ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి 'Hero Electric' కొత్త వ్యూహం.. కస్టమర్లకు ఇది శుభవార్తే

భారతీయ మార్కెట్లో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. ఈ తరుణంలో దాదాపు చాలా వాహన తయారరీ సంస్థలు తమ ఉత్పత్తులను ఎలక్ట్రిక్ విభాగంలో విడుదల చేయడమే కాకూండా తమ ఉత్పత్తి సామర్త్యాన్ని కూడా పెంచుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో ఎలక్ట్రిక్' (Hero Electric) పెరుగుతున్న డిమాండ్ దృష్టిలో ఉంచుకుని తమ ఉత్పత్తిని పెంచుకోవడానికి కొత్త ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి 'Hero Electric' కొత్త వ్యూహం.. కస్టమర్లకు ఇది శుభవార్తే

నివేదికల ప్రకారం, హీరో ఎలక్ట్రిక్ కొత్త ఎలక్ట్రిక్ వాహనాల ప్లాంట్స్ ఏర్పాటు చేస్తే.. ఉత్పత్తి సామర్థ్యాన్ని 50 లక్షల యూనిట్లకు చేరుకుంటుంది. దీనికోసం కంపెనీ రూ. 1500 నుంచి రూ. 2000 కోట్ల పెట్టుబడి పెట్టనుంచి. కొత్త ప్లాంట్లను కంపెనీ పశ్చిమ మరియు దక్షిణ ఇండియాలలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి 'Hero Electric' కొత్త వ్యూహం.. కస్టమర్లకు ఇది శుభవార్తే

ప్రస్తుతం కంపెనీ 2,50,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే ఉన్న డిమాండ్ తీర్చడానికి ఈ సామర్థ్యం సరిపోదు. అంతే కాకుండా బుక్ చేసుకున్న కస్టమర్లకు సరైన సమయంలో డెలివరీలను అందించే అవకాశం ఉండదు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని కంపెనీ ఇప్పుడు కొత్త ప్లాంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టనుంది.

ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి 'Hero Electric' కొత్త వ్యూహం.. కస్టమర్లకు ఇది శుభవార్తే

దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌ వేగంగా అభివృద్ధి చెందుతోంది, ఈ విభాగంలో ఇప్పటికే ఉన్న ఆటో కంపెనీలు మాత్రమే కాకూండా కొత్త కొత్త కంపెనీలు కూడా ఈ విభాగంలోకి అడుగుపెడుతున్నాయి. హీరో ఎలక్ట్రిక్ ప్రస్తుతం ఈ విభాగంలో అమ్మకాల పరంగా ముందు స్థానంలో కొనసాగుతోంది. దీనిని ఇలాగె కొనసాగించడానికి ఉత్పత్తులను మరింత వేగవంతం చేయడం ఎంతైనా అవసరం.

ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి 'Hero Electric' కొత్త వ్యూహం.. కస్టమర్లకు ఇది శుభవార్తే

2025 నాటికి ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో 30% ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయని హీరో ఎలక్ట్రిక్ MD పవన్ ముంజాల్ అన్నారు. కావున దీనికి కావాల్సిన ఉత్పత్తులను కంపెనీ ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి. లేకుంటే కంపెనీ నష్టాల్లో నడిచే అవకాశం ఉంటుందని కూడా అయన అన్నారు. కావున కస్టమర్లకు కావాల్సిన సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను అందించడానికి ఉత్పత్తి పెంచాల్సిన ఆవసరం ఉంది. అందుకే కొత్త ప్లాంట్స్ త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు.

ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి 'Hero Electric' కొత్త వ్యూహం.. కస్టమర్లకు ఇది శుభవార్తే

ఇదిలా ఉండగా ఇటీవల కంపెనీ హీరో ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు 'హీరో ఎడ్డీ' (Hero Eddy). ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లైట్ వెయిట్ మరియు మంచి డిజైన్ కలిగి ఉంటుంది. కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త Eddy ఎలక్ట్రిక్ స్కూటర్ రోజూ వినియోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి 'Hero Electric' కొత్త వ్యూహం.. కస్టమర్లకు ఇది శుభవార్తే

'హీరో ఎడ్డీ' (Hero Eddy) ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రతి రోజు వినియోగించడానికి మరియు వినియోగదారులు అవసరాలకు తగినట్లుగా మరియు తక్కువ దూరం కోసం రూపొందించబడింది. కొత్త హీరో ఎడ్డీ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.72,000 (ఎక్స్-షోరూమ్) గా వెల్లడించింది. ఎల్లో మరియు లైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ స్కూటర్ అందుబాటులో ఉంటుంది.

ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి 'Hero Electric' కొత్త వ్యూహం.. కస్టమర్లకు ఇది శుభవార్తే

సాధారణంగా మోటార్ వాహన చట్టం ప్రకారం వాహనం రోడ్డుపైన నడపాలంటే తప్పనిసరిగా లైసెన్స్ అవసరం, కానీ ఈ 'హీరో ఎడ్డీ' (Hero Eddy) ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు. అంతే కాకూండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే కంపెనీ ఈ ఎలెక్ట్రిక్ స్కూటర్ యొక్క వేగాన్ని కేవలం 25 కిలోమీటర్లకు పరిమితం చేసింది. ఇది మిగిలిన ఎలక్ట్రిక్ బైకులకంటే కూడా తక్కువ వేగం కావున ఈ బైక్ రైడ్ చేయడానికి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు.

ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి 'Hero Electric' కొత్త వ్యూహం.. కస్టమర్లకు ఇది శుభవార్తే

హీరో ఎడ్డీ స్కూటర్‌లో రివర్స్ మోడ్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్, స్లిమ్ ఎల్‌ఈడీ ఇండికేటర్, బ్యాక్‌రెస్ట్ వంటి అనేక ఫీచర్లు అందించబడ్డాయి. కంపెనీ ఈ కొత్త స్కూటర్ కి బాక్సీ డిజైన్ అందించింది. కావున చూడటానికి ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి 'Hero Electric' కొత్త వ్యూహం.. కస్టమర్లకు ఇది శుభవార్తే

కొత్త 'హీరో ఎడ్డీ' (Hero Eddy) ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది మార్కెట్లో అందుబాటులో ఉన్న స్లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ లో ఫైండ్ మై బైక్ ఫీచర్ వంటి లేటెస్ట్ ఫీచర్ కూడా ఉంది. కావున మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లోని బటన్‌ను నొక్కడం ద్వారా పార్కింగ్ స్థలంలో పార్క్ చేసిన స్కూటర్‌ను కనుగొనవచ్చు.

ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి 'Hero Electric' కొత్త వ్యూహం.. కస్టమర్లకు ఇది శుభవార్తే

అంతే కాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో రిమోట్ లాక్ ఫీచర్ కూడా ఉంది, దీని సహాయంతో మీరు స్కూటర్‌కు దూరంగా ఉన్నప్పుడు కూడా దాన్ని లాక్ చేయవచ్చు లేదా అన్‌లాక్ చేయవచ్చు. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలమైన ఫీచర్. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Saturday, March 12, 2022, 9:32 [IST]
English summary
Hero electric to set up four new plants details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+