 2018లో మొదటిసారిగా ప్రారంభించబడినప్పుడు స్కూటర్ అద్దె కంపెనీగా మాత్రమే ప్రారంభమైంది. ఇది దాని పోర్ట్‌ఫోలియో క్రింద అనేక విభిన్న బ్రాండ్‌ల స్కూటర్‌లను కలిగి ఉండటం వల్ల గణనీయమైన విజయాన్ని సాధించింది. అయితే ఆ తరువాత కాలంలో బౌన్స్ ఎలక్ట్రిక్ వాహనాల వైపు ద్రుష్టి పెట్టి ఆ దిశగా పరుగులు తీసింది.

ఇందులో భాగంగానే ఇప్పుడు బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1' ఎలక్ట్రిక్ స్కూటర్ పుట్టుకొచ్చింది. ఇది 2021 డిసెంబర్ నెలలో విడుదలైంది. బౌన్స్ ఇన్ఫినిటీ E1 ప్రారంభ ధర రూ. 36,000 (ఎక్స్-షోరూమ్). ఇది మార్కెట్లో చాలా తక్కువ ధర వద్ద లభించే ఆధునిక స్కూటర్.

ప్రస్తుతం బౌన్స్ కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని బ్యాటరీ ప్యాక్ లేకుండా విక్రయిస్తుంది. ఎందుకంటే, 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్' కాన్సెప్ట్‌ను భారత్‌లో లాంచ్ చేసిన మొదటి కంపెనీ బౌన్స్. కొనుగోలుదారులు కేవలం బ్యాటరీని ఉపయోగించి సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు. దీని ప్రకారం, వినియోగదారు సమీపంలోని బ్యాటరీ-స్వాపింగ్ స్టేషన్ ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల సమయం చాలా వరకు పొదుపుచేయబడుతుంది.

బౌన్స్ కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, బ్యాటరీ స్వాపింగ్ వల్ల నిర్వహణ ఖర్చులు దాదాపు 40 శాతం వరకు తగ్గుతాయి. ప్రస్తుతం ఇంధన ధరలు పెరుగుతున్న సమయంలో ఈ స్కూటర్ కొనుగోలుదారులకు ఒక వరం అనే చెప్పాలి. అయితే ఈ స్కూటర్ లో మీకు బ్యాటరీ ఆప్సన్ కూడా కావాలంటే కంపెనీ దానికి కూడా అనుమతిస్తుంది.

వినియోగదారులు సబ్‌స్క్రిప్షన్ ప్రాతిపదికన ఈ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్‌లకు యాక్సెస్ కలిగి ఉంటారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని, EV వినియోగం విషయానికి వస్తే బౌన్స్ ఒక కొత్త వ్యూహాన్ని రూపొందించినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ దేశవ్యాప్తంగా ఈ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ల స్థాపనను కూడా చేపట్టింది మరియు బ్యాటరీ స్వాపింగ్ కల్పిస్తున్న మొదటి నగరం బెంగళూరు.

బౌన్స్ ఇన్ఫినిటీ E1 స్కూటర్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది క్రూయిజ్ కంట్రోల్, జియో-ఫెన్సింగ్, టో అలర్ట్ మరియు యాంటీ థెఫ్ట్ వంటి మంచి ఫీచర్లతో వస్తుంది. ఇది LED లైటింగ్ మరియు LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది. బౌన్స్ ఇన్ఫినిటీ E1 స్కూటర్ 2 కిలోవాట్ బ్యాటరీతో శక్తిని పొందుతుంది, ఇది 2.2 kW మోటార్‌కు శక్తిని పంపుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 65 కిమీ మరియు క్లెయిమ్ చేయబడింది. కావున దీని గరిష్ట పరిధి 85 కిలోమీటర్లు.

బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీలు 2022 మార్చి నుంచి ప్రారంభమవుతాయి. ఇప్పుడు బెంగుళూరులో కస్టమర్ టెస్ట్ రైడ్‌లు అనుభవించవచ్చు. ఆ తర్వాత మార్చి 04 న ఢిల్లీ-NCR ప్రారంభమవుతుంది. టెస్ట్ రైడ్ స్కూటర్లు మార్చి 10 నుండి కొచ్చిలో అందుబాటులో ఉంటాయి, ముంబై, పూణే, హైదరాబాద్ మరియు చెన్నైలలో టెస్ట్ రైడ్‌లు మార్చి 15, 2022 నుండి ప్రారంభమవుతాయి. ఆ నగరాల్లో ఈ స్కూటర్ టెస్ట్ రైడ్ చేయాలనుకునే వారు ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చు.

బౌన్స్ ఇన్ఫినిటీ E1 స్కూటర్ మిగిలిన ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగా ఎక్కువ ఫీచర్స్ పొందినప్పటికీ, ఇది వినియోగదారుకు చాలా ఆకర్షణీయమైన ధర వద్ద లభిస్తుంది. రోజువారీ నగరప్రయాణానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన రెండు నెలల తర్వాత, స్కూటర్ కోసం టెస్ట్ రైడ్‌లు ప్రారంభమయ్యాయి. కావున ఇక డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయి.
ఇటీవల మేము బౌన్స్ ఇన్ఫినిటీ E1 స్కూటర్ టెస్ట్ రైడ్ చేసాము. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








