టూ- వీలర్ మార్కెట్‌లో మరోసారి ఓలా ఆధిపత్యం.. నవంబర్‌లో 30,000 యూనిట్ల రిజిస్ట్రేషన్‌లతో ఆల్-టైమ్ రికార్డు!!
భారతదేశంలో టూ- వీలర్ సెక్షన్‌లో తిరుగులేని శక్తిగా ఓలా ఎలక్ట్రిక్ అవతరిస్తోంది. ప్రతీరోజు సేల్స్ పెంచుకుంటూ మార్కెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేకతను ఓలా చాటుకుంటోంది. విభిన్నమైన ప్రోమో మరియు ఆకర్షణీయమైన ఆఫర్లతో సేల్స్‌ని పెంచుకుంటుంది. నవంబర్‌లో టూ-వీలర్ సేల్స్‌తో ఈ కంపెనీకి చెందిన స్కూటర్లు సత్తా చాటాయి.
మార్కెట్‌లో అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ నవంబర్ నెలలోనూ తన విక్రయాల్లో సత్తా చాటింది. తాజాగా ఆ సంస్థ నుంచి కంపెనీ సేల్స్ వివరాలను సంస్థ వెల్లడించింది. ఈ పండుగ సీజన్ నవంబర్ లో ఓలా 30,000 రిజిస్ట్రేషన్‌లతో (వాహన్ డేటా ప్రకారం) కంపెనీ ఆల్-టైమ్ రికార్డును తాకింది. ఈ కంపెనీ నుంచి నవంబర్‌లో మొత్తం మార్కెట్ వాటాలో 35% మార్కెట్ వాటాతో EV స్కూటర్ విభాగంలో ఆధిపత్యాన్ని కొనసాగించింది.

మంచి సేల్స్‌తో కస్టమర్లకు మా బ్రాండ్ మరియు మా స్కూటర్ లైనప్‌లపై ఉన్న నమ్మకానికి ఇదే నిదర్శనమని ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ తెలిపారు. నవంబర్ నెలలో అత్యధిక రిజిస్ట్రేషన్‌లతో తమ కంపెనీ సత్తా చాటిందని ఆయన పేర్కొన్నారు. కస్టమర్‌లను ఆకట్టుకోవడంతో పాటు మంచి సేల్స్ సాధించడంతో మేము అగ్ర స్థానంలో కొనసాగుతున్నామని ఆయన చెప్పారు. డిసెంబర్‌లో ఈ ట్రెండ్ కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
భారతదేశంలో గ్రీన్ మొబిలిటీ వైపు అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగంగానే #EndICEAgeకి చేరుకోవాలనే నిబద్ధతలో పనిచేస్తున్నట్లు సంస్థ చెప్పుకొచ్చింది. సెప్టెంబర్ 2022 నుంచి వరుసగా ఐదు త్రైమాసికాలలో ఓలా ఎలక్ట్రిక్ తన పోల్ పోసిషన్ ని సాగిస్తూ వచ్చింది. కంపెనీ యొక్క సరికొత్త S1 స్కూటర్ పోర్ట్‌ఫోలియో ప్రారంభించినప్పటి నుంచి మంచి రెస్పాన్స్‌తో సేల్స్‌లో సత్తా చాటుతోంది.

Ola S1 ప్రో మరియు S1 ఎయిర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో కస్టమర్లకు మరింత చేరువ అవుతోంది. ముఖ్యంగా కస్టమర్లకు ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్స్‌ని నెలకొల్పి వారికి సకాలంలో సేవలను అందిచడంలో పూర్తిగా విజయం సాధించిందని చెప్పవచ్చు. మొదటగా మార్కెట్‌లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించిన ఓలా ప్రస్తుతం మాత్రం జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తుంది.
ఆకట్టుకునే పనితీరు మరియు స్పెషల్ ఆఫర్‌లు సేల్‌ని పెంచుతున్నాయడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా S1 ప్రో మరియు S1 ఎయిర్ రెండూ ఈ విభాగంలో నిలదొక్కుకున్న వేరియంట్లుగా గుర్తింపు పొందాయి. ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న ఈవీ స్కూటర్లలో ఇవి తొలి స్థానంలో కొనసాగుతున్నాయి.

అయితే మొత్తం అమ్మకాలల్లో ఒక్క నవంబర్‌లోనే ఓలా ఏకంగా 30 వేల మార్క్‌ను టచ్ చేశాయి. దీనికి తోడు ఈ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ వార్షిక అమ్మకాలు 82 శాతం మేర ఎగబాకాయి. ఇక నెలవారీ అమ్మకాలు 30 శాతం పెరిగడంతో మార్కెట్‌లో మరోసారి కింగ్ మేకర్‌గా ఓలా ఎలక్ట్రిక్ కొనసాగుతోంది. కచ్చితమైన ఆఫర్లు, సర్వీస్‌లను అందిచడం ద్వారా మార్కెట్‌లో పట్టు నిలుపుకొందని విశ్లేషకులు తెలిపారు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








