భారత్‌లో Kawasaki నుంచి కొత్త బైక్ విడుదల: ధర రూ. 8.93 లక్షలు

కవాసకి ఇండియా (Kawasaki India) భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు 2023 'కవాసకి జెడ్900' (Kawasaki Z900) అనే కొత్త బైక్ విడుదల చేసింది. ఈ లేటెస్ట్ బైక్ ధర రూ. 8.93 లక్షలు (ఎక్స్-షోరూమ్).

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజిన్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో Kawasaki నుంచి కొత్త బైక్ విడుదల: ధర రూ. 8.93 లక్షలు

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త కవాసకి జెడ్900 దాని అవుట్‌గోయింగ్ మోడల్ కంటే కూడా రూ. 51,000 ఎక్కువ ధర కలిగి ఉంటుంది. అయితే ఇందులో పెద్దగా చెప్పుకోవాల్సిన అప్డేటెడ్ ఫీచర్స్ మాత్రం లేదు. కానీ ఇది ఇప్పుడు రెండు కొత్త కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. అవి మెటాలిక్ ఫాంటమ్ సిల్వర్/మెటాలిక్ కార్బన్ గ్రే లేదా ఎబోనీ/మెటాలిక్ మ్యాట్ గ్రాఫేన్ స్టీల్ గ్రే కలర్స్ ఇవి రెండు కలర్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే ఈ రెండు కలర్ వేరియంట్ ధరలు ఒకేలా ఉంటాయి.

భారత్‌లో Kawasaki నుంచి కొత్త బైక్ విడుదల: ధర రూ. 8.93 లక్షలు

2023 కవాసకి జెడ్900 బైక్ స్టైలింగ్ పరంగా కానీ, ఫీచర్స్ పరంగా కానీ మరియు మెకానికల్స్ పరంగా కానీ ఎటువంటి మార్పులు చెందలేదు. కావున ఈ బైక్ లో అగ్రెసివ్ హెడ్‌లైట్, మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, స్టెప్-అప్ సీట్ మరియు సైడ్-స్లంగ్ ఎగ్జాస్ట్ వంటివి ఉన్నాయి.

భారత్‌లో Kawasaki నుంచి కొత్త బైక్ విడుదల: ధర రూ. 8.93 లక్షలు

అదే విధంగా ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో కలర్ TFT డిస్ప్లే అందుబాటులో ఉంటుంది. ఇందులో బైక్ కి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. అంతే కాకుండా ఇది బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది. కావున ఇవన్నీ రైడర్ కి రైడింగ్ సమయలో చాలా అనుకూలంగా ఉంటాయి.

భారత్‌లో Kawasaki నుంచి కొత్త బైక్ విడుదల: ధర రూ. 8.93 లక్షలు

కొత్త 2023 కవాసకి జెడ్900 యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 948 సిసి బిఎస్6 ఇన్‌లైన్ ఫోర్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ అందుబాటులో ఉంటుంది. ఇది 9,500 ఆర్‌పిఎమ్ వద్ద 123.6 బిహెచ్‌పి పవర్ మరియు 7,700 ఆర్‌పిఎమ్ వద్ద 98.6 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌కి జత చేయబడి ఉంటుంది. ఇందులో రెయిన్, రోడ్, స్పోర్ట్ మరియు రైడర్ అనే నాలుగు రైడింగ్ మోడ్స్ అందుబాటులో ఉంటాయి. మొత్తం మీద ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

భారత్‌లో Kawasaki నుంచి కొత్త బైక్ విడుదల: ధర రూ. 8.93 లక్షలు

కవాసకి జెడ్900 మంచి సస్పెన్షన్ కూడా పొందుతుంది. ఇందులో భాగంగానే ఈ బైక్ యొక్క ముందు భాగంలో 41 మిమీ USD ఫ్రంట్ పోర్క్, వెనుక భాగంలో మోనోషాక్ సెటప్ ఉంటుంది.

భారత్‌లో Kawasaki నుంచి కొత్త బైక్ విడుదల: ధర రూ. 8.93 లక్షలు

ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ యొక్క ముందు భాగంలో 300 మిమీ డిస్క్ తో కూడిన ఫోర్-పిస్టన్ నిస్సిన్ ఫ్రంట్ కాలిపర్‌లు మరియు వెనుక భాగంలో 250 మిమీ డిస్క్ తో కూడిన సింగిల్-పిస్టన్ కాలిపర్ అందుబాటులో ఉంటాయి. అదే సమయంలో ఇది డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా పొందుతుంది.

భారత్‌లో Kawasaki నుంచి కొత్త బైక్ విడుదల: ధర రూ. 8.93 లక్షలు

ఇండియన్ మార్కెట్లో కవాసకి కంపెనీ యొక్క బైకులు మంచి ఆదరణ పొందుతున్నాయి, అయితే కంపెనీ ఇప్పుడు లాంచ్ చేసిన ఈ కొత్త లేటెస్ట్ బైక్ కూడా తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని ఆశిస్తున్నాము. 2023 కవాసకి జెడ్900 అనేది దేశీయ మార్కెట్లో డుకాటి మాన్‌స్టర్, బిఎండబ్ల్యు ఎఫ్900ఆర్ వంటి వాటికి ప్రత్యర్థిగా వ్యవహరిస్తుంది.

భారత్‌లో Kawasaki నుంచి కొత్త బైక్ విడుదల: ధర రూ. 8.93 లక్షలు

ఇదిలా ఉండగా ఇటీవల కవాసకి దేశీయ విఫణిలోకి 'నింజా జెడ్ఆర్ 10ఆర్' బైకుని రూ. 15.99 లక్షల ధర వద్ద విడుదల చేసింది. 2022 నింజా జెడ్ఎక్స్ 10ఆర్ ధరతో పోలిస్తే, ఈ కొత్త 2023 మోడల్ ధర దాదాపు రూ.85,000 ఎక్కువగా ఉంటుంది. కానీ ధరకు తగ్గట్టుగానే కంపెనీ ఇందులో అప్డేటెడ్ ఫీచర్స్ కూడా అందిస్తోంది. అయితే ఇంజిన్ పరంగా ఎటువంటి మార్పులు లేదు.

భారత్‌లో Kawasaki నుంచి కొత్త బైక్ విడుదల: ధర రూ. 8.93 లక్షలు

కొత్త 2023 కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్‌ అదే 998 సిసి, 4-సిలిండర్, డిఓహెచ్‌సి ఇంజన్‌ను పొందుతుంది. ఇది 13,200 ఆర్‌పిఎమ్ వద్ద 200.2 బిహెచ్‌పి పవర్ మరియు 11,400 ఆర్‌పిఎమ్ వద్ద 114.9 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతేయబడి ఉంటుంది.ఈ బైక్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Wednesday, September 14, 2022, 16:33 [IST]
English summary
Kawasaki z900 launched in india at rs 8 93 lakh details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+