ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై దీపావళి ధమాకా ఆఫర్లు.. రూ. 10,000 భారీ తగ్గింపుతో పాటు, వారంటీ, ఎక్స్‌ఛేంజ్ డీల్స్
అతి పెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్.. భారత్ EV ఫెస్ట్‌లో భాగంగా నేటి(నవంబర్ 9) నుంచి అద్భుతమైన దీపావళి ఆఫర్లను ప్రకటించింది. ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో పాటు అదిరిపోయే ఓలా తన S1 లైనప్‌లోని స్కూటర్లను ఈ దీపావళి సందర్భంగా విక్రయించనుంది. మరి ఏయే స్కూటర్లపై ఏయే ఆఫర్లు ఉన్నాయి. ఈ కథనంలో మీకు అందిస్తున్నాం.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాల్లో ఓలా ప్రస్తుతం నెం.1 పొజిషన్‌లో కొనసాగుతోంది. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా ఓలా స్కూటర్లపై ఉచిత ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ వారంటీ, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, సమగ్ర వారంటీపై భారీ తగ్గింపులు, లాభదాయకమైన ఫైనాన్సింగ్ డీల్స్‌ను పొందవచ్చు.

ఇంకా నవంబర్ 10 నుంచి ఓలా తన అన్ని స్కూటర్లపై అదనంగా రూ. 2,000 తగ్గింపును ప్రకటించింది. అంతే కాకుండా రూ. 26,500 వరకు విలువైన ఆఫర్‌లను కస్టమర్‌లు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై కస్టమర్లు పొందవచ్చు. ఓలా S1 లైనప్‌లోని స్కూటర్లు భారీగా సేల్ అవుతున్న సంగతి తెలిసిందే.
ముందుగా S1 Pro Gen-2 స్కూటర్‌పై కస్టమర్‌లు రూ. 7,000 విలువైన ఉచిత ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ వారంటీని ఓలా అందిస్తోంది. S1 Air, S1 X+ స్కూటర్లపై ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ వారంటీ, కాంప్రిహెన్సివ్ ఎక్స్‌టెండెడ్ వారంటీపై 50 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు.

ఈ మేరకు S1 Pro Gen-2 ని కొనుగోలు చేసే కస్టమర్లు కేవలం రూ. 2,000 చెల్లించడం ద్వారా కాంప్రిహెన్సివ్ ఎక్స్‌టెండెడ్ వారంటీకి (రూ. 9,000 విలువైన) అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. కాగా కస్టమర్లు తమ పాత ICE స్కూటర్‌ను మార్చుకునే అవకాశం కూడా ఉంది. దీని ద్వారా S1 Pro Gen-2 కొనుగోలుపై గరిష్ఠంగా రూ. 10,000 వరకు తగ్గింపు పొందవచ్చు.
పాత ICE టూ వీలర్‌ను మార్చుకోవడం ద్వారా S1 Air, S1 X+ స్కూటర్ల కొనుగోలుపై రూ. 5,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ అందిస్తోంది. కస్టమర్లు తమకు దగ్గర్లోని ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌కు వెళ్లడం ద్వారా ఈ ఆఫర్‌ను పొందేందుకు అవకాశం ఉంది.

ఇక దీపావళి సందర్భంగా ఓలా భారీగా ఫైనాన్స్ ఆఫర్లు కూడా ప్రకటించింది. కస్టమర్లు కొన్ని క్రెడిట్ కార్డ్ EMIల ద్వారా రూ. 7,500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఫైనాన్స్ ఆఫర్లలో జీరో డౌన్ పేమెంట్, నో-కాస్ట్ EMI, జీరో-ప్రాసెసింగ్ ఫీజు, 5.99 శాతం తక్కువ వడ్డీ రేట్లు వంటి ఇతర ఆఫర్స్‌ను కూడా కల్పించింది. ఇవన్నీ దీపావళి వరకే అందుబాటులో ఉంటాయి.
ఇక ఓలా తన కస్టమర్ల కోసం ప్రత్యేకంగా లక్కీ-బూట్ ఆఫర్‌లను ప్రకటించింది. కస్టమర్‌లు ఏదైనా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఓలా స్కూటర్‌ని టెస్ట్-రైడ్ చేయడం ద్వారా ప్రతిరోజూ S1X+ గెలుచుకునే అవకాశం పొందవచ్చు. వీటితో పాటు ఉచిత ఓలా మర్చండైస్, Ola Care+ డిస్కౌంట్ కూపన్‌లు, S1 Pro (Gen 2) కొనుగోలుపై రూ. 1,000 వరకు విలువైన డిస్కౌంట్ కూపన్స్‌ను అందిస్తోంది.

కాగా రూ 1,47,499 ధరతో, S1 Pro (2nd Gen) ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు గత వారమే దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ నగరాల్లో ప్రారంభమయ్యాయి. S1 ఎయిర్ రూ. 1,19,999 ధర పలుకుతోంది. ఇంకా ఓలా ఎలక్ట్రిక్ S1Xని మూడు వేరియంట్‌లలో ప్రవేశపెట్టింది.
ఓలా S1 X+, S1 X (2kWh), S1 X (3kWh) వేరియంట్లలో కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. S1 X+ రూ ₹1,09,999 ప్రారంభ ధరతో అందుపాటులో ఉండగా.. S1 X (3kWh), S1 X (2kWh) ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రీ-రిజర్వేషన్‌ను రూ. 999 చెల్లించి చేసుకోవచ్చు. కాగా ఈ రెండు స్కూటర్లు రూ. 99,999 మరియు రూ. 89,999 బేస్ ధర నుంచి ప్రారంభమవుతాయి.


Click it and Unblock the Notifications








