నెల్లూరు మరియు విజయవాడ నగరాల్లో రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) షోరూమ్ ప్రారంభం!

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రివోల్ట్ మోటార్స్ (Revolt Motors), ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు కొత్త షోరూమ్ లను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు మరియు విజయవాడ నగరాల్లో కంపెనీ తమ కొత్త షోరూమ్ లను ఏర్పాటు చేసింది. రివోల్ట్ మోటార్స్‌కు వైజాగ్ తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్‌లో మూడవ స్టోర్ అవుతుంది.

నెల్లూరు మరియు విజయవాడ నగరాల్లో రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) షోరూమ్ ప్రారంభం!

రివోల్ట్ మోటార్స్ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఓపెన్ చేసిన స్టోర్ చిరునామా డోర్ నెంబర్ 25 - 2/13, కరెంట్ ఆఫీస్ సెంటర్ (యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన), జిఎన్‌టి రోడ్ కాగా, విజయవాడలో ఓపెన్ చేసిన స్టోర్ చిరునామా ప్లాట్ నెం.10, పటమలంక (వెస్ట్ సైడ్ ఎదురుగా) ఉంది. భారతదేశంలో ఈ బ్రాండ్ ఇప్పటికే 22 షోరూమ్ లను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ తమ షోరూమ్‌ల సంఖ్యను 40కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

నెల్లూరు మరియు విజయవాడ నగరాల్లో రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) షోరూమ్ ప్రారంభం!

భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీకి సంబంధించిన ప్రతి అంశానికి మద్దతిచ్చే మూడవ అత్యంత ఈవీ-ఫ్రెండ్లీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని కంపెనీ పేర్కొంది. రాష్ట్రంలో ఈవీల స్వీకరణను వేగవంతం చేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వం నిర్వహించే ఈవీ విధానాలు ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా స్వీకరించడం మరియు తయారీని ప్రోత్సహిస్తున్నాయి. కొత్తగా కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ వాహనాలపై 100 శాతం రోడ్డు పన్ను మినహాయింపుతో సహా రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు వివిధ రకాల రాయితీలను కూడా అందిస్తుంది.

నెల్లూరు మరియు విజయవాడ నగరాల్లో రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) షోరూమ్ ప్రారంభం!

అంతేకాకుండా, 2030 సంవత్సరం నాటికి సిటీ బస్సుల విషయంలో 100 శాతం ఎలక్ట్రిఫికేషన్ సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది మరియు రాష్ట్రంలో ఈవీల తయారీ కోసం 30,000 కోట్ల రూపాయల పెట్టుబడిని కూడా వెచ్చించాలని ప్లాన్ చేస్తోంది. దక్షిణ భారతదేశంలోని చెన్నై, కేరళ, కర్ణాటక మరియు తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను ప్రోత్సహించడానికి అంకితమైన ఈవీ విధానాల (ఈవీ పాలసీల)ను అందిస్తున్నాయి.

నెల్లూరు మరియు విజయవాడ నగరాల్లో రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) షోరూమ్ ప్రారంభం!

రివోల్ట్ మోటార్స్ ప్రస్తుతం భారత మార్కెట్లో రెండు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను విక్రయిస్తోంది. వీటిలో మొదటి రివోల్ట్ ఆర్‌వి300 మరియు రెండవది రివోల్ట్ ఆర్‌వి400. రివాల్ట్ ఆర్‌వి300 (Revolt RV300) ఎలక్ట్రిక్ బైక్‌లో 1.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. ఇది 2.7 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇది పూర్తి చార్జ్‌పై ఎకో మోడ్‌లో 180 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ గరిష్టంగా గంటకు 65 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. కాకపోతే, ఎకో మోడ్‌లో దీని గరిష్ట వేగం గంటకు 25 కి.మీ మాత్రమే.

నెల్లూరు మరియు విజయవాడ నగరాల్లో రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) షోరూమ్ ప్రారంభం!

రివోల్ట్ ఆర్‌వి400 (Revolt RV400) ఎలక్ట్రిక్ బైక్ విషయానికి వస్తే, ఇందులో 3.0 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. 3.24 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది.ఈ బైక్ పూర్తి చార్జ్‌పై 156 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ గరిష్టంగా గంటకు 85 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. ఇందులో ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు కూడా ఉన్నాయి. ఎకో మోడ్‌లో దీని రేంజ్ 150 కిలోమీటర్లు, నార్మల్ మోడ్‌లో 100 కిలోమీటర్లు మరియు స్పోర్ట్ మోడ్‌లో 80 కిలోమీటర్ల వరకూ ఉంటుంది.

నెల్లూరు మరియు విజయవాడ నగరాల్లో రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) షోరూమ్ ప్రారంభం!

రివాల్ట్ ఆర్‌వి300 మరియు ఆర్‌వి400 రెండు మోడళ్లలో కూడా సిటీ, ఎకో మరియు స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. రైడర్ ఎంచుకునే మోడ్‌ను బట్టి టాప్ స్పీడ్ మరియు రేంజ్ మారుతూ ఉంటాయి. వీటి ముందు భాగంలో అప్ సైడ్ డౌన్ ఫోర్క్‌లు మరియు వెనుక భాగంలో సర్దుబాటు చేయగల మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఇరు చక్రాలపై 240 మిమీ డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇవి కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ మరియు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను సపోర్ట్ చేస్తాయి.

నెల్లూరు మరియు విజయవాడ నగరాల్లో రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) షోరూమ్ ప్రారంభం!

అంతేకాకుండా, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో రివోల్ట్ మోటార్స్ అత్యధికంగా ఈ బైక్‌పై 1.5 లక్షల కి.మీ వారంటీ అందిస్తోంది. రివోల్ట్ యొక్క ఈ ఎలక్ట్రిక్ బైక్‌లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో రూపొందించబడ్డాయి. ఫలితంగా, ఇవి అత్యంత ఆధునిక బైక్‌లుగా ఉంటాయి. ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, కీలెస్ ఇగ్నిషన్ మరియు పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి మరెన్నో ఫీచర్లు ఈ బైక్ లలో లభిస్తాయి.

నెల్లూరు మరియు విజయవాడ నగరాల్లో రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) షోరూమ్ ప్రారంభం!

ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లలోని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4.5 గంటలు పడుతుందని కంపెనీ తెలిపింది. రివోల్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల కోసం కంపెనీ 'మై రివోల్ట్' అనే స్మార్ట్ ఫోన్ అప్లికేషన్‌ను కూడా అందిస్తోంది. ఈ యాప్ సాయంతో కస్టమర్లు తమ ఎలక్ట్రిక్ బైక్‌ను తమ ఫోన్ సాయంతో యాక్సెస్ చేసుకోవచ్చు మరియు వివిధ రకాల ఫంక్షన్లను కంట్రోల్ చేయవచ్చు. ఈ యాప్‌లో బైక్ లొకేటర్, జియో-ఫెన్సింగ్, కస్టమైజబల్ ఎగ్జాస్ట్ సౌండ్ మరియు బ్యాటరీ స్టేటస్‌తో పాటుగా అనేక ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, April 8, 2022, 12:13 [IST]
English summary
Revolt motors opens two new retail stores in nellore and vijayawada
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+