అప్పుడే బయటికొచ్చిన Ola Electric 2021 డిసెంబర్ సేల్స్ రిపోర్ట్.. అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

దేశీయ మార్కెట్లో 2021 డిసెంబర్ నెల అమ్మకాల నివేదికలను దాదాపు అన్ని కంపెనీలు విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) కూడా తన అమ్మకాల నివేదికలను విడుదల చేసింది. ఓలా ఎలక్ట్రిక్ యొక్క అమ్మకాలను గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

అప్పుడే బయటికొచ్చిన Ola Electric 2021 డిసెంబర్ సేల్స్ రిపోర్ట్.. అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

ఓలా కంపెనీ దేశీయ మార్కెట్లో తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను 2021 ఆగష్టు 15 న విడుదల చేసినప్పటికీ ఈ మధ్య కాలంలోనే డెలివరీలను ప్రారంభించింది. అయితే కంపెనీ 2021 డిసెంబర్ 31 వరకు దాని ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను మొత్తం 111 యూనిట్లను డెలివరీ చేసింది.

అప్పుడే బయటికొచ్చిన Ola Electric 2021 డిసెంబర్ సేల్స్ రిపోర్ట్.. అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

ఇప్పటికి విడుదలైన గణాంకాల ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్లను నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే పంపిణీ చేసింది. కానీ కంపెనీ డెలివరీకి సంబంధించి ఇంకా ఎలాంటి డేటాను అందించలేదు. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్స్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వింకేష్ గులాటీ RTOలో రిజిస్టర్ అయిన ఓలా స్కూటర్ల డేటాను షేర్ చేశారు.

అప్పుడే బయటికొచ్చిన Ola Electric 2021 డిసెంబర్ సేల్స్ రిపోర్ట్.. అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

దీని ప్రకారం 2021 డిసెంబర్ 31 వరకు ఓలా 111 స్కూటర్లను మాత్రమే విక్రయించినట్లు తెలిసింది. డెలివరీ చేయబడిన 111 ఎలక్ట్రిక్ స్కూటర్లలో 60 యూనిట్లు కర్ణాటకలో డెలివరీ చేయబడ్డాయి. ఇక తమిళనాడులో 25 స్కూటర్లు డెలివరీ చేయబడ్డాయి. అదే విధంగా మహారాష్ట్రలో 15 యూనిట్లు మరియు రాజస్థాన్‌లో 11 యూనిట్లు మాత్రమే డెలివరీ చేయబడినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.

అప్పుడే బయటికొచ్చిన Ola Electric 2021 డిసెంబర్ సేల్స్ రిపోర్ట్.. అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం దాదాపు 90,000 బుకింగ్‌లను పొందినట్లు తెలిపింది. గత వారం శుక్రవారం, ఓలా ఎలక్ట్రిక్ CEO మరియు సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ, S1 మరియు S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క మొదటి బ్యాచ్ యొక్క అన్ని యూనిట్లను కంపెనీ పంపినట్లు తెలిపారు.

ప్రస్తుతం కొన్ని యూనిట్లు రవాణాలో ఉన్నాయని, త్వరలో సమీపంలోని డెలివరీ కేంద్రాల్లో ఆర్‌టీఓ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోందని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పడుతుండటం వల్లే స్కూటర్ల డెలివరీలో జాప్యం జరుగుతోందని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ కోసం పూర్తి డిజిటల్ ప్రక్రియ లేదని కూడా ఆయన చెప్పారు.

అప్పుడే బయటికొచ్చిన Ola Electric 2021 డిసెంబర్ సేల్స్ రిపోర్ట్.. అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

ఇటీవల Ola స్కూటర్‌లను డెలివరీకు సంబంధించిన కొన్ని సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో కొంతమంది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు నాణ్యత లేదని మరియు కంపెనీ తెలిపినదానికంటే కూడా తక్కువ పరిధిని అందిస్తున్నాయని వాపోయారు. అంతే కాకూండా ఈ స్కూటర్ యొక్క డెంట్‌లు, ఫిట్టింగ్‌లు, ఛార్జింగ్‌, ఎల్‌సీడీ ప్యానెల్‌ నాసిరకం వంటి ఫిర్యాదులు చేసారు.

అప్పుడే బయటికొచ్చిన Ola Electric 2021 డిసెంబర్ సేల్స్ రిపోర్ట్.. అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

ఓలా ఎలక్ట్రిక్ యొక్క S1 స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,999 కాగా, S1 ప్రో ధర రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్). ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

అప్పుడే బయటికొచ్చిన Ola Electric 2021 డిసెంబర్ సేల్స్ రిపోర్ట్.. అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ సింపుల్‌ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ బైక్ ఫ్రంట్ ఆప్రాన్‌ మధ్యలో OLA బ్యాడ్జ్‌తో చూడవచ్చు. స్కూటర్ ముందు భాగంలో ఉన్న ఏకైక ఫీచర్ హెడ్‌ల్యాంప్స్ క్లస్టర్, ఇందులో ఎల్ఈడీ డిఆర్ఎల్ ల చుట్టూ ట్విన్-పాడ్ ఎల్ఈడీ సెటప్ ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లో క్షితిజ సమాంతరంగా అమర్చిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్, రియర్ ఫుట్-రెస్ట్ మరియు కాంటూర్డ్ సీట్లు ఉన్నాయి.

అప్పుడే బయటికొచ్చిన Ola Electric 2021 డిసెంబర్ సేల్స్ రిపోర్ట్.. అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

అంతే కాకూండా ఇందులో అల్లాయ్ వీల్స్, 36-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్, రియర్ గ్రాబ్ రైల్స్, ఫ్రంట్ స్టోరేజ్ పాకెట్స్, లగేజ్ హుక్ మరియు రబ్బర్-లైన్డ్ ఫ్రంట్ ఫుట్‌వెల్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 1860 మిమీ పొడవు, 700 మిమీ వెడల్పు, 1155 మిమీ ఎత్తు, 1345 మిమీ వీల్‌బేస్ మరియు 74 కిలోల బరువు ఉంటుంది.

అప్పుడే బయటికొచ్చిన Ola Electric 2021 డిసెంబర్ సేల్స్ రిపోర్ట్.. అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అవి నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ మోడ్స్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, మంచి పనితీరుని కూడా అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 10 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

అప్పుడే బయటికొచ్చిన Ola Electric 2021 డిసెంబర్ సేల్స్ రిపోర్ట్.. అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 3.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీని 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో దాదాపు 6:30 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ చేయబడుతుంది.

అప్పుడే బయటికొచ్చిన Ola Electric 2021 డిసెంబర్ సేల్స్ రిపోర్ట్.. అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

ఓలా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక కొత్త మరియు ఆధునిక ఫీచర్లను అందించింది. Ola S1 పూర్తి ఛార్జ్‌పై 121 కిమీల రేంజ్‌ను అందిస్తుంది, అయితే హై ఎండ్ వేరియంట్ S1 ప్రో 181 కిమీల పరిధిని కలిగి ఉంది. ఈ రెండు స్కూటర్ల టాప్ స్పీడ్ విషయానికి వస్తే, Ola S1 గరిష్టంగా 90 km/h వేగంతో, Ola S1 Pro గరిష్టంగా 115 km/h వేగంతో రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, January 3, 2022, 12:38 [IST]
English summary
Ola electric delivers 111 scooters till december 31 says fada details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+