దేశ రాజధానిలో ప్రారంభమైన సింపుల్ వన్ (Simple One) టెస్ట్ రైడ్స్.. ఇక డెలివరీలు ఎప్పుడంటే?
'సింపుల్ ఎనర్జీ' (Simple Energy) తన 'సింపుల్ వన్' (Simple One) ఎలక్ట్రిక్ స్కూటర్ ను 2021 ఆగష్టు నెలలో అధికారికంగా భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్కూటర్ మార్కెట్లో అడుగుపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా మంచి ఆదరణ పొందుతూ.. మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందుతోంది. అయితే ఇప్పుడు దేశ రాజధాని నగరం ఢిల్లీలో టెస్ట్ రైడ్స్ ప్రారంభించింది.
Recommended Video
దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో చూద్దాం.

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఇప్పుడు ఢిల్లీలో 'సింపుల్ వన్' ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెస్ట్ రైడ్స్ ప్రారంభమయ్యాయి. దీనిని కంపెనీ స్వయంగా తన సోషల్ మీడియా పేజీలో తెలిపింది. అయితే డెలివరీలు ఈ నెలలో (సెప్టెంబర్) ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఢిల్లీలో రూ. 1,09,999 (ఆన్-రోడ్). సింపుల్ ఎనర్జీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఇప్పటివరకు 55,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు సమాచారం. అంతే కాకుండా.. ఇది దేశీయ మార్కెట్లో విడుదలైన కేవలం మొదటి 5 రోజుల్లోనే 30,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను పొందింది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది దాని సెగ్మెంట్లో అత్యంత స్టైలిష్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. కావున ఇది అదిరిపోయే స్టైలిష్ లుక్‌తో పాటు, అత్యధిక రేంజ్ మరియు ఫీచర్లను కూడా అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.8 కిలోవాట్ పోర్టబుల్ లిథియం-అయాన్ బ్యాటరీని ఉపయోగిస్తుంది. దీని బరువు సుమారు 6 కేజీలు. ఇది రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంద, కావున సింపుల్ లూప్ ఛార్జర్‌తో ఈ స్కూటర్‌ను కేవలం 60 సెకన్లలో 2.5 కిలోమీటర్లు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫుల్ ఛార్జ్ తో ఏకంగా 236 కి.మీ (ఎకో మోడ్) రేంజ్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 3.6 సెకన్లలో గంటకు 0 నుంచి 50 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అదే సమయంలో ఇది 4.5 కిలోవాట్ పవర్ మరియు 72 enఎమ్ టార్క్ అందిస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 12-ఇంచెస్ అల్లాయ్ వీల్స్, 7-ఇంచెస్ డిజిటల్ డాష్‌బోర్డ్, ఆన్-బోర్డ్ నావిగేషన్, జియో-ఫెన్సింగ్, SOS సందేశాలు, డాక్యుమెంట్ స్టోరేజ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ పొందుతుంది.

సస్పెన్షన్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు మోనో షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. అదే సమయంలో ముందు మరియు వెనుక 90 మిమీ డ్రమ్ బ్రేక్‌లు అందుబాటులో ఉంటాయి. ఇందులో 30 లీటర్ల బూట్ స్పేస్ కూడా లభిస్తుంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తమ్ నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి రెడ్, వైట్, బ్లాక్ మరియు బ్లూ కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

ఇదిలా ఉండగా సింపుల్ ఎనర్జీ యొక్క సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ తమిళనాడులోని హోసూర్‌లోని కంపెనీ ప్లాంట్‌లో తయారు చేయబడింది. దీని ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 10 లక్షల యూనిట్లు. కంపెనీ రెండవ ప్లాంట్, సింపుల్ ఎనర్జీ EVని కూడా ప్రారంభించబోతోంది.

సింపుల్ ఎనర్జీ రాష్ట్రంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ ప్లాంట్ నిర్మించడానికి రూ. 2500 కోట్ల వరకు పెట్టుబడి కోసం తమిళనాడు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MOU) పై సంతకం చేసింది. ఫేజ్ 1లో భాగంగా శూలగిరి (హోసూరు) సమీపంలో మొదటి 2 లక్షల చదరపు అడుగుల ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
భారతీయ మార్కెట్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలకున్న ఆదరణ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయితే ఎన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లో విడుదలైనప్పటికీ ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లు మాత్రం ఎక్కువ సంఖ్యలో అందుబాటులో లేదు. కావున ఈ సందర్భంలో ఒక ఛార్జ్ తో 200 కిమీకి పైగా రేంజ్ అందించే ఈ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని ఆశిస్తున్నాము. అయితే ఇది మార్కెట్లో ఓలా ఎస్1 మరియు ఏథర్ 450ఎక్స్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








