ఓలా స్కూటర్ రేంజ్ 180 కిమీ అన్నారు, కానీ 44 కిమీకే ఆగిపోయింది.. అందుకే పెట్రోల్ పోసి నిప్పంటించాడు..!

ఓలా ఎలక్ట్రిక్, ఇప్పుడు ఎక్కడా చూసిన ఇదే పేరు వినిపిస్తోంది. అనతికాలంలోనే భారతదేశపు ద్వితీయ అగ్రగామి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీగా అవతరించిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) పేరు ఇటీవలి కాలంలో దేశంలో మారు మ్రోగిపోతోంది. ఓలా అందిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల కొందరు మంచిగా చెబుతుంటే, మరికొందరు చెడుగా చెబుతున్నారు. అయితే, మంచికన్నా వేగంగా చెడు వ్యాపిస్తుందన్న సంగతి మనందరికీ తెలిసినదే. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయంలో కూడా ఇదే జరుగుతోంది.

ఓలా స్కూటర్ రేంజ్ 180 కిమీ అన్నారు, కానీ 44 కిమీకే ఆగిపోయింది.. అందుకే పెట్రోల్ పోసి నిప్పంటించాడు..!

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల యజమానులు మరియు నెటిజెన్లు సోషల్ మీడియా వేదికగా ఈ బ్రాండ్‌పై తమ అసహనాన్ని మరియు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొందరి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యజమానుల ప్రయాణం హాయిగా, సాఫీగా సాగిపోతుంటే, మరికొందరి యజమానుల ప్రయాణం మాత్రం అడుగడునా అవాంతరాలను ఎదుర్కుంటోంది. తాజాగా, తమిళనాడులో ఓ వ్యక్తి తన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విషయంలో అసంతృప్తికి గురై, నడిరోడ్డుపైనే ఆ స్కూటర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

ఓలా స్కూటర్ రేంజ్ 180 కిమీ అన్నారు, కానీ 44 కిమీకే ఆగిపోయింది.. అందుకే పెట్రోల్ పోసి నిప్పంటించాడు..!

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని ఆంబూర్‌కు చెందిన పృథ్వీరాజ్ ఓ ఫిజియోథెరపిస్ట్‌ గత మూడు నెలలుగా ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro) టాప్-ఎండ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఉపయోగిస్తున్నాడు. అయితే, తాను స్కూటర్ కొనుగోలు చేసిన మొదటి రోజు నుండే అందులో సమస్యలు ఉన్నాయని, ఈ విషయం గురించి ఓలా కంపెనీతో మొర పెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందని వాపోయాడు. పృథ్వీరాజ్ ఈ వాహనం రిజిస్ట్రేషన్ మొదలుకొని దాని రేంజ్ వరకూ అనేక సమస్యలను ఎదుర్కున్నట్లు సమాచారం.

ఓలా స్కూటర్ రేంజ్ 180 కిమీ అన్నారు, కానీ 44 కిమీకే ఆగిపోయింది.. అందుకే పెట్రోల్ పోసి నిప్పంటించాడు..!

వాస్తవానికి ఓలా ఎస్1-ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ స్టాండర్డ్ టెస్టింగ్ కండిషన్స్ ప్రకారం, పూర్తి చార్జ్‌పై 181 కిమీ రేంజ్ ఇస్తుందని సర్టిఫై చేయబడింది. అయితే, తాను ఈ స్కూటర్‌ను నడుపుతుండగా, కేవలం 44 కిమీ నడిరోడ్డుపై ఆగిపోయింది. దీంతో చిర్రెత్తిన యజమాని ఆంబూర్ హైవే రోడ్‌ పక్కనే ఆగిపోయిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి తన నిరసను వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఈ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ ప్రముఖ తమిళ న్యూస్ ఛానెల్ కూడా ఈ కథనాన్ని ప్రసారం చేసింది.

వీడియో మూలం: SunNews

ఈ వీడియోలో రిపోర్టర్ పేర్కొన్న వివరాల ప్రకారం, పృథ్వీరాజ్ కొనుగోలు చేసిన ఓలా ఎస్1ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను గుడియాతం ఆర్డీఓ వద్ద రిజిస్టర్ చేసుకునేందుకు తీసుకెళ్లాడు. అయితే, అది తమ పరిధిలోకి రాదని, దానిని అంబూర్‌లో రిజిస్టర్ చేసుకోవాలని ఆర్టీఓ అధికారులు అతడ్ని వెనక్కి పంపేశారు. అసలే స్కూటర్లోని వివిధ సమస్యలతో గందరగోళంలో ఉన్న పృథ్వీరాజ్‌కు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత గందరగోళానికి గురి చేసింది. ఇలాంటి పరిస్థితిలో అతను తన ఎలక్ట్రిక్ స్కూటర్‌పై అంబూరు వైపు వస్తుండగా అకస్మాత్తుగా ఎలక్ట్రిక్ స్కూటర్ సగంలోనే ఆగిపోయింది.

ఓలా స్కూటర్ రేంజ్ 180 కిమీ అన్నారు, కానీ 44 కిమీకే ఆగిపోయింది.. అందుకే పెట్రోల్ పోసి నిప్పంటించాడు..!

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విషయంలో వరుస సమస్యలతో చిరాకు చెందిన పృథ్వీరాజ్ రోడ్డు పక్కనే ఆగిపోయిన ఎలక్ట్రిక్ స్కూటర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా దగ్ధమైపోయింది. పృథ్వీరాజ్ మాత్రమే కాదు దేశంలో చాలా మంది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై వివిధ రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అంతకు ముందు మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి తన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విషయంలో చేసిన ఫిర్యాదులను కంపెనీ పట్టించుకోకపోవడంతో దానిని గాడిదకు కట్టేసి ఊరేగించాడు.

ఓలా స్కూటర్ రేంజ్ 180 కిమీ అన్నారు, కానీ 44 కిమీకే ఆగిపోయింది.. అందుకే పెట్రోల్ పోసి నిప్పంటించాడు..!

భారతదేశంలో ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు ఎలాంటి ప్రత్యక్ష డీలర్‌షిప్ కేంద్రాలు లేవు. కస్టమర్లు నేరుగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయటం, వాటిలో ఏదైనా సమస్య వస్తే ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేయడం జరుగుతుంది. కాబట్టి, ఈ సమస్యలను పరిష్కరించేందుకు కంపెనీకి కూడా పెద్ద తలనొప్పిగా మారింది. ఆన్‌లైన్‌లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొన్న కస్టమర్లు ఇచ్చిన చిరునామా వద్ద కంపెనీ వాటిని డెలివరీ చేస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల సర్వీస్ కోసం కంపెనీ నేరుగా కస్టమర్ ఇంటికే వెళ్లి సేవలు అందిస్తుంది. ఈ ప్రక్రియలో మరింత పారదర్శకత అవసరం అని యజమానులు చెబుతున్నారు.

ఓలా స్కూటర్ రేంజ్ 180 కిమీ అన్నారు, కానీ 44 కిమీకే ఆగిపోయింది.. అందుకే పెట్రోల్ పోసి నిప్పంటించాడు..!

1441 ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు రీకాల్

ఇదిలా ఉంటే, ఇటీవల పూణేలో ఒక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మంటల్లో కాలిపోవడంతో కంపెనీ అలెర్ట్ అయింది. ఈ ప్రమాదానికి గల కారణాలను అన్వేషించేందుకు కంపెనీ 1,441 యూనిట్ల ఎస్1 ప్రో మోడళ్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రీకాల్‌కు వర్తించే ఎలక్ట్రిక్ స్కూటర్‌లను కంపెనీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంది. ఇందుకోసం కంపెనీ తమ కస్టమర్లను గుర్తించి, వారిని ప్రత్యేకంగా సంప్రదించనుంది. పూనేలో జరిగిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అగ్నిప్రమాదంపై కంపెనీ దర్యాప్తు చేస్తోంది.

ఓలా స్కూటర్ రేంజ్ 180 కిమీ అన్నారు, కానీ 44 కిమీకే ఆగిపోయింది.. అందుకే పెట్రోల్ పోసి నిప్పంటించాడు..!

ఓలా ఎస్1 (Ola S1) డీటేల్స్

భారత మార్కెట్లో ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఇవి రెండూ ఒకే రకమైన 8.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటాయి. అయితే, వీటి బ్యాటరీ ప్యాక్ మాత్రం వేర్వేరుగా ఉంటుంది. ఓలా ఎస్1లో 2.98 కిలో వాట్ అవర్‌ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది పూర్తి చార్జ్ పై 121 కిమీ సర్టిఫైడ్ రేంజ్‌ను అందిస్తుంది. దీని గరిష్టం వేగం గంటకు 90 కిమీగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

ఓలా స్కూటర్ రేంజ్ 180 కిమీ అన్నారు, కానీ 44 కిమీకే ఆగిపోయింది.. అందుకే పెట్రోల్ పోసి నిప్పంటించాడు..!

ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro) డీటేల్స్

ఇక ఓలా ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది 3.97 కిలో వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఈ మోడల్ పూర్తి చార్జ్ పై 181 కిమీ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. దీని గరిష్ట వేగం గంటకు 115 కిమీగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను 750 వాట్ ఆన్‌బోర్డ్ ఛార్జర్‌తో పూర్తిగా చార్జ్ చేయటానికి సుమారు 7 గంటల సమయం పడుతుంది. అదే ఫాస్ట్ చార్జర్ సాయంతో అయితే, కేవలం 1 గంట కన్నా తక్కువ వ్యవధిలోనే పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Wednesday, April 27, 2022, 15:42 [IST]
English summary
Tamil nadu man sets ola s1 pro on fire after facing repeated issues with it
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+