అప్పుడే అప్‌గ్రేడ్ మోటారుతో రానున్న Simple One ఎలక్ట్రిక్ స్కూటర్: ఇక కుర్రకారుకి పండగే

భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ తో పాటు, సింపుల్ ఎనర్జీ (Simple Energy) కూడా తన సింపుల్ వన్ (Simple One) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందగలిగింది. అయితే ఇప్పుడు కంపెనీ ఈ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అప్‌గ్రేడ్ చేసిన మోటారును తీసుకువచ్చింది మరియు అప్‌డేట్ చేయబడిన మోటారుతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు 2022 జూన్ నుండి ప్రారంభమవుతాయి.

అప్పుడే అప్‌గ్రేడ్ మోటారుతో రానున్న Simple One ఎలక్ట్రిక్ స్కూటర్: ఇక కుర్రకారుకి పండగే

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త మోటారుతో రావడం వల్ల మెరుగైన సామర్థ్యం అందిస్తుందని తెలుస్తోంది. అంతే కాకూండా సింపుల్ వన్ ప్రస్తుతం దేశంలోనే తమ మోటారును తయారు చేసే ఏకైక ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అని కంపెనీ తెలిపింది.

అప్పుడే అప్‌గ్రేడ్ మోటారుతో రానున్న Simple One ఎలక్ట్రిక్ స్కూటర్: ఇక కుర్రకారుకి పండగే

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఇప్పటికి 30,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను పొందింది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని రూ. 1.09 లక్షల ధర వద్ద విడుదల చేసింది. ఈ స్కూటర్ ఇప్పటికే పవర్ పుల్ స్కూటర్‌గా ఉంది, అయితే ఇది ఇప్పుడు మరింత అప్‌గ్రేడ్ చేసిన మోటరుతో రావడం వల్ల ఈ స్కూటర్ 72 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది

అప్పుడే అప్‌గ్రేడ్ మోటారుతో రానున్న Simple One ఎలక్ట్రిక్ స్కూటర్: ఇక కుర్రకారుకి పండగే

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు 4.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో 200 కిమీ కంటే ఎక్కువ రేంజ్‌ను అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 96% సామర్థ్యాన్ని సాధించగలదు. కావున వినియోగదారులు ఈ స్కూటర్ యొక్క రేంజ్ గురించి ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 200 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ అందించే దేశంలోనే మొట్టమొదటి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది అని కంపెనీ పేర్కొంది.

అప్పుడే అప్‌గ్రేడ్ మోటారుతో రానున్న Simple One ఎలక్ట్రిక్ స్కూటర్: ఇక కుర్రకారుకి పండగే

సింపుల్ ఎనర్జీ అందిస్తున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎకో మోడ్‌లో 236 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఛార్జర్ సింపుల్ లూప్ సహాయంతో, సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 60 సెకన్లలోనే 2.5 కిమీ పరిధికి సరిపడా ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

అప్పుడే అప్‌గ్రేడ్ మోటారుతో రానున్న Simple One ఎలక్ట్రిక్ స్కూటర్: ఇక కుర్రకారుకి పండగే

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లోని బ్యాటరీని నేరుగా 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేయడానికి 2.75 గంటల సమయం పడుతుందని, అయితే ఇందులోని తొలగించగల బ్యాటరీని విడిగా తీసి ఛార్జ్ చేయడానికి అదనంగా మరో 75 నిమిషాల సమయం పడుతుందని కంపెనీ తెలిపింది. ఈ సందర్భంలో, రెండు బ్యాటరీలను ఛార్జ్ చేయడానికి మొత్తంగా 4 గంటల సమయం పడుతుంది. ఇది ఇంటి వద్ద ఇండే ఏసి చార్జర్ సాయంతో చార్జ్ చేస్తే దాదాపు 2.75 గంటల్లో సుమారు 0 నుండి 80 శాతం వరకూ చార్జ్ చేసుకోవచ్చు.

అప్పుడే అప్‌గ్రేడ్ మోటారుతో రానున్న Simple One ఎలక్ట్రిక్ స్కూటర్: ఇక కుర్రకారుకి పండగే

సింపుల్ ఎనర్జీ రాబోయే నెలల్లో దేశవ్యాప్తంగా 300 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉంది. ఇది వినియోగదారులకు ఫాస్ట్ ఛార్జింగ్ ప్రయోజనాలను అందించనుంది. ఈ స్కూటర్ కేవలం 2.95 సెకన్లలోనే గంటకు 0 నుండి 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 4.8 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇందులోని బూడిద రంగు బ్యాటరీ ప్యాక్ 6 కిలోల కంటే ఎక్కువ బరువును కలిగి టుంది. ఈ బ్యాటరీ ప్యాక్ ప్రత్యేకంగా భారతీయ ఉపయోగం కోసం రూపొందించబడింది.

అప్పుడే అప్‌గ్రేడ్ మోటారుతో రానున్న Simple One ఎలక్ట్రిక్ స్కూటర్: ఇక కుర్రకారుకి పండగే

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ప్రధానంగా లభించే ఫీచర్లు మరియు టెక్నాలజీలను గమనిస్తే, ఇందులో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, నావిగేషన్ డిస్‌ప్లే, బ్లూటూత్, జియో ఫెన్సింగ్, 4G LTE, ఓటిఏ అప్‌డేట్స్, ఫాస్ట్ ఛార్జర్ గుర్తింపు, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్, కాల్స్ మరియు మ్యూజిక్ కంట్రోల్, వెహికల్ ట్రాకిం0గ్, డాక్యుమంట్ స్టోరేజ్, ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుకవైపు మోనో షాక్ సస్పెన్షన్ సెటప్, ముందు మరియు వెనుక 90 మిమీ డ్రమ్ బ్రేక్‌లు, 12 ఇంచ్ టైర్లు, 30 లీటర్ల బూట్ స్పేస్ మరియు 110 కిలోల బరువు మొదలైన వాటిని కలిగి ఉంటుంది.

అప్పుడే అప్‌గ్రేడ్ మోటారుతో రానున్న Simple One ఎలక్ట్రిక్ స్కూటర్: ఇక కుర్రకారుకి పండగే

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు 2022 జూన్ నుండి ప్రారంభం కానున్నాయి. ఇది తమిళనాడులోని హోసూర్‌లోని కంపెనీ ప్లాంట్‌లో తయారు చేయబడింది. దీని ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 10 లక్షల యూనిట్లు. కంపెనీ రెండవ ప్లాంట్, సింపుల్ ఎనర్జీ EVని కూడా ప్రారంభించబోతోంది.

అప్పుడే అప్‌గ్రేడ్ మోటారుతో రానున్న Simple One ఎలక్ట్రిక్ స్కూటర్: ఇక కుర్రకారుకి పండగే

సింపుల్ ఎనర్జీ రాష్ట్రంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని నిర్మించడానికి రూ. 2500 కోట్ల వరకు పెట్టుబడి కోసం తమిళనాడు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MOU) పై సంతకం చేసింది. ఫేజ్ 1లో భాగంగా హోసూరు సమీపంలో మొదటి 2 లక్షల చదరపు అడుగుల ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో ఈ కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్ నిర్మించబడుతుంది.

అప్పుడే అప్‌గ్రేడ్ మోటారుతో రానున్న Simple One ఎలక్ట్రిక్ స్కూటర్: ఇక కుర్రకారుకి పండగే

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ దాని ప్రారంభానికి ముందే అప్‌గ్రేడ్ చేయబడింది, కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మొదట పూర్తిగా సిద్ధం చేస్తోంది. ఇప్పుడు దీని ప్రొడక్షన్ మరియు డెలివరీ త్వరలో ప్రారంభం కావాలి. అయితే ఇప్పుడు కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్లో ఎలాంటి బుకింగ్స్ పొందుతుంది అనే విషయం కూడా త్వరలోనే తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 9, 2022, 21:17 [IST]
English summary
Simple one electric scooter gets motor upgrade details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+