ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ.20,000 తగ్గింపు.. కొద్ది రోజులు మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్!!
దేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో ఓలా ఎలక్ట్రిక్ దుమ్మురేపుతోంది. ఊహించని విధంగా సేల్స్‌లో ఓలా రానిస్తోంది. తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు 'డిసెంబర్ టు రిమెంబర్' పేరుతో క్యాంపెయిన్‌ని ఈరోజు వెల్లడించింది. డిసెంబర్ 3న ఈ క్యాంపెయిన్ ప్రారంభం కానుంది. ఈ క్యాంపెయిన్‌లో అతి తక్కువ ధరకే ఓలా స్కూటర్లను కొనుగోలు చేయవచ్చు.
ఈ క్యాంపెయిన్‌లో భాగంగా S1 X ప్లస్‌పై 20,000 తగ్గింపుని సంస్థ అందిస్తోంది. అంటే కేవలం రూ.89,999 కే ఈ స్కూటర్ ఇంటికి తీసుకెళ్లేందుకు అందుబాటులోకి రానుంది. ఈ ఆఫర్ ధరలో S1 X+ అత్యంత సరసమైన 2W EV స్కూటర్‌లలో ఒకటిగా నిలువనుంది. ఈ తగ్గింపు ధరతో ఈ స్కూటర్ సేల్స్‌తో పాటు మార్కెట్‌లో ఓలా ఎలక్ట్రిక్ మరింత పట్టు సాధిస్తుందని ఓలా భావిస్తోంది.

ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న S1 X+ అత్యుత్తమ పనితీరు, అధునాతన సాంకేతికత మరియు అత్యుత్తమ రైడ్ ఫీల్‌ని అందించనుంది. ఈ స్కూటర్ 3kWh బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 151 కిమీల సర్టిఫైడ్ రేంజ్ ని అందించనుంది. అలాగే 6kW మోటార్ గల S1 X+.. కేవలం 3.3 సెకన్లలో 0-40 kmph వేగాన్ని అందుకోనుంది. 90 kmph గరిష్ట వేగంతో ఈ స్కూటర్ పరుగెత్తుతుంది.
"ఓలా ఎలక్ట్రిక్ నవంబర్ నెలలో 30,000 యూనిట్ల రిజిస్ట్రేషన్లతో రికార్డు బద్దలు కొట్టి కొత్త పరిశ్రమ బెంచ్‌మార్క్‌ను నెలకొల్పిందని చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, ఓలా అన్షుల్ ఖండేల్వాల్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్‌ని మరింత వేగవంతం చేయడానికి ఇది ఉపకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. S1 X+తో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి కస్టమర్లకు ఇది కలిసి వస్తుందని వెల్లడించారు.

తక్కువ ధరలో ICE స్కూటర్‌కి సమానమైన ధరలో, S1 X+ లభిస్తున్నందున్న కస్టమర్లు కొనుగోలుకి ఆసక్తి చూపిస్తారని అన్నారు. వీటితో పాటు మేము అందించే ఆఫర్లతో సేల్స్ గణనీయంగా పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. కొనుగోలుదారులు ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్‌లపై రూ. 5,000 వరకు డిస్కౌంట్ కూడా అందిస్తున్నట్లు చెప్పారు. వీటితో పాటు క్రెడిట్ కార్డ్ EMIల రూపంలో బైక్‌ని ఇంటికి తీసుకువెళ్లవచ్చు.
అయితే ఫైనాన్స్ ఆఫర్‌లలో జీరో డౌన్ పేమెంట్, జీరో-ప్రాసెసింగ్ ఫీజు మరియు 6.99% వడ్డీ రేట్లు వంటి ఇతర డీల్‌లు కూడా ఉంటాయని ఓలా చెప్పింది. ఓలా ఇటీవల తన S1 పోర్ట్‌ఫోలియోను ఐదు స్కూటర్లకు విక్రయిస్తోంది. రూ.1,47,499 ధరతో, S1 Pro 2nd జనరేషన్ ఇది కంపెనీ యొక్క ఫ్లాగ్‌షిప్ స్కూటర్‌గా కొనసాగుతోంది.

వీటితో పాటు S1 ఎయిర్ రూ.1,19,999 వద్ద కొనుగోలుకు అందుబాటులో ఉంది. అయితే ICE-కిల్లర్ స్కూటర్ గా S1Xని మూడు వేరియంట్‌లలో తీసుకువచ్చింది. S1 X+ మరియు S1 X (3kWh), అలాగే S1 X (2kWh)లలో అందుబాటులో ఉంది.
S1 X (3kWh) మరియు S1 X (2kWh) కోసం కేవలం రూ.999 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. S1 X (3kWh) మరియు S1 X (2kWh) స్కూటర్‌ల ధరలు వరుసగా రూ.99,999 మరియు రూ. 89,999 ప్రారంభ ధరలో అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








