ఇంకా డెలివరీకి సిద్ధం కానీ 'సింపుల్ వన్' ఎలక్ట్రిక్ స్కూటర్.. పైగా మళ్ళీ షాకింగ్ న్యూస్..!!

ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్లో ఎంత ఆదరణ ఉందొ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే దేశీయ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ప్రతి రోజూ ఏదో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్ అవుతూనే ఉంది. అయితే గత సంవత్సరం ఆగష్టు 15 న విడుదలైన సింపుల్ ఎనర్జీ యొక్క సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. కాగా ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు మరింత ఆలస్యం కానున్నాయి.

ఇంతకీ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ఆలస్యం కావడానికి కారణం ఏమిటి? డెలివరీలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ఇంకా డెలివరీకి సిద్ధం కానీ 'సింపుల్ వన్' ఎలక్ట్రిక్ స్కూటర్.. పైగా మళ్ళీ షాకింగ్ న్యూస్..!!

ఓలా ఎలక్ట్రిక్ తో పాటు దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ఈ సంవత్సరం జూన్ నుంచి ప్రారంభించనున్నట్లు కంపెనీ గతంలో తెలిపింది, ఆ తరువాత ఇది కాస్త సెప్టెంబర్‌కు చేరింది. అంటే సెప్టెంబర్‌ నెలలో కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ను డెలివరీ చేయనున్నట్లు తెలిపింది. అయితే ఇప్పుడు ఈ స్కూటర్ డెలివరీలు వచ్చే సంవత్సరానికి వాయిదా వేయబడ్డాయి.

ఇంకా డెలివరీకి సిద్ధం కానీ 'సింపుల్ వన్' ఎలక్ట్రిక్ స్కూటర్.. పైగా మళ్ళీ షాకింగ్ న్యూస్..!!

కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం, వచ్చే సంవత్సరం మార్చి నెలలో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ జరుగుతుందని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకున్న వారు డెలివరీ కోసం ఇంకా 5 నెలలు వేచి ఉండాల్సి వస్తోంది.

ఇంకా డెలివరీకి సిద్ధం కానీ 'సింపుల్ వన్' ఎలక్ట్రిక్ స్కూటర్.. పైగా మళ్ళీ షాకింగ్ న్యూస్..!!

కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీలను ఆలస్యం చేయడానికి ప్రధాన కారణం కూడా ఉంది. ఇటీవల భారత ప్రభుత్వం నిర్దేశించిన బ్యాటరీ భద్రతా మార్గదర్శకాల కారణంగా డెలివరీలు ఆలస్యం అవుతున్నాయి. గతంలో ఓలా ఎలక్ట్రిక్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లలోని బ్యాటరీలు పేలిన సంఘటనల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రహదారులు మరియు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది.

ఇంకా డెలివరీకి సిద్ధం కానీ 'సింపుల్ వన్' ఎలక్ట్రిక్ స్కూటర్.. పైగా మళ్ళీ షాకింగ్ న్యూస్..!!

ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుకూలంగా కంపెనీ కొత్త ప్రమాణాలకు కట్టుబడి ఉంటుంది. ఇది డెలివరీల ఆలస్యానికి కారణం అవుతోంది. అయితే ఇందులో పటిష్టమైన భద్రతా ప్రమాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కావున కొనుగోలుదారులకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వల్ల ఎలాంటి ఆపాయం ఉండే అవకాశం లేదు.

ఇంకా డెలివరీకి సిద్ధం కానీ 'సింపుల్ వన్' ఎలక్ట్రిక్ స్కూటర్.. పైగా మళ్ళీ షాకింగ్ న్యూస్..!!

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.09 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇప్పటివరకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 55,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 'రెడ్, వైట్, బ్లాక్ మరియు బ్లూ' అనే నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

ఇంకా డెలివరీకి సిద్ధం కానీ 'సింపుల్ వన్' ఎలక్ట్రిక్ స్కూటర్.. పైగా మళ్ళీ షాకింగ్ న్యూస్..!!

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్. కావున దీహి చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఇందులో 4.8 కిలోవాట్ పోర్టబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది రిమూవబుల్ బ్యాటరీ, కావున సింపుల్ లూప్ ఛార్జర్‌తో ఈ స్కూటర్‌ను కేవలం 60 సెకన్లలో 2.5 కిలోమీటర్లు ప్రయాణించడానికి కావలసిన ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

ఇంకా డెలివరీకి సిద్ధం కానీ 'సింపుల్ వన్' ఎలక్ట్రిక్ స్కూటర్.. పైగా మళ్ళీ షాకింగ్ న్యూస్..!!

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 236 కి.మీ (ఎకో మోడ్) రేంజ్ అందిస్తుంది. ఇది కేవలం 3.6 సెకన్లలో గంటకు 0 నుంచి 50 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఇంకా డెలివరీకి సిద్ధం కానీ 'సింపుల్ వన్' ఎలక్ట్రిక్ స్కూటర్.. పైగా మళ్ళీ షాకింగ్ న్యూస్..!!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉండటమే కాకుండా, ఆధునిక ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో 12 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ అందుబాటులో ఉన్నాయి. అంతే కాకూండా ఇందులో 7 ఇంచెస్ డిజిటల్ డాష్‌బోర్డ్, ఆన్-బోర్డ్ నావిగేషన్, జియో-ఫెన్సింగ్, డాక్యుమెంట్ స్టోరేజ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇంకా డెలివరీకి సిద్ధం కానీ 'సింపుల్ వన్' ఎలక్ట్రిక్ స్కూటర్.. పైగా మళ్ళీ షాకింగ్ న్యూస్..!!

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి సస్పెన్షన్ మరియు బ్రేకింగ్ సిస్టం కలిగి ఉంటుంది, ఈ బైక్ యొక్క ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు మోనో షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు మరియు వెనుక 90 మిమీ డ్రమ్ బ్రేక్‌లు అందుబాటులో ఉంటాయి. బూట్ స్పేస్ 30 లీటర్ల వరకు ఉంటుంది.

ఇంకా డెలివరీకి సిద్ధం కానీ 'సింపుల్ వన్' ఎలక్ట్రిక్ స్కూటర్.. పైగా మళ్ళీ షాకింగ్ న్యూస్..!!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

సింపుల్ ఎనర్జీ దేశీయ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసి ఒక సంవత్సర కాలం పూర్తయింది. అయితే ఇప్పటివరకు కూడా డెలివరీలు జరపలేదు. ఇది బుక్ చేసుకున్న కష్టమర్లలో కొంత నిరాశని కలిగించే అవకాశం ఉంటుంది. కావున ప్రభుత్వ నిబంధనలను అనుగుణంగా భద్రతా ప్రమాణాలను అప్డేట్ చేసే వీలైనంత తొందరగా డెలివరీలు జరపాలని భావిస్తున్నాము. సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Friday, October 14, 2022, 12:29 [IST]
English summary
Simple one electric scooter delivery delayed for new battery standards
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+