హఠాత్తుగా మంటల్లో కాలి బూడిదైన ఓలా స్కూటర్.. ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనాలంటే భయం.. భయం!!

పెట్రోల్ ధరలు మండిపోతున్నాయని ఎలక్ట్రిక్ టూవీలర్లను కొందామనుకుంటే, ఇప్పుడు ఎలక్ట్రిక్ టూవీలర్లు కాస్తా మంటల్లో కాలిపోతూ ప్రజలను మరింత భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి హఠాత్తుగా మంటల్లో కాలిపోయిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. ఓ షాపు ముందు పార్క్ చేసి ఉన్న ఓలా ఎస్1 (Ola S1) ఎలక్ట్రిక్ స్కూటర్ క్రింది భాగంలా ఉన్నట్టుండి భారీగా పొగ రావడం, ఆ వెంటనే క్షణాల్లో కాలి బూడిదైపోవడం జరిగింది.

హఠాత్తుగా మంటల్లో కాలి బూడిదైన ఓలా స్కూటర్.. ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనాలంటే భయం.. భయం!!

వీడియోలో పేర్కొన్న వివరాల ప్రకారం, ఈ సంఘటన మహారాష్ట్రలోని పూనే నగరంలో చోటు చేసుకుంది. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారడంతో, ఓలా ఎలక్ట్రిక్ సంస్థ దీనిపై స్పందించింది. కొనుగోలుదారులు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, పూనేలో జరిగిన ఈ సంఘటన గురించి తమకు తెలిసిందనే, ఈ ప్రమాదానికి గల కారణాలను శోధించేందుకు తమ బృందం ప్రయత్నిస్తోందని ఓలా ఎలక్ట్రిక్ సంస్థ సీఈఓ భవీష్ అగర్వాల్ ఓ లేఖ ద్వారా తెలియజేశారు.

హఠాత్తుగా మంటల్లో కాలి బూడిదైన ఓలా స్కూటర్.. ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనాలంటే భయం.. భయం!!

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో భద్రతే ప్రధానమైన అంశం అని, ఈ సమస్యను తాము పరిశోధించి వెంటనే సరిచేస్తామని చెప్పుకొచ్చారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోయిన ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి హాని జరగలేదని, అయితే స్కూటర్ మొత్తం పూర్తిగా మంటల్లో కాలిపోయిందని సమాచారం. ప్రాధమిక సమాచారం ప్రాకంర, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లో అమర్చిన లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌లోని థర్మల్ రన్‌అవే కారణంగా మంటలు ప్రారంభమైనట్లు భావిస్తున్నారు.

హఠాత్తుగా మంటల్లో కాలి బూడిదైన ఓలా స్కూటర్.. ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనాలంటే భయం.. భయం!!

బహుశా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎక్కువ సమయం పాటు నడపడం ద్వారా ఎలక్ట్రిక్ మోటార్ మరియు బ్యాటరీ ప్యాక్ రెండూ కూడా వేడెక్కి మంటలు చెలరేగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈవీలలో బ్యాటరీ వేడెక్కడం వల్ల మంటలు అంటుకోవడం ఇదేం మొదటిసారి కాదు, గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే తెరపైకి వచ్చాయి. కానీ ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఇలాంటి సమస్య రావడంతో, ఇప్పుడు దాని భద్రపై అనుమానాలు నెలకొన్నాయి.

హఠాత్తుగా మంటల్లో కాలి బూడిదైన ఓలా స్కూటర్.. ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనాలంటే భయం.. భయం!!

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. కంపెనీ దీనిని స్కూటర్ దిగువ భాగంలో బాడీకి అమర్చి ఉంటుంది. దీనిని సాధారణ పౌరులు తొలగించడం సాధ్యం కాదు, నిపుణులైన ఇంజనీర్లు మాత్రమే దీనిని తొలగించగలు. అయితే, ఈ సెగ్మెంట్లోని అనేక ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లలో తొలగించగల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. నిజానికి, ఇలాంటి విపత్కర సమయాల్లో ఇది చాలా ఉపయోగకరమైన ఫీచర్‌గా ఉంటుందని చెప్పవచ్చు. బ్యాటరీ వేడిక్కినట్లు అనిపించినా, పొగలు రావడం ప్రారంభించినా వెంటనే దానిని స్కూటర్ నుండి వేరు చేసి, స్కూటర్ కు జరిగే నష్టాన్ని కొంత వరకూ కాపాడుకోవచ్చు.

హఠాత్తుగా మంటల్లో కాలి బూడిదైన ఓలా స్కూటర్.. ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనాలంటే భయం.. భయం!!

పెట్రోల్ వాహనాలలో కూడా అగ్నిప్రమాదపు రిస్క్ ఉంటుంది. కానీ, ఇది ఎలక్ట్రిక్ వాహనాలతో పోల్చుకుంటే చాలా తక్కువగానే ఉంటుందని చెప్పవ్చచు. ఎలక్ట్రిక్ వాహనాలలో బ్యాటరీ ప్యాక్, కంట్రోలర్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ అనే మూడు ప్రధానమైన భాగాలు ఉంటాయి. ఇవి ఎలక్ట్రిక్ స్కూటర్ రన్నింగ్‌లో ఉన్నంత సేపు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి, వేడెక్కే ప్రమాదం ఉంటుంది. అలాగే, వీటితో పాటుగా ఎలక్ట్రిక్ వాహనాలలోని లైట్లు, హారన్, స్పీకర్ మరియు డిస్‌ప్లే వంటి వివిధ పరికరాలు పనిచేయడానికి ఎక్కువ మొత్తంలో వైర్లు కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఈ వైర్ హార్‌నెస్‌లో ఏదైనా లోపం వచ్చినా కూడా షార్ట్ సర్కూట్ జరిగి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది.

నిజానికి ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే కంపెనీలు తమ వాహనాల విషయంలో నిర్ధిష్టమైన పరీక్షలు చేసిన తర్వాతనే మార్కెట్లో విడుదల చేస్తారు. అన్ని సేఫ్టీ పరీక్షలు పాస్ అయిన తర్వాతనే వాటికి అనుమతి కూడా లభిస్తుంది. కానీ, కొన్ని అనివార్య సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం స్కూటర్ ఆగి ఉన్నప్పుడు జరిగింది కాబట్టి ఎవ్వరికీ ఎలాంటి హాని జరగలేదు. అదే ఒకవేళ రన్నింగ్‌లో ఉండగా ఇలాంటిది ఏదైనా జరిగి ఉంటే, ఆ ప్రమాద తీవ్రత ఊహించుకోవడానికే భయకరంగా ఉంటుంది.

హఠాత్తుగా మంటల్లో కాలి బూడిదైన ఓలా స్కూటర్.. ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనాలంటే భయం.. భయం!!

కాలిపోయిన ఇ-స్కూటర్ కస్టమర్‌కి ఓలా హామీ!

ఇదిలా ఉంటే, పూనేలో జరిగిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అగ్నిప్రమాదం విషయంలో కంపెనీ సదరు కస్టమర్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు పేర్కొంది. ఓలా సంస్థ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల భద్రత విషయంలో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తుందని, కస్టమర్ల భద్రత కంటే తమకు ముఖ్యమైనది మరొకటి లేదని కంపెనీ తెలిపింది. అత్యధిక నాణ్యత ప్రమాణాలకు లోబడి తమ ఉత్పత్తులను తయారు చేయడానికి కంపెనీ ఎల్లప్పపుడూ కట్టుబడి ఉంటుందని, కాబట్టి ఈ సంఘటనను తాము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని ఓలా పేర్కొంది.

హఠాత్తుగా మంటల్లో కాలి బూడిదైన ఓలా స్కూటర్.. ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనాలంటే భయం.. భయం!!

ఆది నుండి ఓలా సంస్థకు సమస్యలే..!

భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో ఓ సరికొత్త విప్లవాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో ఓలా ఎలక్ట్రిక్ తమ ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) ప్రయాణాన్ని ప్రారంభించింది. అయితే, ఈ సంస్థ ఆది నుండి సమస్యలను ఎదుర్కుంటూనే ఉంది. ఓలా తలపెట్టిన మెగా ఫ్యూచర్ ఫ్యాక్టరీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం, కరోనా మహమ్మారి, ఎలక్ట్రానిక్ చిప్ కొరత వంటి అనేక కారణాల వలన కంపెనీ అనుకున్న సమయంలో వీటిని మార్కెట్లోకి తీసుకురాలేకపోయింది.

హఠాత్తుగా మంటల్లో కాలి బూడిదైన ఓలా స్కూటర్.. ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనాలంటే భయం.. భయం!!

సుధీర్ఘమైన వెయిటింగ్ పీరియడ్ కారణంగా చాలా మంది కస్టమర్లు తమ ప్రీ-ఆర్డర్లను క్యాన్సిల్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో సమస్యలు, డెలివరీ సమయంలో సమస్యలు, సాఫ్ట్‌వేర్ సమస్యలు ఇలా ప్రతి విషయంలోనూ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసిన వారు వివిధ రకాల సమస్యలను ఎదుర్కుంటూనే ఉన్నారు. దీంతో ఓలా స్కూటర్ కస్టమర్లు సోషల్ మీడియా వేదికగా కంపెనీ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

హఠాత్తుగా మంటల్లో కాలి బూడిదైన ఓలా స్కూటర్.. ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనాలంటే భయం.. భయం!!

డెలివరీ సమయంలో స్కూటర్లపై డెంట్‌లు ఉండటం, ఫిట్టింగ్‌ సమస్యలు, ఛార్జింగ్‌, నాసిరకం ఎల్‌సిడి ప్యానెల్‌ వంటి ఫిర్యాదులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో, కొంతమంది కస్టమర్లు కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయంలో క్లెయిమ్ చేసిన రేంజ్ కంటే చాలా తక్కువ దూరం మాత్రమే ప్రయాణిస్తున్నాయని చెబుతున్నారు. ఇన్ని సమస్యలకు తోడు ఇప్పుడు కొత్తగా బ్యాటరీలు పేలిపోవడం వంటి వార్తలు రావడంతో కొత్తగా ఈ స్కూటర్లను కొనేవారు, ఇప్పటికే కొన్నవారు ఆలోచనలో పడుతున్నారు.

More from DriveSpark

Article Published On: Monday, March 28, 2022, 15:49 [IST]
English summary
Ola electric scooter catches fire in pune company investigating the root cause
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+