మార్కెట్లో యమహా ఆర్15ఎమ్ వరల్డ్ జిపి 60వ వార్షికోత్సవ ఎడిషన్ విడుదల: ధర రూ.1.88 లక్షలు!
జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా (Yamaha), భారత మార్కెట్లో మరో కొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. యమహా ఆర్15ఎమ్ వరల్డ్ జిపి 60వ వార్షికోత్సవ ఎడిషన్ (Yamaha R15M World GP 60th Anniversary Edition)ను కంపెనీ విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ యమహా బైక్ ధర రూ. 1,88,300 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా నిర్ణయించబడింది. కంపెనీ ఈ ఆర్15ఎమ్ వరల్డ్ జిపి 60వ వార్షికోత్సవ ఎడిషన్‌ను తమ పాపులర్ స్టాండర్డ్ యమహా ఆర్15 (Yamaha R15) బైక్‌ను ఆధారంగా చేసుకొని డిజైన్ చేసింది.

కొత్త తరం యమహా ఆర్15 వెర్షన్ 4.0 (Yamaha R15 V4) మోడల్‌ను కంపెనీ గతేడాది సెప్టెంబర్ నెలలో మార్కెట్లో విడుదల చేసింది మరియు దేశీయ విపణిలో ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 1.68 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. ఈ మోడల్‌ను ఆధారంగా చేసుకొనే యమహా ఇప్పుడు ఈ 60వ వార్షికోత్సవ వరల్డ్ జిపి యమహా ఆర్15ఎమ్ బైక్ ను తయారు చేసింది. స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే, ఈ స్పెషల్ ఎడిషన్ కాస్తంత విభిన్నమైన ఫ్రంట్ డిజైన్ మరియు ప్రత్యేకమైన బాడీ గ్రాఫిక్స్‌ను కలిగి ఉంటుంది.

కొత్త Yamaha R15M వరల్డ్ జిపి 60వ వార్షికోత్సవ ఎడిషన్ విడుదల ద్వారా ఈ బ్రాండ్ 1961 నుండి ప్రీమియర్ మోటార్‌సైకిల్ రోడ్ రేసింగ్ సిరీస్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని జరుపుకుంటుంది. ఈ కొత్త యానివర్సరీ ఎడిషన్ ఆర్15ఎమ్ అనేది యమహా యొక్క మొట్టమొదటి గ్రాండ్ ప్రి రేసుతో పాటు ముందుకు సాగుతున్న సవాళ్లను స్వీకరించడానికి కంపెనీ నిబద్ధతతో పాటుగా రిమైండర్‌గా నిలుస్తుందని కంపెనీ పేర్కొంది. కంపెనీ దీనిని వైట్ అండ్ రెడ్ 'స్పీడ్ బ్లాక్' కలర్ స్కీమ్‌లో పరిచయం చేసింది, ఇందులో గోల్డెన్ కలర్ అల్లాయ్ వీల్స్ ను కూడా ఉపయోగించారు.

ఇందులో చేసిన ఇతర మార్పుల విషయానికి వస్తే, ఇది యమహా ఫ్యాక్టరీ రేస్-బైక్ గోల్డ్ 'ట్యూనింగ్ ఫోర్క్' చిహ్నాలు, బ్లాక్ లివర్లు మరియు ఫ్యూయల్ ట్యాంక్‌పై ప్రత్యేక స్మారక బ్యాడ్జింగ్ లను కలిగి ఉంటుంది. ఈ మార్పులు మినహా స్టాండర్డ్ ఆర్15 కి మరియు ఈ స్పెషల్ ఎడిషన్ ఆర్15ఎమ్‌కి వేరే తేడాలు ఏమీ లేవు. ఈ స్పెషల్ ఎడిషన్ బైక్ యమహాకు రేసింగ్ పట్ల ఉన్న అభిరుచికి నివాళులు అర్పిస్తుందని మరియు గత 60 సంవత్సరాలుగా దాని రైడర్స్ యొక్క సవాలు స్ఫూర్తిని గౌరవిస్తుందని కంపెనీ తెలిపింది.

ఇంజన్ పరంగా కూడా ఈ స్పెషల్ ఎడిషన్ లో కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. స్టాండర్డ్ యమహా ఆర్15 మోడల్ లో ఉపయోగించిన అదే 155 సిసి, 4-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్, ఎస్ఓహెచ్‌సి, 4-వాల్వ్ ఇంజన్ నే ఈ కొత్త బైక్ లోనూ ఉపయోగించారు. ఈ ఇంజన్ 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 18.1 బిహెచ్‌పి శక్తిని మరియు 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 14.2 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియబుల్ వాల్వ్ యాక్చువేటెడ్ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది మరియు ఇది క్లచ్‌లెస్ అప్‌షిఫ్ట్‌ల కోసం క్విక్ షిఫ్టర్‌తో స్టాండర్డ్‌గా అమర్చబడి ఉంటుంది.

యమహా ఆర్15ఎమ్ వరల్డ్ జిపి 60వ వార్షికోత్సవ ఎడిషన్‌లోని ఇతర స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్‌లో భాగంగా, ట్రాక్షన్ కంట్రోల్, గోల్డ్ పెయింట్ స్కీమ్ లో ఫినిష్ చేయబడిన అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్కులు, గేర్ షిఫ్ట్ ఇండికేటర్ మరియు రైడింగ్ మోడ్‌ల కోసం రీడౌట్‌లతో కూడిన ఆర్1 ప్రేరేపిత ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇతర స్టాండర్డ్ ఫీచర్లలో అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్, డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ మరియు 3-దశల విస్తరణ చాంబర్‌తో కూడిన మఫ్లర్ (సైలెన్సర్) లు ఉన్నాయి.

"WGP యొక్క 60వ వార్షికోత్సవంలో భాగంగా విడుదలైన కొత్త Yamaha YZF-R15M కేవలం తమ రేసింగ్ వారసత్వాన్ని గుర్తు చేయడమే కాకుండా, ఇది 1961 నుండి యమహా సాధించిన 500 కంటే ఎక్కువ ప్రపంచ గ్రాండ్ ప్రి విజయాలను ప్రదర్శించే మైలురాయి అని" యమహా మోటార్ ఇండియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఈషిన్ చిహానా అన్నారు. భవిష్యత్తులో భారతదేశంలో 'ది కాల్ ఆఫ్ ది బ్లూ' వ్యూహం కింద, తాము ప్రీమియం టూవీలర్ సెగ్మెంట్‌లో ఇలాంటి మరిన్ని ప్రత్యేక మోటార్‌సైకిళ్లను పరిచయం చేస్తామని ఆయన చెప్పారు.
కొత్త యమహా ఎమ్‌టి-15 (2022 Yamaha MT-15) ఫేస్‌లిఫ్ట్ లాంచ్
ఇదిలా ఉంటే, యమహా తాజాగా భారత మార్కెట్లో తమ కొత్త 2022 మోడల్ ఎమ్‌టి-15 బైక్‌ను కూడా విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఈ కొత్త 2022 యమహా ఎమ్‌టి-15 (2022 Yamaha MT-15) బైక్ ధర రూ. 1,59,500 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది. ఈ కొత్త మోడల్‌లో కంపెనీ కొన్ని ముఖ్యమైన డిజైన్ అప్‌డేట్‌లు మరియు మెకానికల్ అప్‌గ్రేడ్స్ చేసింది. ఇప్పుడు ఇది ఈ బ్రాండ్ యొక్క MT సిరీస్ బైక్‌ల నుండి ప్రేరణ పొందిన కొత్త కలర్ ఆప్షన్లు మరియు బాడీ గ్రాఫిక్స్‌తో లభిస్తుంది. - దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications