Ola S1 Air కొనాలనుకునే వారి కోసం ప్రత్యేక కథనం.. తప్పక చూడండి

ముందుగా పాఠకులందరికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ తరపున దీపావళి శుభాకాంక్షలు. భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) ఇటీవలే అతి తక్కువ ధర వద్ద ఒక కొత్త లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ అందిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధర చాలా తక్కువ. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునేవారికోసం ఈ కథనంలో తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలు ఏమున్నాయి అనే దాని గురించి వివరంగా ఓ సారి చూసేద్దాం..

Ola S1 Air కొనాలనుకునే వారి కోసం ప్రత్యేక కథనం.. తప్పక చూడండి

ధర & బుకింగ్స్:

మొదట మనం ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన 'ఓలా ఎస్1 ఎయిర్' యొక్క ధరలను తప్పకుండా తెలుసుకోవాలి, ఎందుకంటే మనం ఇప్పటికే చెప్పుకున్నట్లు కంపెనీ విభాగంలో అతి తక్కువ ధరకు లభించే స్కూటర్. దీని ధర రూ. 79,999 మాత్రమే. ఈ ధర వద్ద ఓలా ఎస్1 ఎయిర్ కేవలం ఈ రోజు (24 అక్టోబర్) వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 84,499 కి చేరుకుంటుంది.

Ola S1 Air కొనాలనుకునే వారి కోసం ప్రత్యేక కథనం.. తప్పక చూడండి

'ఓలా ఎస్1 ఎయిర్' స్కూటర్ కొనాలనుకునే కస్టమర్లు 24 అక్టోబర్ 2022 లోపల బుక్ చేసుకోవాలి. బుకింగ్ ధర రూ. 999 మాత్రమే. కావున కొనుగోలుదారులు కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2023 ఏప్రిల్ నెలలో జరిగే అవకాశం ఉంది.

Ola S1 Air కొనాలనుకునే వారి కోసం ప్రత్యేక కథనం.. తప్పక చూడండి

ఎలక్ట్రిక్ మోటార్:

'ఓలా ఎస్1 ఎయిర్' ఎలక్ట్రిక్ స్కూటర్ 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ మరియు 4.5 కిలోవాట్ హబ్-మౌంటెడ్ మోటారును పొందుతుంది. కావున ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 101 కిలోమీటర్ల (ఎకో మోడ్) పరిధిని అందిస్తుంది. అదే సమయంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లవరకు ఉంటుంది.

Ola S1 Air కొనాలనుకునే వారి కోసం ప్రత్యేక కథనం.. తప్పక చూడండి

ఛార్జింగ్:

ఛార్జింగ్ విషయానికి వస్తే 'ఎస్1 ఎయిర్‌' ఎలక్ట్రిక్ స్కూటర్ 500W పోర్టబుల్ హోమ్ ఛార్జర్‌ని ఉపయోగించి 0 నుంచి 100 శాతం ఛార్జ్ కావడానికి 4:30 గంటల సమయం పడుతుంది. కావున ఇది ఛార్జింగ్ విషయంలో కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Ola S1 Air కొనాలనుకునే వారి కోసం ప్రత్యేక కథనం.. తప్పక చూడండి

ఫీచర్స్:

'ఓలా ఎస్1 ఎయిర్' ఎలక్ట్రిక్ స్కూటర్ లో పెద్ద 7 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉంటుంది. దీని ద్వారా రైడర్ డ్రైవ్ మోడ్‌లు, ప్రొఫైల్, కాలింగ్ ఫంక్షన్, నావిగేషన్, పార్టీ మోడ్, వెకేషన్ మోడ్ మరియు వివిధ ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు. అయితే ఓలా ఎస్1ప్రో కంటే కూడా ఇందులో కొంత తక్కువ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.

Ola S1 Air కొనాలనుకునే వారి కోసం ప్రత్యేక కథనం.. తప్పక చూడండి

ఇతర వివరాలు:

ఓలా S1 ఎయిర్ స్కూటర్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ మరియు ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్‌లను కలిగి ఉండటమే కాకుండా రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బరువు కేవలం 99 కేజీల వరకు ఉంటుంది, కావున ఇది దాని 'ఎస్1 ప్రో' (125కేజీలు) కంటే కూడా తేలికగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇందులోని సీటు రీడిజైన్ చేయబడింది. కావున ఇది సింగిల్-పీస్ ట్యూబ్యులర్ గ్రాబ్ హ్యాండిల్‌ కలిగి ఉంటుంది. కాగా ఇందులో 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. అయితే ఇది ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్‌ను పొందుతుంది.

Ola S1 Air కొనాలనుకునే వారి కోసం ప్రత్యేక కథనం.. తప్పక చూడండి

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఓలా ఎలక్ట్రిక్ దీపావళి పండుగను పురస్కరించుకుని తక్కువ ధరకే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. అయితే ఈ స్కూటర్ ఎలాంటి అమ్మకాలను పొందుతుందో తెలియరావాలి. కాగా రేపటి నుంచి ఈ ఈలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 84,999 కానుంది. కావున ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ రోజే బుక్ చేసుకుంటే రూ. 79,999 కె సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, October 24, 2022, 7:31 [IST]
English summary
Top five things about the new ola s1 air details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+