'ఓలా ఎస్ 1 ప్రో' పై నవరాత్రి స్పెషల్ డిస్కౌంట్.. ఈ ఆఫర్ అప్పటి వరకు మాత్రమే
'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) దేశీయ మార్కెట్లో అడుగుపెట్టినప్పటినుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ. మొదట్లో కంపెనీ ఎస్1 మరియు ఎస్1 ప్రో అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసి ఆశించినదానికంటే కూడా ఎక్కువ సంఖ్యలో బుకింగ్స్ పొందగలిగింది. అయితే ఈ పండుగ సీజన్లో కస్టమర్లకు మరింత చేరువుకావడానికి కంపెనీ ఒక అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, భారతదేశంలో ఇప్పటికే ప్రారంభమైన పండుగ సీజన్ ని దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు కొనుగోలు చేసే కస్టమర్లకు ఏకంగా రూ. 10,000 డిస్కౌంట్ అందించబడుతుంది. ఇది కేవలం ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపైన మాత్రమే ఉంటుంది. కావున కొనుగోలుదారులు తప్పకుండా గమనించాలి.

కంపెనీ అందించే డిస్కౌంట్ తరువాత దీని ధర రూ. 1.30 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. కావున ఇప్పుడు కొనుగులు చేసే కస్టమర్లు గరిష్టంగా రూ. 10,000 డిస్కౌంట్ తో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ తప్పకుండా అమ్మకాలను పెంచే అవకాశం ఉంటుంది.

నిజానికి కంపెనీ గతంలో తన ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను రూ. 10,000 పెంచాలని నిర్ణయించింది. అయితే క్రమంగా అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ఈ కారణంగా మే నెలలో 9,249 యూనిట్ల అమ్మకాలు పొందిన కంపెనీ ఆగష్టు నెలలో కేవలం 3,421 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఇది కంపెనీకి ఎక్కువ నష్టాన్ని కలిగించే సూచనలను తెలిపింది. అయితే ఈ పండుగ సీజన్లో కంపెనీ మళ్ళీ తన పూర్వ వైభవం పొందటానికి ఈ కొత్త ఆఫర్ తీసుకువచ్చింది.

కంపెనీ అందిస్తున్న ఈ అఫర్ కేవలం లిమిటెడ్ పీరియడ్ వరకు మాత్రమే ఉంటుంది. కావున ఈ ఆఫర్ ఇప్పుడు అక్టోబర్ 05 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ లోపు కొనుగోలు చేసేవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంతే కాకూండా 5 సంవత్సరాల పొడిగించిన వారంటీపై రూ. 1,500 తగ్గింపు కూడా లభిస్తుంది.

ఓలా ఎస్1 ప్రో అద్భుతమైన డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో 3.9 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీతో శక్తిని పొందుతాయి. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 750W కెపాసిటీ గల పోర్టబుల్ ఛార్జర్‌తో ఓలా స్కూటర్ బ్యాటరీని దాదాపు 6 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75 శాతం వరకు ఛార్జ్ చేయబడుతుంది. ఓలా S1 ప్రో ఒక ఫుల్ ఛార్జ్ పైన గరిష్టంగా 181 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్న మూవ్ ఓఎస్2 అప్డేట్ వల్ల మరింత ఎక్కువ పరిధి పొందవచ్చు.

ఇదిలా ఉండగా ఓలా ఎలక్ట్రిక్ ప్రారంభంలో ఒక డీలర్షిప్ గానీ, ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ గానీ ప్రారంభించలేదు. బుకింగ్స్ మరియు డెలివరీ అంతా కూడా ఆన్లైన్ లోనే జరిగింది. అయితే ఇటీవల తన మొదటి ఈవీ సెంటర్లను పూణే మరియు చండీగఢ్‌లలో ప్రారంభించింది.

దేశం మొత్తం మీదుగా ఒక్క డీలర్‌షిప్ కూడా లేకుండా నేరుగా కస్టమర్‌లకు డెలివరీ చేయడం కొంత క్లిష్టమైన సమస్యే అని చెప్పాలి. అయితే దీనిగురించి కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ మొదటినుంచి చెబుతూనే ఉన్నారు. అయితే మొత్తం మీద హోమ్ డెలివరీ దాదాపు విజయవంతం అయింది.

ప్రస్తుతం మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తప్పకుండా డీలర్షిప్స్ ప్రారభించాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మొత్తం 200 షోరూమ్‌లను ఏర్పాటు చేయడానికి కంపెనీ కంకణం కట్టుకుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ 'భవిష్ అగర్వాల్' స్వయంగా వెల్లడించారు. కావున రానున్న రోజులో ఓలా డీలర్షిప్స్ కూడా అందుబాటులో రానున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
ఓలా ఎలక్ట్రిక్ అందించే ఈ కొత్త ఆఫర్ పండుగ సీజన్ లో తప్పకుండా కొనుగోలుదారుల సంఖ్యను పెంచే అవకాశం ఉందని ఆశిస్తున్నాము, అయితే ఈ ఓలా ఎస్1 ప్రో కొనాలనుకునే కస్టమర్లు అక్టోబర్ 05 లోపు కొనుగోలుచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఆఫర్ కేవలం అప్పటివరకు మాత్రమే వర్తిస్తుంది.


Click it and Unblock the Notifications








