భారత మార్కెట్లో Smartron Tbike OneX ఇ-బైక్ విడుదల: ధర, రేంజ్, ఫీచర్లు మరియు ఇతర వివరాలు
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ స్మార్ట్రాన్ ఇండియా (Smartron India) భారత మార్కెట్లో తమ సరికొత్త ఇ-బైక్ స్మార్ట్రాన్ టిబైక్ వన్ఎక్స్ (Smartron Tbike OneX) ను విడుదల చేసింది. కంపెనీ తమ రెండవ తరం ఇ-బైక్ ను మల్టీ మాడ్యులర్, మల్టీ పర్పస్ మరియు మల్టీ యుటిలిటీ వెహికల్ గా రూపొందించినట్లు పేర్కొంది. ఈ ఎకో ఫ్రెండ్లీ వాహనాన్ని ప్రధానంగా రైడ్‌షేర్ మార్కెట్ ని మరియు డెలివరీ స్టార్టప్ కంపెనీలను దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది.

దేశీయ విపణిలో స్మార్ట్రాన్ టిబైక్ వన్ఎక్స్ (Smartron Tbike OneX) ఇ-బైక్ ను రూ.38,000 ధరతో పరిచయం చేశారు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గరిష్టంగా గంటకు 25 kmph వేగాన్ని అందుకోగలదని మరియు బ్యాటరీ మార్పిడి అలాగే ఆన్-బోర్డ్ ఛార్జింగ్ ఎంపికలతో దాదాపు 100 కి.మీ కంటే ఎక్కువ రేంజ్‌ను అందజేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది Tbike యాప్ మరియు Tlockతో కలిసి, TronX ప్లాట్‌ఫారమ్ అనుకూలీకరించిన ఫ్లీట్ మరియు రైడర్ మేనేజ్‌మెంట్ ఫీచర్‌ల శ్రేణిని అందిస్తుంది.

కంపెనీ ప్రవేశపెట్టిన ఈ కొత్త రకం ఎలక్ట్రిక్ సైకిల్ రైడ్‌షేర్ మరియు డెలివరీ సర్వీస్ ప్రొవైడర్ల ప్రస్తుత IT సిస్టమ్‌లలో సులభంగా ఏకీకరణను అందించేందుకు కూడా ఈ యాప్ సహకరిస్తుంది. ఇది రిమోట్ వెహికల్ మానిటరింగ్ మరియు డయాగ్నస్టిక్స్ మరియు అసెట్ యుటిలైజేషన్, స్టేటస్, అసెట్ లొకేషన్, రిమోట్ లాక్/అన్‌లాక్, జియోఫెన్సింగ్ మరియు బ్యాటరీ మొదలైన రియల్ టైమ్ బిజినెస్ ఇంటెలిజెన్స్‌ను అందిస్తుంది.

స్మార్ట్రాన్ టిబైక్ వన్ఎక్స్ (Smartron Tbike OneX) ఎలక్ట్రిక్ సైకిల్ విడుదల సందర్భంగా స్మార్ట్‌రాన్ ఇండియా (Smartron India) వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు మహేష్ లింగారెడ్డి మాట్లాడుతూ.. "మా రెండవ తరం బహుళ-ప్రయోజన (మల్టీ పర్సప్) ఇ-బైక్ అయిన టి బైక్ వన్ఎక్స్ యొక్క ప్రారంభాన్ని ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము. ఇది Tbike One మరియు One Pro మోడళ్ల మాదిరిగా అవార్డ్ విన్నింగ్ డిజైన్ శైలిని కలిగి ఉంటుంది" అని చెప్పారు.

కొత్త స్మార్ట్రాన్ టిబైక్ వన్ఎక్స్ రైడ్‌షేర్ మార్కెట్ కోసం రూపొందించబడినప్పటికీ, జీవనశైలి, పర్యాటకం, ఇ-కామర్స్, ఇ-ఫార్మసీలు, ఇ-కిరాణా మొదలైన వాటి కోసం కూడా దీనిని ఉపయోగించాలని తాము భావిస్తున్నామని, అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ను కేవలం భారత మార్కెట్ కు మాత్రమే పరిమితం చేయకుండా అనేక ఇతర దేశాలకు కూడా దీనిని ఎగుమతి చేయడం ప్రారంభించామని, ప్రస్తుతం ఆఫ్రికా, యూకే/ఐర్లాండ్, భూటాన్ మరియు మెక్సికోలో దీనిని విక్రయిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Smartron యొక్క EV విభాగం అయిన Tronx మోటార్స్ MD, అనూప్ నిశాంత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, "భారతదేశంలో రూపొందించబడింది మరియు స్మార్ట్రాన్ ట్రాన్ఎక్స్ ద్వారా ఆధారితమైన కొత్త టిబైక్ వన్ఎక్స్ (Tbike OneX) భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉన్న బైక్. ఇది వివిధ రకాల కార్గో అవసారలను పూర్తి చేసే డిజైన్ యొక్క సెన్సిబిలిటీతో అప్రయత్నమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది" ఇని చెప్పారు.

OneX అంటే స్మార్ట్‌రాన్ యొక్క TCare ప్లాట్‌ఫారమ్ ద్వారా ఉత్తమమైన ఆఫ్టర్ సేల్స్ పార్ట్స్ మరియు సర్వీస్ లను కలిగి ఉండే ఇ-ఎక్స్‌పీరియెన్స్ అని అర్థమని, తాము Tbike OneX ని అన్ని చిన్న మరియు సూక్ష్మ వ్యాపారాలకు అందుబాటులో ఉండేలా చేయడానికి కొన్ని ఫైనాన్స్ కంపెనీలతో కలిసి పని చేస్తున్నామని ఆయన తెలిపారు. టిబైక్ వన్ఎక్స్ విడుదలతో కంపెనీ ఇప్పుడు మొత్తం ఐదు టిబైక్ ఎలక్ట్రిక్ సైకిల్ మోడల్ లను కలిగి ఉంది.

స్మార్ట్రాన్ అందిస్తున్న ఎలక్ట్రిక్ సైకిళ్లు విస్తృత శ్రేణి మొబిలిటీ అప్లికేషన్‌లను కవర్ చేస్తాయని, ప్రత్యేకించి టిబైక్ వన్ఎక్స్ విషయానికి వస్తే, ఇది భారతదేశంలో కంపెనీ యొక్క డిజైన్ మరియు ఇంజనీరింగ్ తత్వశాస్త్రాన్ని కొనసాగిస్తూ, పూర్తిగా భారతదేశంలో రూపొందించబడింది మరియు ఇంజనీరింగ్ చేయబడిన ఉత్పత్తి అని అనూప్ చెప్పారు.

కొత్త Smartron Tbike OneX ఇ-బైక్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ కావడంతో చైనా మరియు ఇతర దేశాల నుండి ఇ-బైక్‌లను దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న కంపెనీలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సరఫరా గొలుసు మరియు లాజిస్టిక్స్ సవాళ్లను ఇది తొలగిస్తుంది. ఈ కొత్త టిబైక్ వన్ఎక్స్ అనేది B2B విభాగంలో మెగ్నీషియం అల్లాయ్ వీల్స్, పంక్చర్ ప్రూఫ్ టైర్లు మరియు ఫ్రేమ్‌పై జీవితకాల వారంటీతో వచ్చిన మొదటి బహుళ ప్రయోజన ఇ-బైక్ గా ఉంటుంది.

భారత మార్కెట్లో Joy e-Bike విడుదల..
ఇదిలా ఉంటే, భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లోకి తాజాగా మరొక కొత్త కంపెనీ ప్రవేశించింది. వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ లిమిటెడ్ అనే కంపెనీ ఇప్పుడు మార్కెట్లో రెండు కొత్త 'మేడ్-ఇన్-ఇండియా' హై-స్పీడ్ స్కూటర్‌లను విడుదల చేసింది. వీటి పేర్లు వోల్ఫ్+ (Wolf+) మరియు నాను+ (Nanu+). ఇవి రెండూ కాకుండా కంపెనీ డెల్ గో (Del Go) అనే ఓ ఫ్లీట్ మేనేజ్‌మెంట్ స్కూటర్ ను కూడా మార్కెట్లో విడుదల చేసింది. ఇది ప్రత్యేకించి వ్యాపారాలను లక్ష్యంగా చేసుకొని ప్రవేశపెట్టబడింది. - వీటి ధరలు మరియు ఇతర వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








