ఫ్యూచర్ ప్లాన్ కూడా ఇప్పడే చెప్పేసిన ఓలా.. భవిష్యత్తులో విడుదల చేసే ఎలక్ట్రిక్ వాహనాలు ఇవే

ఇండియన్ మార్కెట్లో ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ దిగ్గజం 'ఓలా ఎలక్ట్రిక్' ఇప్పటికే ఎస్1, ఎస్1 ప్రో మరియు ఎస్1 ఎయిర్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. అయితే రానున్న రోజుల్లో కంపెనీ ఎలాంటి వాహనాలను విడుదల చేస్తుంది అనే విషయాన్ని కూడా ఇప్పుడే వెల్లడించింది.

2022 లోనే దేశీయ మార్కెట్లో లెక్కకు మించిన ఎలక్ట్రిక్ వాహనాలు విడుదలయ్యాయి. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలు దేశీయ విఫణిలోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఓలా ఎలక్ట్రిక్ 2023 మరియు 2024 సంవత్సరాల్లో తీసుకురానున్న ఎలక్ట్రిక్ వాహనాలను గురించి ఇప్పుడే వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్లు అర్థమవుతోంది.

భవిష్యత్ ప్రణాళికలు ఇప్పడే వెల్లడించిన ఓలా ఎలక్ట్రిక్

ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు మరియు CEO భవిష్ అగర్వాల్ 2024 నాటికి కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లు మరియు స్కూటర్‌లను ప్రీమియం మరియు మాస్ మార్కెట్ విభాగాలలో విడుదల చేస్తామని తెలిపారు. దీనిని గురించి కంపెనీ వెబ్‌సైట్‌లోని బ్లాగ్‌లో వెల్లడించారు. దీని ప్రకారం 2023 వ సంవత్సరంలో కంపెనీ మాస్-మార్కెట్ స్కూటర్‌ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రానున్న ఈ స్కూటర్ ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించిన వివరాలు ప్రస్తుతానికి వెల్లడి కాలేదు.

2023 లో కంపెనీ విడుదల చేయనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే అందుబాటులో ఉన్న మోడల్స్ మాదిరిగా ఉంటుందా.. లేదా వాటికి పూర్తిగా భిన్నంగా ఉంటుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. ఆ తరువాత కంపెనీ 2024 నాటికి ఎలక్ట్రిక్ బైకులను విడుదల చేయనుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ బైకులు క్రూయిజర్, అడ్వెంచర్ బైక్, స్పోర్ట్‌బైక్ లేదా మాస్-మార్కెట్ ఆఫర్ వంటి వివిధ బాడీ స్టైల్స్‌లో వచ్చే అవకాశం ఉంది.

భవిష్యత్ ప్రణాళికలు ఇప్పడే వెల్లడించిన ఓలా ఎలక్ట్రిక్

2024 లో విడుదలయ్యే ఓలా ఎలక్ట్రిక్ బైకులు భారతీయ మార్కెట్లో అల్ట్రావయోలెట్ ఎఫ్77, టోర్క్ క్రటోస్ R , ఒబెన్ రోర్ మరియు రివోల్ట్ RV400 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుందని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే రాబోయే ఓలా ఎలక్ట్రిక్ బైక్ అధిక పనితీరుని అందించే మంచి పర్ఫామెన్స్ బైక్ అని అర్థమవుతోంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ కి సంబంధించిన వివరాలు 2024 లో వెల్లడవుతాయని తెలుస్తోంది.

2024 లో ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసే వరకు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ మీదనే మొత్తం దృష్టిని పెడుతుంది. అంతే కాకుండా 2024 నాటికి ఓలా తన మొదటి ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయనుంది. 2027 నాటికి ఎలక్ట్రిక్ వాహన విభాగంలో నాలుగు ఫోర్ వీలర్స్ విడుదల చేయనుంది. ఇప్పటికే కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్న మొదటి ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన టీజర్లకు కూడా విడుదల చేసింది.

2022 భారతదేశపు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాబోయే ఎలక్ట్రిక్ కారుకి సంబంధించి కొత్త టీజర్‌ లను కూడా విడుదలైంది. ఆ సందర్భంలో కంపెనీ సీఈఓ భవీష్ అగర్వాల్ మాట్లాడుతూ.. దీని ధర రూ. 50 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు. అంటే ఇది అద్భుతమైన ఫ్రీమియం ఫీచర్స్ కలిగి ఉండే అవకాశం ఉంటుందని మనకు ఇప్పుడే అర్థమవుతోంది. ఇది 2024 లో విడుదలవుతుందని ఇప్పటికే వెల్లడించారు.

ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ విభాగంలో విడుదల కానున్న ఓలా ఎలక్ట్రిక్ కారు దాని ధరకు తగిన విధంగానే అనేక ప్రీమియం ఫీచర్లతో మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారులో అందించబోయే ఫీచర్ల గురించి ప్రస్తుతానికి వెల్లడించనప్పటికీ రేంజ్ గురించి వెల్లడించారు. రాబోయే ఓలా ఎలక్ట్రిక్ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని ఇప్పటికే పేర్కొన్నారు.

More from DriveSpark

Article Published On: Saturday, December 31, 2022, 14:57 [IST]
English summary
Ola electric reveals next plans details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+