మళ్ళీ ప్రారంభం కానున్న Ola Electric పేమెంట్ విండో.. ఇక డెలివరీలు అప్పుడే

ఈ రోజు మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ గురించి తెలియని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు, అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఓలా ఎలక్ట్రిక్ దేశీయ విఫణిలోకి రెండు ఆధునిక ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసినప్పటి నుంచి కూడా అత్యధిక సంఖ్యలో బుకింగ్స్ పొందుతూనే ఉంది. అయితే ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ యొక్క ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ ప్రారంభమయ్యింది. ఇప్పటికే కొంతమంది కస్టమర్లకు ఈ స్కూటర్లు డెలివరీ చేయబడ్డాయి.

అయితే ఇప్పుడు కంపెనీ చివరి పేమెంట్ విండోను 2022 జనవరి 21 నుంచి ప్రారంభించనుంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మళ్ళీ ప్రారంభం కానున్న Ola Electric పేమెంట్ విండో.. ఇక డెలివరీలు అప్పుడే

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఇప్పుడు పేమెంట్ విండోను ఈ నెల 21 న ప్రారంభించనున్నట్లు అధికారికంగా తెలిపింది. అయితే డెలివరీలు జనవరి మరియు ఫిబ్రవరి నెలలో జరుగుతాయి. ఇందుకోసం కంపెనీ ఇప్పుడు త్పత్తిని సంఖ్యను కూడా పెంచింది. ఇప్పుడు కంపెనీ రోజుకి 1,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేస్తుంది.

మళ్ళీ ప్రారంభం కానున్న Ola Electric పేమెంట్ విండో.. ఇక డెలివరీలు అప్పుడే

ఓలా ఎలక్ట్రిక్ యొక్క ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ఇప్పుడు ప్రతిరోజూ 1,000 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉత్పత్తి అవుతున్నాయని కంపెనీ సీఈవో తెలిపారు. అంథేబె కాకుండా త్వరలో సేల్ విండోను మళ్లీ ప్రారంభించనున్నట్లు కూడా ఆయన తెలిపారు. కస్టమర్లకు మరింత త్వరగా డెలివరీలను చేయడానికి కంపెనీ కృషి చేస్తోంది.

మళ్ళీ ప్రారంభం కానున్న Ola Electric పేమెంట్ విండో.. ఇక డెలివరీలు అప్పుడే

ఓలా ఎలక్ట్రిక్ గత 2021 డిసెంబర్ నెలలో మొత్తం 111 యూనిట్ల స్కూటర్లను విక్రయించింది. కంపెనీ డెలివరీ చేసిన మొత్తం 111 యూనిట్లలో కర్ణాటకలో 60, తమిళనాడులో 25, మహారాష్ట్రలో 15 మరియు రాజస్థాన్‌లో 11 యూనిట్లు డెలివరీ చేసినట్లు తెలిసింది.

మళ్ళీ ప్రారంభం కానున్న Ola Electric పేమెంట్ విండో.. ఇక డెలివరీలు అప్పుడే

ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే తన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం దాదాపు 90,000 బుకింగ్‌లను పొందినట్లు తెలిపింది. అయితే 2021 డిసెంబర్ 15 నుండి డెలివరీ ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఇప్పటికే కొంతమంది కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను పొందారు. కానీ డెలివరీ పొందిన కొంతమంది కస్టమర్లు ఈ స్కూటర్ల నాణ్యత మరియు రేంజ్ వంటి విషయాలపైన అసంతృప్తి వ్యక్తం చేసారు.

మళ్ళీ ప్రారంభం కానున్న Ola Electric పేమెంట్ విండో.. ఇక డెలివరీలు అప్పుడే

ఇదిలా ఉండగా కంపెనీ ఇటీవల అందించిన సమాచారం ప్రకారం స్కూటర్ డెలివరీలు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఓలా స్కూటర్లలో హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్లను లాంచ్ సమయంలో అందించలేదు, కావున వీటిని ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌ల ద్వారా ఈ ఫీచర్లు యాక్టివేట్ చేయనున్నారు. ఈ ఫీచర్స్ యాక్టివేట్ చేయడానికి కొంత సమయం పట్టవచ్చని కంపెనీ తెలిపింది. OTA అప్‌డేట్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్‌కు చేరుకోవడానికి మూడు నుండి ఆరు నెలల సమయం పడుతుందని కంపెనీ తెలిపింది.

మళ్ళీ ప్రారంభం కానున్న Ola Electric పేమెంట్ విండో.. ఇక డెలివరీలు అప్పుడే

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలను పొందిన కొంతమంది కస్టమర్లు వీటిపైన కొంత అసంతృప్తికి లోనవుతున్నారు. స్కూటర్‌లో డెంట్‌లు, ఫిట్టింగ్‌లు, ఛార్జింగ్‌లు, ఎల్‌సీడీ ప్యానల్‌ నాసిరకంగా ఉండటం వంటి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా కంపెనీ తెలిపిని అధికారిక రేంజ్ కంటే కూడా తక్కువగా ఉందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మళ్ళీ ప్రారంభం కానున్న Ola Electric పేమెంట్ విండో.. ఇక డెలివరీలు అప్పుడే

ఓలా ఎలక్ట్రిక్ యొక్క S1 స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,999 కాగా, S1 ప్రో ధర రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్). ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

మళ్ళీ ప్రారంభం కానున్న Ola Electric పేమెంట్ విండో.. ఇక డెలివరీలు అప్పుడే

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ సింపుల్‌ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ బైక్ ఫ్రంట్ ఆప్రాన్‌ మధ్యలో OLA బ్యాడ్జ్‌తో చూడవచ్చు. స్కూటర్ ముందు భాగంలో ఉన్న ఏకైక ఫీచర్ హెడ్‌ల్యాంప్స్ క్లస్టర్, ఇందులో ఎల్ఈడీ డిఆర్ఎల్ ల చుట్టూ ట్విన్-పాడ్ ఎల్ఈడీ సెటప్ ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లో క్షితిజ సమాంతరంగా అమర్చిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్, రియర్ ఫుట్-రెస్ట్ మరియు కాంటూర్డ్ సీట్లు ఉన్నాయి.

మళ్ళీ ప్రారంభం కానున్న Ola Electric పేమెంట్ విండో.. ఇక డెలివరీలు అప్పుడే

అంతే కాకూండా ఇందులో అల్లాయ్ వీల్స్, 36-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్, రియర్ గ్రాబ్ రైల్స్, ఫ్రంట్ స్టోరేజ్ పాకెట్స్, లగేజ్ హుక్ మరియు రబ్బర్-లైన్డ్ ఫ్రంట్ ఫుట్‌వెల్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 1860 మిమీ పొడవు, 700 మిమీ వెడల్పు, 1155 మిమీ ఎత్తు, 1345 మిమీ వీల్‌బేస్ మరియు 74 కిలోల బరువు ఉంటుంది.

మళ్ళీ ప్రారంభం కానున్న Ola Electric పేమెంట్ విండో.. ఇక డెలివరీలు అప్పుడే

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అవి నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ మోడ్స్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, మంచి పనితీరుని కూడా అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 10 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 3.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీని 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో దాదాపు 6:30 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ చేయబడుతుంది.

మళ్ళీ ప్రారంభం కానున్న Ola Electric పేమెంట్ విండో.. ఇక డెలివరీలు అప్పుడే

ఓలా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక కొత్త మరియు ఆధునిక ఫీచర్లను అందించింది. Ola S1 పూర్తి ఛార్జ్‌పై 121 కిమీల రేంజ్‌ను అందిస్తుంది, అయితే హై ఎండ్ వేరియంట్ S1 ప్రో 181 కిమీల పరిధిని కలిగి ఉంది. ఈ రెండు స్కూటర్ల టాప్ స్పీడ్ విషయానికి వస్తే, Ola S1 గరిష్టంగా 90 km/h వేగంతో, Ola S1 Pro గరిష్టంగా 115 km/h వేగంతో రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Saturday, January 15, 2022, 9:37 [IST]
English summary
Ola electric scooter payment window opens on 21st january details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+