గుడ్ న్యూస్.. ఓలా ఎలక్ట్రిక్ నుంచి రానున్న మరో స్కూటర్: ధర రూ. 80,000 మాత్రమే

భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ దిగ్గజం 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) దేశీయ మార్కెట్లో అడుగు పెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు మంచి అమ్మకాలతో దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది. అయితే రానున్న దీపావళి పండుగను పురస్కరించుకుని కంపెనీ మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేయడాని సంకల్పిస్తోంది. రాబోయే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లకంటే కూడా తక్కువగా ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

గుడ్ న్యూస్.. ఓలా ఎలక్ట్రిక్ నుంచి రానున్న మరో స్కూటర్: ధర రూ. 80,000 మాత్రమే

ఓలా ఎలక్ట్రిక్ నుంచి రానున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 2022 అక్టోబర్ 22 న లాంచ్ అవుతుందని కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ తెలిపారు. అంతే కాకుండా ఈ సమయంలో కంపెనీ నుంచి రానున్న కొత్త ఉత్పత్తులను గురించి కూడా వెల్లడించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ నెలలో లాంచ్ ఈవెంట్ కోసం పెద్ద ప్లాన్ వేస్తున్నట్లు, ఇది ఎలక్ట్రిక్ వాహన విభాగంలో కంపెనీని కానీసం 2 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లడానికి సహాయపడుతుందని తెలిపారు.

గుడ్ న్యూస్.. ఓలా ఎలక్ట్రిక్ నుంచి రానున్న మరో స్కూటర్: ధర రూ. 80,000 మాత్రమే

కంపెనీ దీపావళి సందర్భంగా విడుదల చేయనున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ ధర రూ. 80,000 వరకు ఉంటుందని కూడా తెలిపారు. ఈ ధరను బట్టి చూస్తే ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లకంటే తక్కువే అని స్పష్టమవుతోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తప్పకుండా ఆకర్షిస్తుందని భావిస్తున్నాము. అయితే రానున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఎలాంటి ఫీచర్స్ ఉండనున్నాయి, అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

గుడ్ న్యూస్.. ఓలా ఎలక్ట్రిక్ నుంచి రానున్న మరో స్కూటర్: ధర రూ. 80,000 మాత్రమే

ఓలా ఎలక్ట్రిక్ లాంచ్ చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ ధర వద్ద విడుదలవుతుంది, కావున ఫీచర్స్ పరంగా ఎస్1 మరియు ఎస్1 ప్రో కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

గుడ్ న్యూస్.. ఓలా ఎలక్ట్రిక్ నుంచి రానున్న మరో స్కూటర్: ధర రూ. 80,000 మాత్రమే

ఇదిలా ఉండగా.. ఓలా ఎలక్ట్రిక్ తన ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపైన ఇప్పుడు రూ. 10,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ మొదట్లో విజయదశమి వరకు మాత్రమే అని తెలిపింది, కాగా ఇప్పుడు ఇది రానున్న దీపావళి వరకు కొనసాగుతుందని కంపెనీ సీఈఓ తెలిపారు. అంటే దాదాపు ఈ ఆఫర్ ఈ నెల చివరి వరకు ఉంటుంది. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది, కావున కేవలం రూ. 1.30 లక్షలకే ఎస్1 ప్రో సొంతం చేసుకోవచ్చు.

గుడ్ న్యూస్.. ఓలా ఎలక్ట్రిక్ నుంచి రానున్న మరో స్కూటర్: ధర రూ. 80,000 మాత్రమే

అంతే కాకుండా, ప్రస్తుతం ఓలా ఎస్1 ప్రో కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 10,000 డిస్కౌంట్ తో పాటు.. 5 సంవత్సరాల పొడిగించిన వారంటీపై రూ. 1,500 తగ్గింపు కూడా లభిస్తుంది. అంతే కాకుండా S1 ప్రో కోసం లోన్‌ తీసుకునేవారికి ప్రాసెసింగ్ ఫీజు లేదు. ఇవన్నీ ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసేవారికి మాత్రమే వర్తిస్తాయి.

గుడ్ న్యూస్.. ఓలా ఎలక్ట్రిక్ నుంచి రానున్న మరో స్కూటర్: ధర రూ. 80,000 మాత్రమే

ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఎనలేని ప్రజాదరణ పొందిన ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ఎలక్ట్రిక్ కారు విడుదల చేయడానికి సిద్దమవుతున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. కావున ఈ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన కొత్త టీజర్‌ కూడా గత ఆగష్టు 15 న విడుదల చేశారు. ఈ ఎలక్ట్రిక్ కారు ధర కూడా సుమారు రూ. 50 లక్షల వరకు ఉంటుందని సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు.

గుడ్ న్యూస్.. ఓలా ఎలక్ట్రిక్ నుంచి రానున్న మరో స్కూటర్: ధర రూ. 80,000 మాత్రమే

ఓలా ఎలక్ట్రిక్ తన తన ఎలక్ట్రిక్ కారుని 2024 నాటికి భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. కావున ఇది ఇంకో రెండు సంవత్సరాల్లో భారతీయ రోడ్లపైన తిరగడానికి సిద్ధమవుతోంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 500 కిమీ రేంజ్ అందిస్తుందని కూడా ఇప్పటికే తెలిపారు.

గుడ్ న్యూస్.. ఓలా ఎలక్ట్రిక్ నుంచి రానున్న మరో స్కూటర్: ధర రూ. 80,000 మాత్రమే

ఇప్పటికే కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు గురించి అందించిన సమాచారం ప్రకారం, ఇందులో ముందు వైపు సెడాన్ మాదిరిగా పొడవాటి బానెట్ ను కలిగి ఉండి, వెనుక వైపు వాలుగా ఉండే రూఫ్ ను కలిగి ఉంటుంది. అదే సమయంలో వెనుక భాగంలోని రూఫ్, బూట్‌తో విలీనమైనట్లుగా కనిపిస్తుంది. మొత్తం మీద ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కాగా దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

గుడ్ న్యూస్.. ఓలా ఎలక్ట్రిక్ నుంచి రానున్న మరో స్కూటర్: ధర రూ. 80,000 మాత్రమే

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఓలా ఎలక్ట్రిక్ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు అన్నీ కూడా రూ. 1 లక్ష కంటే ఎక్కువే. అయితే ఈ నెల 22 న విడుదల కానున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 80,000 కే అందుబాటులోకి రానుంది. కావున ఎక్కువమంది ఈ పండుగ సీజన్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, October 10, 2022, 11:19 [IST]
English summary
Ola new electric scooter launch scheduled on october 22nd details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+