భారతదేశపు మొట్టమొదటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ నహక్ పి-14 (Nahaq P-14) బుకింగ్స్ ఓపెన్!

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ "నహక్ మోటార్స్" (Nahak Motors) భారత మార్కెట్లో ఓ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ను విడుదల చేయనుంది. చూడటానికి అచ్చం పెట్రోల్ వెర్షన్ స్పోర్ట్స్ బైక్ మాదిరిగా కనిపించే "నహక్ పి-14" (Nahaq P-14) హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ ను కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా పి-14 ఇ-బైక్ కోసం కంపెనీ బుకింగ్‌లను కూడా స్వీకరిస్తోంది.

భారతదేశపు మొట్టమొదటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ నహక్ పి-14 (Nahaq P-14) బుకింగ్స్ ఓపెన్!

నహక్ పి-14 (Nahak P-14) కోసం కంపెనీ ప్రీ-బుకింగ్ లను మార్చి 15 నుండి మార్చి 30 వరకు పరిమిత కాలం పాటు మాత్రమే ఓపెన్ చేయనుంది. ఈ ఏడాది మే నెలలో ఈ బైక్ డెలివరీలను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. మార్కెట్లో పి-14 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ ధర రూ. 2.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. ఆసక్తిగల కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 11,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి దీనిని బుక్ చేసుకోవచ్చు.

భారతదేశపు మొట్టమొదటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ నహక్ పి-14 (Nahaq P-14) బుకింగ్స్ ఓపెన్!

గుడ్ న్యూస్ ఏంటంటే, ప్రీ బుకింగ్ వ్యవధిలో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైక్ ఎమ్ఆర్‌పిపై 10 శాతం తగ్గింపును కూడా అందిస్తోంది. కాబట్టి ఈ ఇ-బైక్ ను ముందుగా బుక్ చేసుకునే వారు తక్కువ ధరకే దీనిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. నహక్ మోటార్స్ తమ పి-14 ఎలక్ట్రిక్ బైక్ ను తొలిసారిగా ఆటో ఎక్స్‌పో 2020 లో ఆవిష్కరించారు. ఈ హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ గరిష్టంగా గంటకు 135 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు.

భారతదేశపు మొట్టమొదటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ నహక్ పి-14 (Nahaq P-14) బుకింగ్స్ ఓపెన్!

అంటే, పెర్ఫార్మెన్స్ విషయంలో ఇది ప్రస్తుత సాంప్రదాయ పెట్రోల్ వాహనాలకు ఏమాత్రం తీసిపోదన్నమాట. నిజానికి ఎలక్ట్రిక్ టూవీలర్లలో ఇదొక గొప్ప టాప్ స్పీడ్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. నహక్ పి-14 హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌ లో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అమర్చబడి ఉంటుంది. ఈ బ్యాటరీని ఇంట్లోనే హోమ్ ప్లగ్ సాయంతోనే ఛార్జ్ చేసుకోవచ్చు. సాధారణ ఛార్జర్‌ ని ఉపయోగించి, ఈ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది.

భారతదేశపు మొట్టమొదటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ నహక్ పి-14 (Nahaq P-14) బుకింగ్స్ ఓపెన్!

నహక్ పి-14 హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. ఈ ఫాస్ట్ చార్జర్ సాయంతో ఈ హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీని కేవలం 30 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో గరిష్టంగా గంటకు 135 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ బైక్, భారతదేశపు మొట్టమొదటి హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ అని కంపెనీ పేర్కొంది. ఈ బైక్‌లో 72v 60Ah లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.

భారతదేశపు మొట్టమొదటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ నహక్ పి-14 (Nahaq P-14) బుకింగ్స్ ఓపెన్!

ఈ బైక్ లో లభించే ప్రధాన ఫీచర్లను గమిస్తే, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన స్ప్లిట్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, షార్ప్ బాడీ లైన్స్, పూర్తి బాడీ ప్యానెల్స్, డిజిటల్ స్పీడోమీటర్, మిడ్-మౌంటెడ్ బిఎల్‌డిసి ఎలక్ట్రిక్ మోటార్, ముందు వైపు డ్యూయెల్ డిస్క్, వెనుక వైపు సింగిల్ డిస్క్ బ్రేక్స్, ముందు వైపు అప్‌సైడ్ డౌన్ ఫోర్కులు, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ సెటప్, 150 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ మొదలైనవి ఉన్నాయి.

భారతదేశపు మొట్టమొదటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ నహక్ పి-14 (Nahaq P-14) బుకింగ్స్ ఓపెన్!

పి-14 ఎలక్ట్రిక్ బైక్ కోసం ప్రీ-బుకింగ్ లను ప్రారంభించిన సందర్భంగా, నహక్ గ్రూప్ చైర్మన్ ప్రవత్ నహక్ మాట్లాడుతూ, "ప్రజలకు మెరుగైన నాణ్యమైన ఎలక్ట్రిక్ బైక్‌ ల ఆప్షన్ ను అందించడం తమ బాధ్యత అని. అయితే, స్మార్ట్ ఎలక్ట్రిక్ బైక్‌ లలో ఇప్పటి వరకు ఎవరూ వేగం గురించి పట్టించుకోలేదని, అందుకే తాము పి-14 తో ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌లో సాటిలేని హై స్పీడ్‌ ని పరిచయం చేస్తున్నామ"ని అన్నారు.

భారతదేశపు మొట్టమొదటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ నహక్ పి-14 (Nahaq P-14) బుకింగ్స్ ఓపెన్!

ప్రవత్ నహక్ మాట్లాడుతూ, తాము తమ వెబ్‌సైట్ ద్వారా భారతదేశపు మొట్టమొదటి హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ Nahak P-14 కోసం ప్రీ-బుకింగ్‌ లను ప్రారంభించామని, ఈ విలాసవంతమైన ఎలక్ట్రిక్ బైక్‌ ను ఎవరైనా 11 వేల రూపాయలతో బుక్ చేసుకోవచ్చని తెలిపారు. తాము ఆటో ఎక్స్‌పో 2020 సందర్భంగా భారతదేశపు మొట్టమొదటి హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్, Nahak P-14ని ప్రారంభించామని, COVID-19 కారణంగా అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ తాము దానిని ఈ బైక్ ప్రారంభించబోతున్నామని చెప్పారు.

భారతదేశపు మొట్టమొదటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ నహక్ పి-14 (Nahaq P-14) బుకింగ్స్ ఓపెన్!

మార్కెట్లో ఒబెన్ రోర్ (Oben Rorr) ఎలక్ట్రిక్ బైక్ విడుదల

ఇదిలా ఉంటే, దేశీయ విపణిలోకి మరొక కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ వచ్చింది. బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ కంపెనీ ఒబెన్ ఎలక్ట్రిక్ (Oben Electric), మార్కెట్లో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 'ఓబెన్ రోర్' (Oben Rorr) ను విడుదల చేసింది. ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ధర రూ.1.25 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. సమాచారం ప్రకారం, ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 200 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుంది. ఒబెన్ రోర్ కోసం మార్చి18వ తేదీ నుండి బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Wednesday, March 16, 2022, 12:19 [IST]
English summary
India s first high speed electric bike nahak p 14 pre bookings open
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+