ఓలా స్కూటర్ అభిమానాలకు షాక్.. పెరిగిన Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు

దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric), తమ పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ "ఓలా ఎస్1 ప్రో" (Ola S1 Pro ) ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. హోలీ రోజు ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాలపై డిస్కౌంట్లను అందిస్తుంటే, ఓలా మాత్రం ధరల పెంపుతో కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఈరోజు చివరి వరకూ ఓలా ఎస్1 ప్రో స్కూటర్ ను కొనుగోలు చేసే కస్టమర్లు మాత్రమే దానిని రూ.1.29 లక్షలకు (ఎక్స్-షోరూమ్) సొంతం చేసుకోవచ్చు.

ఓలా స్కూటర్ అభిమానాలకు షాక్.. పెరిగిన Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు

తాజా సమాచారం ప్రకారం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు రేపటి నుంచి పెరగనున్నాయి. హోలీ పండుగ సందర్భంగా తమ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు కోసం ఓలా 17, 18వ తేదీలలో కొనుగోలు విండోను ఓపెన్ చేసింది. ఆ సమయంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనేవారికి ఈ ధరల పెంపు వర్తించదు. అయితే, ఈ కంపెనీ తదుపరిగా ఓపెన్ చేయబోయే కొనుగోలు విండోలో వీటి ధరలను పెంచనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిష్ అగర్వాల్ ఈ ధరల పెంపును ధృవీకరించారు.

ఓలా స్కూటర్ అభిమానాలకు షాక్.. పెరిగిన Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు

3 నుండి 5 శాతం ధరలు పెరిగే ఛాన్స్

కాగా, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను ఎంత మేర పెంచుతామనే విషయాన్ని మాత్రం ఆయన ఖచ్చితంగా వెల్లడించలేదు. అంచనా ప్రకారం, వీటి ధరలు సుమారు 3 నుండి 5 శాతం వరకూ పెరిగే అవకాశం ఉంది. ఓలా ఇప్పటి వరకూ తమ ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ను రూ. 1,29,999 ధరకు మరియు ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ను రూ. 99,999 ధరకు విక్రయించింది. ఇకపై, రేపటి నుండి కొత్త ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయాలనుకునే వారు పెరిగిన కొత్త ధరలను చెల్లించాల్సి ఉంటుంది.

ఓలా స్కూటర్ అభిమానాలకు షాక్.. పెరిగిన Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు

భవీష్ అగర్వాల్ ట్వీట్..

ధర పెరుగుదల గురించి భవీష్ అగర్వాల్ చేసిన ట్వీట్ లో "ఇప్పటికే ఎస్1 ప్రోని కొనుగోలు చేసిన వారందరికీ ధన్యవాదాలు మరియు వారి 2వ లేదా 3వ ఎస్1 ప్రోని కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను రూ. 129,999 ధరకి పొందడానికి ఇదే చివరి అవకాశం. మేము తదుపరి విండోలో ధరలను పెంచుతాము. ఈ విండో మార్చి 18 అర్థరాత్రిన ముగుస్తుంది! ఇప్పుడే కొనండి, ఓలా యాప్‌లో మాత్రమే" అంటూ పేర్కొన్నారు.

ఓలా స్కూటర్ అభిమానాలకు షాక్.. పెరిగిన Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు

కొత్త గెరువా కలర్ ఆప్షన్

ఓలా తమ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క మూడవ దశ సేల్ లో భాగంగా, Ola S1 Pro మోడల్‌లో ఓ కొత్త కలర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. ఓలా ఎస్1 ప్రో ఇప్పుడు గెరువా కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుంది. కాకపోతే, ఈ మోడల్ కోసం మార్చ్ 17 మరియు మార్చ్ 18వ తేదీలలో మాత్రమే బుకింగ్స్ ఓపెన్ చేయబడి ఉంటాయి. ఈ కొత్త ప్రత్యేక ఎడిషన్ డెలివరీలు ఏప్రిల్ 2022లో ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త (గెరువా) కలర్ ఆప్షన్ కాకుండా ఓలా ఎస్1 ప్రోను కంపెనీ ఇప్పటికే 10 ఆకర్షణీయమైన రంగులలో విక్రయిస్తోంది.

ఓలా స్కూటర్ అభిమానాలకు షాక్.. పెరిగిన Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు

ఓలా మెగా ఫ్యూచర్ ఫ్యాక్టరీ

ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రాజెక్ట్ ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో. ఈ స్కూటర్ల తయారీ కోసం కంపెనీ తమిళనాడులోని 500 ఎకరాల్లో ఓ మెగా ప్లాంట్ ను ఏర్పాటు చేసింది.ఇది ఇప్పుడు రోజుకు దాదాపు 1,000 యూనిట్ల S1 మరియు S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేస్తోంది. ఓలాకు ప్రస్తుతం, ఎలాంటి భౌతిక డీలర్‌షిప్ కేంద్రాలు లేవు, ఇది నేరుగా కస్టమర్ ఇంటికే పూర్తిగా రిజిస్టర్ చేయబడిన ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీ చేస్తోంది.

ఓలా స్కూటర్ అభిమానాలకు షాక్.. పెరిగిన Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు

త్వరలో MoveOS 2.0 రిలీజ్

ఇదిలా ఉంటే, ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ల రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంలో భాగంగా త్వరలో MoveOS 2.0ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై అమర్చబడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లో ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్. ఓవర్ ది ఎయిర్ (OTA) అప్‌డేట్ ద్వారా కంపెనీ తమ వినియోగదారులకు MoveOS 2.0 అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. కస్టమర్లు తమ మొబైల్ డేటాతో కానీ లేదా వైఫై ద్వారా కానీ ఈ అప్‌డేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను తమ స్కూటర్లలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

ఓలా స్కూటర్ అభిమానాలకు షాక్.. పెరిగిన Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు

కొత్త మూవ్ఓఎస్ 2.0 ఈ ఏడాది ఏప్రిల్ చివరి నుండి వినియోగదారుల కోసం విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో కొత్తగా చేర్చిన ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో టర్న్-బై-టర్న్ నావిగేషన్, స్కూటర్‌తో లొకేషన్ షేరింగ్ మరియు సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్‌ను గుర్తించడం వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులోని ఇతర అప్‌డేట్‌ల విషయానికి వస్తే, కొత్త సహచర యాప్, కొత్త బ్లూటూత్ ఆధారిత ఫంక్షన్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

ఓలా స్కూటర్ అభిమానాలకు షాక్.. పెరిగిన Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు

ఓలా ఎస్ 1 ప్రో - బ్యాటరీ, రేంజ్, టాప్ స్పీడ్

ఓలా ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో 8.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది ఆన్-బోర్డ్ 3.97 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది. పూర్తి చార్జ్ పై ఇది గరిష్టంగా 181 కిమీ రేంజ్ ను అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 115 కిమీగా ఉంటుంది. ఇందులో నార్మల్, స్పోర్ట్, హైపర్ అనే రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఈ స్కూటర్‌తో పాటుగా కంపెనీ 750 వాట్ ఆన్‌బోర్డ్ ఛార్జర్‌ను అందిస్తుంది. దీని సాయంతో స్కూటర్‌ను పూర్తిగా చార్జ్ చేయటానికి సుమారు 7 గంటల సమయం పడుతుంది.

More from DriveSpark

Article Published On: Friday, March 18, 2022, 17:07 [IST]
English summary
Ola s1 pro electric scooter price increased no other changed made to the scooter
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+