'ఓలా భారత్ EV ఫెస్ట్'లో భాగంగా 3 రోజులు పాటు భారీ డిస్కౌంట్‌లను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్

ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ ఓలా ఎలక్ట్రిక్ 'ఓలా భారత్ EV ఫెస్ట్'లో భాగంగా "72 గంటల ఎలక్ట్రిక్ రష్"ని ప్రకటించింది. ఈ నెల 22 నుంచి 24 వరకు డిస్కౌంట్స్‌ పొందవచ్చు.

టూవీలర్‌ ఎలక్ట్రిక్‌ రంగంలో దేశంలోనే ఓలా ఎలక్ట్రిక్‌ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది. కొత్త కొత్త అప్‌డేట్స్‌తో కస్టమర్లను ఆకట్టుకోవడంలో ఓలాను ముందుంటుంది. ఇక ఓలాలో ప్రత్యేకమైన '5-ఇయర్ బ్యాటరీ ప్రామిస్' ప్రోగ్రామ్‌లో ఓలా S1 ప్రో, S1 ఎయిర్ మరియు S1 X+ స్కూటర్‌లను ఓలా ప్రస్తుతం విక్రయిస్తుంది. ఓలా స్కూటర్ కొనుగోలుపై ఐదు సంవత్సరాల ఎక్స్టెండెడ్ బాటరీ వారంటీ లభిస్తుంది.

Ola-Experience-Center

ప్రస్తుతం పండుగ ఆఫర్లను ఓలా ప్రకటించింది. ఓలా భారత్‌ EV ఫెస్టివల్‌ పేరున భారీ ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటించింది. ఇందులో భాగంగా మొదటగా S1 X+ కొనుగోలుపై INR 5000 తగ్గింపును కూడా పొందవచ్చు. ఈనెల అక్టోబర్ 16న Ola భారత్ EV ఫెస్ట్‌ని ప్రకటించింది. ఇందులో కొనుగోలుదారులు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై ₹24,500 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

ఇందులో ఐదు సంవత్సరాల బ్యాటరీ వారంటీపై రూ. 7,000 వరకు, ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లు రూ. 10,000 వరకు, మరియు నో-కాస్ట్ EMI భాగస్వామ్య బ్యాంకుల నుంచి రూ.7,500 వరకు తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ పథకాలు మరెన్నో లాభాలను కస్టమర్లు పొందవచ్చు.

Ola-Festive-Offers

ఓలా స్కూటర్‌ని టెస్ట్-రైడింగ్ చేసే కస్టమర్‌లు ఇతర అద్భుతమైన బహుమతులతో పాటు ప్రతిరోజూ ఒక S1X+ని గెలుచుకునే అవకాశాన్ని సంస్థ కల్పిచింది. ఇక ఓలా ఎక్స్‌పీరియన్స్‌లో భాగంగా ICE-to-EV మార్పిడి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కస్టమర్‌లు ఇప్పుడు తమ పాత ICE 2Wని సులభంగా మార్చుకోవచ్చు. S1 ప్రో, S1 ఎయిర్ మరియు S1 X+పై రూ.10,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ పొందవచ్చు.

లక్కీ-బూట్ ఆఫర్‌లు: కస్టమర్‌లు ఏదైనా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఓలా స్కూటర్‌ని టెస్ట్-రైడ్ చేయవచ్చు. ఇందులో ప్రతిరోజూ S1X+ గెలుచుకునే అవకాశం పొందవచ్చు. అంతేకాకుండా, ఉచిత ఓలా మర్చండైస్, Ola Care+ డిస్కౌంట్ కూపన్‌లు, మరియు S1 ప్రో (జెన్ 2) కొనుగోలు పై INR 1,000 వరకు విలువైన డిస్కౌంట్ కూపన్స్ నవరాత్రి మరియు దసరా ముగిసే వరకు పొందవచ్చు.



ఫైనాన్స్ ఆఫర్లు: కొనుగోలుదారులు కొన్ని క్రెడిట్ కార్డ్ EMIలపై INR 7,500 వరకు తగ్గింపులను పొందవచ్చు, అయితే ఫైనాన్స్ ఆఫర్‌లలో జీరో డౌన్ పేమెంట్, నో-కాస్ట్ EMI, జీరో-ప్రాసెసింగ్ ఫీజు మరియు 5.99% తక్కువ వడ్డీ రేట్లు వంటి ఇతర ఆఫర్స్ కూడా ఉంటాయి. ఈ ఆఫర్లు దీపావళి వరకు వర్తిస్తాయి.

రెఫరల్ స్కీమ్: అక్టోబర్ 24 వరకు ఓలా తన కమ్యూనిటీ సభ్యులు వారి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు ఓలా స్కూటర్‌ను రిఫర్ చేస్తే రివార్డ్ అందజేస్తుంది. రిఫరర్‌కి ఉచిత ఓలా కేర్+ మరియు ప్రతి రెఫరల్‌కు రూ.2000 వరకు క్యాష్‌బ్యాక్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ కొత్త పథకం ప్రకారం, విజయవంతంగా కొనుగోలు చేసిన తర్వాత రిఫరీలు కూడా ₹1,000 క్యాష్‌బ్యాక్‌ను కూడా అందుకుంటారు.

Ola-72-Hours-Electric-Rush

ఓలా S1 X+ రూ 1,09,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. S1 X (3kWh) మరియు S1 X (2kWh) కోసం ప్రీ-రిజర్వేషన్ చేసుకోవాలనుకునే వారు కేవలం రూ.999 చెల్లించి రిజర్వ్‌ చేసుకోవచ్చు. ఇక ఓలా S1 X (3kWh) మరియు S1 X (2kWh) స్కూటర్‌లు వరుసగా రూ. 99,999 మరియు రూ. 89,999 ప్రారంభ ధరలో అందుబాటులో ఉన్నాయి.

ఓలా భారత్ EV ఫెస్ట్‌'కు వస్తున్న స్పందన చూసి చాలా ఆనందంగా ఉందని అన్షుల్ ఖండేల్‌వాల్ తెలిపారు. ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లలో కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని.. కొత్తగా ప్రారంభించిన S1 X+ కోసం వారు ఆసక్తిని కనబరుస్తున్నారని వెల్లడించారు. ఈ పండుగ సీజన్‌ ఆఫర్లు కస్టమర్లు ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేసేందుకు ప్రోత్సాహిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రత్యేక తగ్గింపులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

More from DriveSpark

Article Published On: Saturday, October 21, 2023, 19:01 [IST]
English summary
Ola electric announced 72 hours electric rush for additional discouts
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+