ఓలా హోలీ ఆఫర్.. కొత్త కలర్ ఆప్షన్‌లో Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్; 17, 18వ తేదీలలో బుకింగ్స్!

ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో సంచలనానికి తెరలేపిన ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric), ఈ ఏడాది హోలీ పండుగ సందర్భంగా ఓ కొత్త ఆఫర్‌తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఓలా ఎలక్ట్రిక్ అందిస్తున్న ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro) మోడల్‌లో కంపెనీ ఓ కొత్త కలర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. ఓలా ఎస్1 ప్రో ఇప్పుడు గెరువా కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుంది. కాకపోతే, ఈ మోడల్ కోసం మార్చ్ 17 మరియు మార్చ్ 18వ తేదీలలో మాత్రమే బుకింగ్స్ ఓపెన్ చేయబడి ఉంటాయి.

ఓలా హోలీ ఆఫర్.. కొత్త కలర్ ఆప్షన్‌లో Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్; 17, 18వ తేదీలలో బుకింగ్స్!

అంతేకాకుండా, ఈ కొత్త కలర్ ఆప్షన్‌లో ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు కేవలం ఓలా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే దీనిని బుక్ చేసుకోగలరు. ఈ కొత్త ప్రత్యేక ఎడిషన్ డెలివరీలు ఏప్రిల్ 2022లో ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త (గెరువా) కలర్ ఆప్షన్ కాకుండా ఓలా ఎస్1 ప్రోను కంపెనీ ఇప్పటికే 10 ఆకర్షణీయమైన రంగులలో విక్రయిస్తోంది. కొత్త కలర్ ఆప్షన్ మినహా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో వేరే ఏ ఇతర మార్పులు లేవు.

ఓలా హోలీ ఆఫర్.. కొత్త కలర్ ఆప్షన్‌లో Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్; 17, 18వ తేదీలలో బుకింగ్స్!

ఓలా ఎస్ 1 ప్రో హైలైట్స్:

రేంజ్ - 181 కిమీ

గరిష్ట వేగం - గంటకు 115 కిమీ

రైడ్ మోడ్స్ - నార్మల్, స్పోర్ట్, హైపర్

ఛార్జింగ్ టైమ్ - 18 నిమిషాల్లో 75 కిమీ సరిపడా ఛార్జ్

బ్యాటరీ సామర్థ్యం - 3.97 కిలో వాట్ అవర్

చార్జర్ - 750 వాట్ ఆన్‌బోర్డ్ ఛార్జర్‌

మోటార్ - 8.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్

ఓలా హోలీ ఆఫర్.. కొత్త కలర్ ఆప్షన్‌లో Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్; 17, 18వ తేదీలలో బుకింగ్స్!

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ డిజైన్‌ను గమనిస్తే, ఇది చాలా సింపుల్ డిజైన్‌తో క్లాసిక్ లుక్‌ని కలిగి ఉంటుంది. కాకపోతే, కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించింది. ఇందులో ముందు వైపు పెద్ద హడావిడి లేకుండా, ఫ్రంట్ ప్యానెల్‌లోనే అమర్చిన రెండు ఎల్ఈడి టర్న్ ఇండికేటర్లు, హ్యాండిల్ బార్‌లో అమర్చిన ట్విన్ పాడ్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, డ్యూయెల్ టోన్ హ్యాండిల్ బార్, బ్లాక్ కలర్ సైడ్ మిర్రర్స్ వంటి డిజైన్ ఫీచర్లతో చాలా మినిమలిస్టిక్ డిజైన్‌మను కలిగి ఉంటుంది.

ఓలా హోలీ ఆఫర్.. కొత్త కలర్ ఆప్షన్‌లో Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్; 17, 18వ తేదీలలో బుకింగ్స్!

ఈ స్కూటర్ ముందు వైపు ఫ్రంట్ ఆప్రాన్‌లో చాలా చిన్న అక్షరాలతో ఉన్న ఓలా బ్యాడ్జింగ్ ఉంటుంది. ఇందులోని హ్యాండిల్ బార్‌పై అమర్చిన పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్స్‌లో బ్లాక్ కలర్‌లో ఉండి, బాడీలో ఇమిడిపోయినట్లుగా ఉండే స్టైలిష్ సైడ్ స్టాండ్ మరియు వెనుక ప్యానెల్‌లో అమరిపోయినట్లుగా ఉండే పిలియన్ రైడర్ ఫుట్ పెగ్స్, విశాలమైన రైడర్ మరియు పిలియన్ రైడర్ సీట్, పిలియన్ రైడర్ పట్టు కోసం గ్రాబ్ రెయిల్ మరియు ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లతో కూడిన రియర్ టెయిల్ ల్యాంప్ వంటి డిజైన్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఓలా హోలీ ఆఫర్.. కొత్త కలర్ ఆప్షన్‌లో Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్; 17, 18వ తేదీలలో బుకింగ్స్!

ఇక ఈ స్కూటర్‌లో ప్రధానంగా లభించే ఫీచర్లను గమనిస్తే, ఇందులో హ్యాండిల్‌బార్‌లో అమర్చిన పెద్ద 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే యూనిట్ ఉంటుంది. ఈ యూనిట్ సాయంతోనే స్కూటర్‌లోని అనేక ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు మరియు కంట్రోల్ చేయవచ్చు. ఈ స్కూటర్ స్మార్ట్ కనెక్టింగ్ ఫీచర్‌తో వస్తుంది మరియు ఇందులో ఈ-సిమ్ ఫీచర్ కూడా ఉంటుంది. దీని సహాయంతో స్కూటర్ ఇంటర్నెట్ మరియు మొబైల్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవుతుంది.

ఓలా హోలీ ఆఫర్.. కొత్త కలర్ ఆప్షన్‌లో Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్; 17, 18వ తేదీలలో బుకింగ్స్!

స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ సాయంతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్ మరియు ఎస్ఎమ్ఎస్‌లకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా పొందవచ్చుయ ఇవే కాకుండా, స్కూటర్ యొక్క ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో అనేక విడ్జెట్‌లు కూడా ఉంటాయి. ఇవి వాతావరణం, ఉష్ణోగ్రత, కాల్ అలర్ట్, మెసేజింగ్, నావిగేషన్, మ్యాప్స్ వంటి అనేక ఫీచర్లను యాక్సెస్ చేయడానికి యూజర్‌ను అనుతిస్తాయి. ఇంకా ఇందులో బిల్ట్-ఇన్ స్పీకర్ కూడా ఉంటుంది. ఇది మ్యూజిక్ వినడానికి మరియు రైడింగ్ చేసేటప్పుడు స్కూటర్ నుండి శబ్ధం వచ్చేలా చేయడానికి ఉపయోగపడుతుంది.

ఓలా హోలీ ఆఫర్.. కొత్త కలర్ ఆప్షన్‌లో Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్; 17, 18వ తేదీలలో బుకింగ్స్!

ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ లో 8.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది ఆన్-బోర్డ్ 3.97 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది. నిరుత్సాహపరచే విషయం ఏంటంటే, ఈ బ్యాటరీ ప్యాక్‌లను తొలగించడానికి వీలు ఉండదు. కాబట్టి, అపార్ట్‌మెంట్‌లలో నివసించే వారికి ఈ స్కూటర్ ను చార్జ్ చేయడం కష్టంగా ఉంటుంది. ఈ స్కూటర్‌తో పాటుగా కంపెనీ 750 వాట్ ఆన్‌బోర్డ్ ఛార్జర్‌ను అందిస్తుంది. దీని సాయంతో స్కూటర్‌ను పూర్తిగా చార్జ్ చేయటానికి సుమారు 7 గంటల సమయం పడుతుంది.

ఓలా హోలీ ఆఫర్.. కొత్త కలర్ ఆప్షన్‌లో Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్; 17, 18వ తేదీలలో బుకింగ్స్!

ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యం విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఓలా ఫాస్ట్ ఛార్జర్ పాయింట్ వద్ద కేవలం 60 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. అదే సమయంలో, వీటిని కేవలం 18 నిమిషాల్లోనే గరిష్టంగా 75 కిలోమీటర్ల దూరం నడపడానికి సరిపడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక చివరిగా రేంజ్ విషయానికి వస్తే, ఓలా ఎస్1 ప్రో పూర్తి చార్జ్ పై గరిష్టంగా 181 కిమీ సర్టిఫైడ్ రేంజ్ ను ఆఫర్ చేస్తుంది. రియల్ వరల్డ్‌లో ఇది చాలా తక్కువగా ఉంటుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 115 కిమీగా ఉంటుంది.

ఓలా హోలీ ఆఫర్.. కొత్త కలర్ ఆప్షన్‌లో Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్; 17, 18వ తేదీలలో బుకింగ్స్!

అదరగొడుతున్న ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు

ఓలా ఎలక్ట్రిక్ గడచిన ఫిబ్రవరి నెలలో 3905 యూనిట్ల స్కూటర్లను డెలివరీ చేసిందిని, ఇప్పటి వరకు తాను దాదాపు 7000 స్కూటర్లకు పైగా డెలివరీ చేశామని ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు. ఈనెలాఖరు నాటికి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీల సంఖ్య 15,000 యూనిట్లను దాటవచ్చని ఆయన అంచనా వేశారు. ప్రస్తుతానికి, ఓలా ఎలక్ట్రిక్‌కు ఎలాంటి భౌతిక డీలర్‌షిప్ కేంద్రాలు లేవు. కంపెనీ వాటిని నేరుగా తమ కస్టమర్ల వద్దకే డెలివరీ చేస్తోంది. ఈ మోడళ్లకు సుధీర్ఘమైన వెయిటింగ్ పీరియడ్ ఉన్నప్పటికీ, కస్టమర్లు మాత్రం వీటి కోసం క్యూ కడుతున్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, March 15, 2022, 11:30 [IST]
English summary
Ola holi offer introduces new gerua color option in ola s1 pro details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+