Honda Activa లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. తక్కువ ధరలో ఆకట్టుకొనే ఫీచర్లు..!
భారత మార్కెట్‌లో హోండా యాక్టివా ఆదరణ పొందిన మోడళ్లలో ఒకటి. వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా మార్కెట్లో ఎప్పటికప్పుడు వివిధ రకాల కొత్త మోడల్‌లను హోండా సంస్థ అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంది. తాజాగా హోండా మోటార్స్ సంస్థ వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది.
హోండా సంస్థ భారత్ మార్కెట్‌లోకి Activa స్కూటర్ లిమిడెట్ ఎడిషన్‌ను (Honda Activa limited edition) విడుదల చేసింది. ఈ కొత్త స్కూటర్ స్టాండర్డ్ మరియు స్మార్ట్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.80,734, స్మార్ట్ వేరియంట్ ధర రూ.82,734గా ఉంది.

హోండా యాక్టివా లిమిటెడ్ ఎడిషన్‌లో కొన్ని కాస్మోటిక్ మార్పులు చేశారు. ఈ స్కూటర్ మొత్తం 10 సంవత్సరాల వారంటీ ప్యాకేజీతో వస్తుంది. 3 సంవత్సరాలు స్టాండర్డ్ వారంటీ, 7 సంవత్సరాలు ఆప్షనల్ వారంటీ ఉంది. స్కూటర్ పెర్ల్ సైరన్ బ్లూ, మ్యాట్ స్టీల్ బ్లాక్ మెటాలిక్ రంగుల్లో లభిస్తుంది. దీంతోపాటు అరుదైన గ్రాబ్ రైల్ బాడీ డార్క్ ఫినిషింగ్ సహా యాక్టివా 3D లోగో కస్టమర్లను ఆకట్టుకొనే అవకాశం ఉంది.
హోండా యాక్టివా లిమిటెడ్ ఎడిషన్ (Honda Activa) స్కూటర్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. ఈ స్కూటర్ BS6 OBD కంప్లైంట్ 109.51cc సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 7.37 bhp గరిష్ఠ శక్తిని మరియు 8.90Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
భారత్ ఆటోమొబైల్ మార్కెట్‌లో హోండా యాక్టివా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని సంస్థ సీఈవో ఒటాని తెలిపారు. ఈ స్కూటర్ గత రెండు సంవత్సరాల్లో లక్షలాది మందికి చేరువైందని అన్నారు. దశాబ్దాలుగా అన్ని వయసుల వారిని ఆకర్షిస్తోందని చెప్పారు. లిమిటెడ్ ఎడిషన్ మరింత మంది కస్టమర్లకు చేరువవుతుందని ఒటాని తెలిపారు.
ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కొనుగోలు చేసేందుకు హోండా యాక్టివా 6G స్టాండర్డ్ ఎడిషన్ ధర రూ.98,951గా (ఆన్‌రోడ్) ఉంది. ఈ బైక్ ఇంజిన్ 109.51cc ఇంజిన్ గరిష్ఠంగా 7.73bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా 47 kmpl మైలేజీని అందిస్తుంది. దీంతోపాటు ఇంజిన్ స్టార్ట్ స్టాప్ స్విచ్, సైలెంట్ స్టార్టర్ సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది.
హోండా యాక్టివా డీఎల్‌ఎక్స్ ఎడిషన్ రూ.78.734 (ఎక్స్‌షోరూం) ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పెరల్ ప్రెషియస్ వైట్, పెరల్ సైరన్ బ్లూ, రెబెల్ రెడ్ మెటాలిక్ వంటి రంగుల్లో లభిస్తుంది. ఈ స్కూటర్ ట్యూబ్‌లెస్ టైర్ మరియు డ్రమ్ బ్రేక్ ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








