ట్రైయంప్ టిఈ1 (Triumph TE1) ఎలక్ట్రిక్ బైక్ వివరాలు వెల్లడి.. పూర్తి చార్జ్ పై 160 కిమీ రేంజ్!
ప్రపంచ మొత్తం ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో, అనేక ఆటోమొబైల్ తయారీదారులు తమ ప్రోడక్ట్ ఫోలియోలో కనీసం ఒక ఎలక్ట్రిక్ వాహనాన్నైనా అందించాలని చూస్తున్నాయి. తాజాగా, బ్రిటీష్ లగ్జరీ టూవీలర్ కంపెనీ ట్రైయంప్ మోటార్‌సైకిల్స్ (Triumph Motorcycles) కూడా తమ మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ బైక్ టిఈ-1 (TE-1)ని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, కంపెనీ ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ టూవీలర్ కి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడి చేసింది.

ట్రైయంప్ టిఈ-1 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ప్రోటోటైప్ 15 కిలోల మోటార్/ఇన్వర్టర్ అసెంబ్లీని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ ను పూర్తిగా చార్జ్ చేస్తే ట్రైయంప్ టిఈ-1 గరిష్టంగా 160 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కేవలం 3.6 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

ఈ ఆల్-ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 175 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుందని ట్రైయంప్ తెలిపింది. ఇది జీరో ఎస్ఆర్/ఎఫ్ స్ట్రీట్ ఫైటర్ మరియు హార్లే-డేవిడ్‌సన్ యొక్క లైవ్ వైర్ వన్ మోడళ్లకంటే కూడా ట్రైయంప్ టిఈ-1 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 25 శాతం తేలికైనదని కంపెనీ పేర్కొంది. ఈ బరువు బ్యాలెన్స్ చేయడం కోసం అల్యూమినియంతో చేసిన ఫ్రేమ్ ను ఉపయోగించారు.

ట్రైయంప్ టిఈ-1 ఇ-బైక్ మొత్తం బరువు 220 కిలోలుగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ను ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం 25 నిమిషాల్లోనే 0 నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంత వేగవంతమైన ఛార్జింగ్ స్పీడ్ ఉన్న మోడల్ ప్రస్తుతం మార్కెట్లో మరొకటి లేదనే చెప్పాలి. ఈ ప్రోటోటైప్ అభివృద్ధిలో ఉన్న ప్రాజెక్ట్ కావడంతో కంపెనీ ఈ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ను ఇంకా అధికారికంగా క్లెయిమ్ చేయడం లేదు. అయితే, ఈ ఫీచర్ రియల్ టైమ్ లో కూడా అందుబాటులోకి వచ్చినట్లయితే, బ్యాటరీ ఛార్జింగ్ సమయం గణనీయంగా ఆదా అవుతుంది.

డిజైన్ వివరాలను పరిశీలిస్తే, ట్రైయంప్ టిఈ-1 ఎలక్ట్రిక్ బైక్ ఓవరాల్ డిజైన్ లేఅవుట్ ఈ బ్రాండ్ నుండి లభిస్తున్న స్ట్రీట్/స్పీడ్ ట్రిపుల్ లైనప్‌ను గుర్తు చేస్తుంది. ఇందులో ముందు వైపు సిగ్నేచర్ ట్విన్-పాడ్ హెడ్‌ల్యాంప్‌లు, యాంగ్యులర్ ట్యాంక్ ఎక్స్‌టెన్షన్‌లు మరియు స్వెప్టెబ్యాక్ సీట్ మొదలైన డిజైన్ ఎలిమెంట్స్ ఈ బ్రాండ్ యొక్క స్పోర్టీ రోడ్‌స్టర్ బైక్ ల నుండి స్పూర్తి పొందినట్లుగా అనిపిస్తాయి.

ట్రైయంప్ టిఈ-1 బరువు దాదాపు 220 కిలోలుగా ఉంటుంది. సాధారణంగా, పెట్రోల్ వాహనాలలో అయితే ఇంతటి భారీ బరువు ఉన్న మోటార్‌సైకిల్ కు అనుమతి లభించదు. కానీ టిఈ-1 ఎలక్ట్రిక్ బైక్ కాబట్టి, ఇందులో బరువుకు పరిమితి ఉండదు. ఈ బైక్ డిజైన్ ట్రైయంప్ యొక్క ప్రస్తుత లైనప్ నుండి తీసుకోబడినప్పటికీ, ఈ ప్రోటోటైప్‌లోని బెల్ట్ ఫైనల్ డ్రైవ్ మాత్రం ఖచ్చితంగా ట్రైయంప్ మోడళ్ల నుండి మాత్రం తీసుకోబడలేదు. ట్రైయంప్ మోటార్‌సైకిళ్లన్నీ దాదాపుగా చైన్ డ్రైవ్ తోనే లభిస్తాయి.

టిఈ-1 ప్రోటోటైప్‌లో గేట్స్ కార్బన్ బెల్ట్ డ్రైవ్, ఓహ్లిన్స్ అప్-సైడ్ డౌన్ ఫోర్కులు (USD కార్ట్రిడ్జ్ ఫోర్క్స్), బ్రెంబో ఎమ్50 మోనోబ్లాక్ కాలిపర్‌లు మరియు ట్రైయంప్ మోటార్‌సైకిల్ కంట్రోల్ సాఫ్ట్‌వేర్ మొదలైనవి ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రోటోటైప్ కోసం ట్రైయంప్ విలియమ్స్ అడ్వాన్స్‌డ్ ఇంజినీరింగ్, ఇంటిగ్రల్ పవర్‌ట్రెయిన్ లిమిటెడ్ మరియు వార్విక్ యూనివర్శిటీ యొక్క WMG వంటి అతిపెద్ద బ్రాండ్‌లతో భాగస్వామిగా ఉంది.

విలియమ్స్ అడ్వాన్స్‌డ్ ఇంజనీరింగ్ (WAE) సహకారంతో TE-1 ప్రాజెక్ట్‌లో భాగంగా ట్రైయంప్ బ్యాటరీ మరియు ఛార్జింగ్ టెక్నాలజీలను అభివృద్ధి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రీజనరేటివ్ బ్రేకింగ్‌తో కూడా అమర్చబడిందని చెప్పబడింది. ఫలితంగా, ఇది బ్రేక్ వేసిన ప్రతిసారి బ్యాటరీ చార్జ్ అవుతుంది. మెరుగైన సామర్థ్యం కోసం మోటార్-జనరేటర్ యూనిట్ మరియు ట్రాన్స్‌మిషన్‌లో మరింత ఆప్టిమైజేషన్ కూడా చేయవచ్చు.

ట్రైయంప్ భవిష్యత్తులో ఈ ఎలక్ట్రిక్ బైక్ రేంజ్ ను మరింత పెంచే అవకాశం ఉంది. అయితే, కంపెనీ మాత్రం ఈ బైక్ ఉత్పత్తిని అధికారికంగా ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం, ఈ ఎలక్ట్రిక్ బైక్ 4వ దశ టెస్టింగ్ లో ఉంది. పనితీరు, కోర్ మరియు డైనమిక్ రైడర్ మూల్యాంకనాల కోసం వచ్చే ఆరు నెలల పాటు ఈ బైక్ పూర్తిగా రోడ్ మరియు ట్రాక్ పై లైవ్ టెస్ట్ చేయబడుతుందని కంపెనీ తెలిపింది.

భారత మార్కెట్లో ట్రైయంప్ టైగర్ 1200 విడుదల
ఇదిలా ఉంటే, ట్రైయంప్ (Triumph) ఇటీవలే భారత మార్కెట్లో తమ సరికొత్త అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్ 'ట్రైయంప్ టైగర్ 1200' (Triumph Tiger 1200) విడుదల చేసింది. దేశీయ విపణిలో ట్రైయంప్ టైగర్ 1200 మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వీటిలో జిటి ప్రో, ఎక్స్‌ప్లోరర్, ర్యాలీ ప్రో మరియు ర్యాలీ ఎక్స్‌ప్లోరర్ వేరియంట్లు ఉన్నాయి. మార్కెట్లో వీటి ధరలు రూ. 19.19 లక్షల నుండి రూ. 21.69 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) లో ఉన్నాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








