ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే వారి కోసం.. అదిరిపోయే ఆఫర్స్, అంతకు మించిన డిస్కౌంట్స్

2022 సంవత్సరం చివరిలో కూడా ఓలా ఎలక్ట్రిక్ భారతీయ మార్కెట్లో తన వాహనాల అమ్మకాలను పెంచుకోవడానికి మరియు కొనుగోలుదారులకు మరింత చేరువ కావడానికి అద్భుతమైన ఆఫర్స్ మరియు డిస్కౌంట్స్ అందిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్స్ లో భాగంగా ఇప్పుడు జీరో డౌన్ పేమెంట్, తక్కువ వడ్డీ రేట్లు, EMI వంటి వాటితో పాటు Ola యొక్క హైపర్‌చార్జర్ నెట్‌వర్క్‌కు ఫ్రీ యాక్సెస్ మరియు ఒక సంవత్సరం పాటు ఫ్రీ సర్వీసింగ్ వంటివి ఇందులో అందుబాటులో ఉన్నాయి. గతంలో కంపెనీ తన ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అందించిన రూ.10,000 డిస్కౌంట్ ఈ సంవత్సరం చివరి వరకు అందుబాటులో ఉంటుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే వారి కోసం

ఓలా ఎలక్ట్రిక్ గత 2022 సెప్టెంబరు నెలలో ఈ S1 ప్రో స్కూటర్ మీద రూ.10,000 డిస్కౌంట్ ప్రవేశపెట్టింది. అయితే ఈ ఆఫర్ ఇప్పుడు ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉంటుంది. కావున ఓలా ఎస్1 ప్రో కొనాలనుకునే కస్టమర్లు రూ.10,000 తగ్గింపును పొందవచ్చు. అదే సమయంలో ఎస్1, ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపైన రూ.3,999 విలువైన ఒక సంవత్సరం వరకు ఫ్రీ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపైన ఇప్పుడు జీరో డౌన్ పేమెంట్ మరియు లోన్‌పై జీరో ప్రాసెసింగ్ ఫీజ్ వంటివి అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో EMI కూడా రూ.2,499 నుంచి ప్రారంభమవుతుంది. ఇవన్నీ కూడా ఈ నెలలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసేవారికి వర్తిస్తాయి. అంతే కాకుండా మీరు S1 లేదా S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ముగ్గురికి రెఫర్ చేస్తే, మీరు రూ.4,500 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

ఇదిలా ఉండగా ఓలా ఎలక్ట్రిక్ 2022 సెప్టెంబర్ నెల అమ్మకాలలో మంచి రికార్డ్ సృష్టించింది. నివేదికల ప్రకారం కంపెనీ గత నెలలో 20,000 యూనిట్లను విక్రయించగలిగింది. 2022 అక్టోబర్ నెలలో కూడా కంపెనీ 20,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించగలిగింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ అమ్మకాల పరంగా వేగంగా దూసుకెట్లున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో కంపెనీ ఇప్పుడు అగ్రగ్రామిగా నిలిచింది.

ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్లకు మరింత చేరువ కావడానికి దేశం మొత్తమ్ మీద ఎక్స్పీరియన్స్ సెంటర్లను వేగంగా ప్రారభిస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పటికే మొత్తమ్ 11 నగరాల్లో 14 కొత్త ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ప్రారంభించింది. ఇప్పటి వరకు బెంగళూరులో 3, పూణేలో రెండు, అహ్మదాబాద్‌, డెహ్రాడూన్‌, ఢిల్లీ, హైదరాబాద్‌, కోట, భోపాల్‌, నాగ్‌పూర్‌, రాంచీ, వడోదర వంటి ప్రాంతాల్లో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభించింది.

ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే భారతీయ మార్కెట్లో ఎస్1, ఎస్1 ప్రో మరియు ఎస్1 ఎయిర్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఇందులో అలా ఎస్1 ఎయిర్ ధర రూ. 84,999 (ఎక్స్-షోరూమ్). ఇది ఒక ఫుల్ చార్జ్ తో గరిష్టంగా 101 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇందులో 2.5-కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ మరియు 4.5 కిలోవాట్ హబ్-మౌంటెడ్ మోటారు ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లవరకు ఉంటుంది.

దేశీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ కాకుండా టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ ఎనర్జీ మరియు బజాజ్ చేతక్ వంటి వున్నాయి. రానున్న రోజుల్లో కొత్త ఉత్పత్తులు కూడా పుట్టుకొచ్చే అవకాశం ఉంది. కావున ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఉత్పత్తులు వేగంగా పెరుగుతాయి. కావున మార్కెట్లో గట్టి పోటీ ఏర్పడుతుంది. కావున ఓలా ఎలక్ట్రిక్ దేశీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, December 8, 2022, 9:45 [IST]
English summary
Ola s1 pro rs 10000 discount financing offers in 2022 december
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+