ఓలా ఎస్1కి పోటీగా ఒకినావా ఒకి90 (Okinawa Okhi 90) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, రేంజ్, ఫీచర్లు

భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఒకినావా ఆటోటెక్ (Okinawa Autotech), దేశీయ విపణిలో తమ సరికొత్త "ఒకినావా ఒకి 90"(Okinawa Okhi 90) ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది. ఒకినావా ప్రోడక్ట్ లైనప్‌ లోనే ఇది ప్రీమియంగా స్కూటర్ గా ఉంటుంది. మార్కెట్లో ఒకినావా ఒకి 90 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.21 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది. అయితే, వివిధ రాష్ట్రాలలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీని బట్టి దీని ధరలు మారుతూ ఉంటాయి.

ఓలా ఎస్1కి పోటీగా ఒకినావా ఒకి90 (Okinawa Okhi 90) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, రేంజ్, ఫీచర్లు

ఒకినావా ఒకి 90 ఎలక్ట్రిక్ స్కూటర్ చూడటానికి ట్రెడిషనల్ స్కూటర్ డిజైన్‌ ను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ ముందు భాగంలో, పెద్ద ఎల్ఈడి హెడ్‌ల్యాంప్ సెటప్ ఉంటుంది, కంపెనీ యొక్క బ్రాండ్ లోగో నుండి ప్రేరణ పొంది దీనిని డిజైన్ చేశారు. ఇంకా ఇందులో పెద్ద డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు టర్న్ ఇండికేటర్లు కూడా ఉంటాయి. స్కూటర్ వెనుక భాగంలో పిలియన్ రైడర్ హ్యాండ్ గ్రిప్ కోసం రియర్ గ్రాబ్ రైల్‌ మరియు ఎల్ఈడి టెయిల్‌ ల్యాంప్ సెటప్ కూడా ఉంటుంది.

ఓలా ఎస్1కి పోటీగా ఒకినావా ఒకి90 (Okinawa Okhi 90) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, రేంజ్, ఫీచర్లు

కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో పెద్ద 40 లీటర్ బూట్ స్పేస్ (అండర్ సీట్ స్టోరేజ్)ను మరియు అదనపు స్టోరేజ్ కోసం గ్లోవ్‌బాక్స్ కూడా అందిస్తుంది. ఈ గ్లోవ్ బాక్స్ లో మీ మొబైల్ పరికరాలను ఛార్జ్ చేయడానికి USB పోర్ట్‌ కూడా ఉంటుంది. ఈ స్కూటర్లో లభించే ఇతర ఫీచర్లలో సైడ్ స్టాండ్ సెన్సార్, డిజిటల్ స్పీడోమీటర్, ఆటోమేటిక్ లాకింగ్, యాంటీ-థెఫ్ట్ అలారం, రియల్ టైమ్ ట్రాకింగ్ కోసం జిపిఎస్ మరియు ఫైండ్ మై డివైజ్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి. ఈ ఫీచర్లను యాక్సెస్ చేసుకోవడం కోసం కంపెనీ ఒకినావా కనెక్ట్ (Okinawa Connect) అనే మొబైల్ యాప్‌ ని కూడా అందిస్తోంది.

ఓలా ఎస్1కి పోటీగా ఒకినావా ఒకి90 (Okinawa Okhi 90) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, రేంజ్, ఫీచర్లు

ఒకినావా ఒకి 90 (Okinawa Okhi 90) ఎలక్ట్రిక్ స్కూటర్ లోని పవర్‌ట్రైన్ విషయానికి వస్తే, ఇది సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగా హబ్ మౌంటెడ్ మోటార్‌ను కాకుండా, ఒక మిడ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. అంటే, ఈ స్కూటర్ లోని ఎలక్ట్రిక్ మోటార్ స్కూటర్ మధ్య భాగంలో అమర్చబడి ఉంటుంది మరియు ఇది బెల్ట్-డ్రైవ్ సెటప్ సాయంతో వెనుక చక్రాన్ని ముందుకు కదుపుతుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 3,800 వాట్స్ (5.08bhp) పవర్ అవుట్‌పుట్‌ను జరేట్ చేస్తుంది.

ఓలా ఎస్1కి పోటీగా ఒకినావా ఒకి90 (Okinawa Okhi 90) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, రేంజ్, ఫీచర్లు

ఒకి 90 ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే, ఇది గరిష్టంగా గంటకు 80 నుండి 90 కిమీ వేగంతో దూసుకుపోతుంది. Okinawa Okhi 90 లోని ఎలక్ట్రిక్ మోటార్ అందులో అమర్చిన 3.6 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో పనిచేస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది ఈ విభాగంలో అనేక ప్రీమియం స్కూటర్ల మాదిరిగా ఫిక్స్డ్ బ్యాటరీని కలిగి ఉండదు, ఇందులోని బ్యాటరీని తొలగించుకుని చార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా, ఇది స్కూటర్ యజమానులకు వారు కోరుకున్న చోట బ్యాటరీని ఛార్జ్ చేయడానికి అనుమతిస్తుంది.

ఓలా ఎస్1కి పోటీగా ఒకినావా ఒకి90 (Okinawa Okhi 90) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, రేంజ్, ఫీచర్లు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో రిమూవబల్ బ్యాటరీ అమర్చిన కారణంగా, ఇది అపార్ట్‌మెంట్ లలో నివసించే వారు మరియు బయటవైపు చార్జింగ్ మౌళిక సదుపాయాలు లేని వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక రేంజ్ విషాయనికి ఈ ఒకి 90 లోని బ్యాటరీ ప్యాక్ ను ఒక్కసారి పూర్తి చార్జ్ చేస్తే, గరిష్టంగా 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా, ఈ బ్యాటరీ ప్యాక్ ను కేవలం ఒక గంటలో దాదాపు 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 3-4 గంటల సమయం పట్టవచ్చు.

ఓలా ఎస్1కి పోటీగా ఒకినావా ఒకి90 (Okinawa Okhi 90) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, రేంజ్, ఫీచర్లు

ఒకినావా ఒకి 90 ఎలక్ట్రిక్ స్కూటర్ లోని మెకానికల్ అంశాలను గమనిస్తే, ఇందులో ముందువైపు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు మరియు వెనుకవైపు డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లు ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, రెండు చక్రాలపై డిస్క్ బ్రేకులు ఉంటాయి మరియు ఇవి ఎలక్ట్రానిక్ ఏబిఎస్ సిస్టమ్ ద్వారా పనిచేస్తాయి. ఇందులో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ప్రయాణంలో స్కూటర్‌ యొక్క బ్రేకులు వేసిన ప్రతిసారి, దాని ద్వారా వచ్చే శక్తి, బ్యాటరీలను ఛార్జ్ చేయడానికి సహకరిస్తుంది.

ఓలా ఎస్1కి పోటీగా ఒకినావా ఒకి90 (Okinawa Okhi 90) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, రేంజ్, ఫీచర్లు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు మరియు వెనుక భాగంలో 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ ఉంటాయి. వాటిపై 100/80-16 (ముందు) మరియు 120/80 9 (వెనుక) ట్యూబ్‌లెస్ టైర్లు అమర్చబడి ఉంటాయి. ఇందులో అమర్చిన అల్లాయ్ వీల్స్ ఈ విభాగంలోనే అతిపెద్దవని కంపెనీ పేర్కొంది. కొత్త Okinawa Okhi 90 ఎలక్ట్రిక్ స్కూటర్ 2,220 mm పొడవు, 1,160 mm ఎత్తు , 710 mm వెడల్పు మరియు 1,520 mm వీల్‌బేస్ ను కలిగి ఉంటుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 175 mm గా ఉంటుంది.

ఓలా ఎస్1కి పోటీగా ఒకినావా ఒకి90 (Okinawa Okhi 90) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, రేంజ్, ఫీచర్లు

ఒకి 90 ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 250 కిలోమీటర్ల లోడింగ్ కెపాసిటీని కలిగి ఉంది. కాగా, Okinawa Autotech ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ రెండింటిపై మూడు సంవత్సరాల వారంటీని అందిస్తుంది. ఇది ఈ విభాగంలో Ola S1 Pro, Ather 40X, Simple One, Bajaj Chethak మరియు TVS iQube వంటి ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు ప్రత్యక్ష పోటీదారుగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, March 25, 2022, 10:55 [IST]
English summary
Okinawa okhi90 electric scooter launched in india price specs range and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+