200 కిమీ ఎక్కువనుకున్నారు.. ఇప్పుడు 300 కిమీ చేరింది: ఒక్క ఛార్జ్‌తో ఓలా ఎస్1 ప్రో హవా..!!

భారతీయ ఎలక్ట్రిక్ టూవీలర్ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) దేశీయ మార్కెట్లో 'ఓలా ఎస్1' మరియు 'ఎస్1 ప్రో' ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు స్కూటర్లు మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే భారీ అమ్మకాలతో ముందుకు దూసుకెళ్లాయి. దీనికి ప్రధాన కారణం కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను అందించడమే.

కంపెనీ తమ వినియోగదారులకు ఎక్కువ రేంజ్ అందించటానికి 'మూవ్ ఓఎస్ 2.0' అప్డేట్ అందించింది. దీనిద్వారా వినియోగదారులు ఒక్క ఛార్జ్ తో 200 కిమీ కంటే ఎక్కువ పరిధిని పొందారు. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 300 కిమీ పరిధిని పొందినట్లు తెలిసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

ఒక పుల్ ఛార్జ్‌తో 300 కిమీ కంటే ఎక్కువ రేంజ్: ఓలా ఎస్1 ప్రో

నివేదికల ప్రకారం, 'జిగర్ భార్దా' అనే ఓలా ఎస్ 1 ప్రో వినియోగదారుడు సింగిల్ ఛార్జ్‌తో 303 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు తెలిపాడు. ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ 3.97 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంది. అయితే అతడు గంటకు 23 కిమీ సగటువేగంతో 40 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో 303 కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలిపాడు. అయితే యితడు మూవ్ OS 2.0 అప్డేట్ తో వచ్చిన ఎకో మోడ్ సాయంతో ఈ పరిధిని సాధించినట్లు తెలిసింది.

ఒక పుల్ ఛార్జ్‌తో 300 కిమీ కంటే ఎక్కువ రేంజ్: ఓలా ఎస్1 ప్రో

ఈ ఓలా ఎస్1 ప్రో యజమానికి 303 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఏకంగా 13 గంటలు సమయం పట్టింది. అయితే చివరికి ఈ స్కూటర్‌లో కేవలం 6 శాతం ఛార్జింగ్ మాత్రమే మిగిలింది. దానితో ఒక కిలోమీటర్ పరిధిని సాధించాడు. మొత్తం మీద ఓలా ఎస్1 ప్రో యొక్క సింగిల్ ఛార్జ్ తో 303 కిలోమీటర్లు సాధించిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఒక పుల్ ఛార్జ్‌తో 300 కిమీ కంటే ఎక్కువ రేంజ్: ఓలా ఎస్1 ప్రో

నిజానికి ఈ మధ్య కాలంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపైన విపరీతమైన కంప్లైంట్స్ వచ్చాయి. ఈ కారణంగా కంపెనీ యొక్క అమ్మకాలు కొంత తగ్గుముఖం పట్టాయి. మార్కెట్లో 2022 జూన్ అమ్మకాలలో 14.70 శాతం వాటాను కలిగి ఉంది. అయితే ఓలా ఎలక్ట్రిక్ కంటే కూడా ఒకినావా, యాంపియర్ మరియు హీరో ఎలక్ట్రిక్ వంటి కంపెనీలు అమ్మకాల్లో ముందు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఛార్జ్ తో 300 కిమీ కంటే ఎక్కువ పరిధిని అందించడం వల్ల, ఎక్కువమంది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నాము.

ఒక పుల్ ఛార్జ్‌తో 300 కిమీ కంటే ఎక్కువ రేంజ్: ఓలా ఎస్1 ప్రో

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 3.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక పూర్తి ఛార్జ్‌పై 121 కిమీల రేంజ్‌ను అందిస్తుంది, అయితే హై ఎండ్ వేరియంట్ S1 ప్రో 181 కిమీల పరిధిని కలిగి ఉంది. ఈ రెండు స్కూటర్ల టాప్ స్పీడ్ విషయానికి వస్తే, Ola S1 గరిష్టంగా 90 km/h వేగంతో, Ola S1 Pro గరిష్టంగా 115 km/h వేగంతో రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు 'మూవ్ ఓఎస్ 2.0' అప్డేట్ 200 కిమీ కంటే ఎక్కువ పరిధిని (ఎకో మోడ్) పొందవచ్చు.

ఒక పుల్ ఛార్జ్‌తో 300 కిమీ కంటే ఎక్కువ రేంజ్: ఓలా ఎస్1 ప్రో

ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ గతంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించాడు. దీని ప్రకారం ఎవరైతే ఒక పూర్తి ఛార్జ్ పైన 200 కిమీ కంపెనీ ఎక్కువ పరిధిని పొందుతారో వారికి మరో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఉచితంగా అందిస్తామని తెలిపాడు. అయితే ఇప్పుడు ఒక పుల్ ఛార్జ్‌తో ఏకంగా 300 కిమీ కంపెనీ ఎక్కువ దూరం ప్రయణించాడు. కావున ఇతనికి ఓలా సీఈఓ ఏమి గిఫ్ట్ గా అందిస్తాడో తెలియాలి.

ఒక పుల్ ఛార్జ్‌తో 300 కిమీ కంటే ఎక్కువ రేంజ్: ఓలా ఎస్1 ప్రో

ఇదిలా ఉండగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఇటీవల లిథియం-అయాన్ సెల్ NMC 2170 ని ఆవిష్కరించింది. ఇది పూర్తిగా దేశీయంగా లభించే ముడి సరుకులు మరియు టెక్నాలజీతో తయారు చేసింది. కంపెనీ 2023 నుండి రాబోయే గిగాఫ్యాక్టరీలో ఈ బ్యాటరీ సెల్స్ ను భారీ మొత్తంలో ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.

ఒక పుల్ ఛార్జ్‌తో 300 కిమీ కంటే ఎక్కువ రేంజ్: ఓలా ఎస్1 ప్రో

కంపెనీఆవిష్కరించిన ఈ లేటెస్ట్ హై నికెల్ సెల్ NMC 2170 క్యాథోడ్ వైపు మరియు యానోడ్ వైపు గ్రాఫైట్ మరియు సిలికాన్‌లను ఉపయోగిస్తుంది. ఈ బ్యాటరీ సెల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగించే సాధారణ లిథియం సెల్ కంటే ఎక్కువ శక్తిని నిల్వ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీని లైఫ్ టైమ్ కూడా మిగిలిన వాటికంటే ఎక్కువగా ఉంటుంది. కావున దీనిని ఎక్కువ రోజులు ఉపయోగించవచ్చు.

ఒక పుల్ ఛార్జ్‌తో 300 కిమీ కంటే ఎక్కువ రేంజ్: ఓలా ఎస్1 ప్రో

భారతదేశంలో తయారు చేయబోయే ఈ లిథియం-అయాన్ సెల్ తమ సెల్ టెక్నాలజీ రోడ్‌మ్యాప్‌లోని అనేక లక్ష్యాలలో ఒకటి అని భవిష్ అగర్వాల్ తెలిపారు. ప్రపంచ ఈవీ హబ్‌గా మారడానికి భారతదేశం బలమైన స్థానిక ఈవీ పర్యావరణ వ్యవస్థను కలిగి ఉండటం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయ పడ్డారు. స్వదేశీ అధునాతన సెల్ టెక్నాలజీలను రూపొందించడానికి, తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి మరియు ఇంటిగ్రేటెడ్ ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ హబ్‌ను రూపొందించడానికి పరిశోధన మరియు అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టడానికి కట్టుబడి ఉన్నామని కంపెనీ తెలిపింది. దీన్ని బట్టి చూస్తుంటే ఓలా ఎలక్ట్రిక్ దేశీయ విఫణిలో నిలదొక్కుకోవడానికి పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తోందని స్పష్టమవుతోంది.

More from DriveSpark

Article Published On: Thursday, July 14, 2022, 10:16 [IST]
English summary
Ola s1 pro electric scooter owner gets 300 km range with single charge
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+