Ola S1 ప్రో EV స్కూటర్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఉచిత ఫ్రంట్ సస్పెన్షన్ అప్‌గ్రేడ్‌ అందిస్తున్న సంస్థ

భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన ఫ్లాగ్‌షిప్ S1 ప్రో స్కూటర్‌కు ఉచిత సస్పెన్షన్ అప్‌గ్రేడ్‌ను ప్రకటించింది. S1 ప్రో, S1 ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఫ్రంట్ సస్పెన్షన్ అప్‌డేట్ మార్చి 22 నుండి అందించబడుతుందని సంస్థ పేర్కొంది.

మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుంచి ఓలా ఎలక్ట్రిక్ తన కస్టమర్ల పల్స్‌కి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్ డేట్లతో స్కూటర్లను తీసుకువస్తుంది. అందులో భాగంగా Ola 2 లక్షల మంది కస్టమర్‌ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా తాజా అప్ డేట్ ను తెచ్చింది. S1 ప్రో స్కూటర్ పై ఫ్రంట్ ఫోర్క్ ఆర్మ్ భద్రత ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని సంస్థ పేర్కొంది. అందులో భాగంగా తన కస్టమర్ కమ్యూనిటీకి హామీ ఇచ్చింది.

ఓలా ఎస్1 ప్రో

కస్టమర్ల కోసం ఎప్పుడు సరికొత్తగా..

అత్యంత ప్రజాదరణ పొందిన S1 ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‌లోని ఫ్రంట్ ఫోర్క్ ఆర్మ్ లేదా ఏదైనా భాగం అయినా కచ్చితంగా పరీక్షించబడిందని చెప్పింది. వాస్తవానికి ఈ భాగాలు మన రహదారి పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడ్డాయని వెల్లడించింది. అయినప్పటికి వాటిపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేసేందుకు ఈ ఉచిత సస్పెన్షన్ అప్ గ్రేడ్ ను తీసుకువచ్చింది.

ఓలా తమ ఇంజనీరింగ్, డిజైన్ ప్రక్రియలను అధునాతన టెక్నాలజీతో తీసుకువస్తునే ఉంది. దానికి అనుగుణంగా ఓలా భాగంగా, Ola ఇప్పుడు S1 ప్రో కస్టమర్ల కోసం ఫ్రంట్ ఫోర్క్ ఆర్మ్‌ను ఉచితంగా కొత్త యూనిట్‌కి అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశాన్ని అందిస్తోంది. ఇది స్కూటర్ సేల్, తదితర అంశాలకు ఊతం ఇస్తుందని కంపెనీ భావిస్తోంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్

మార్చి 22 నుంచి..

కఠినమైన రోడ్లపై మెరుగైన ప్రయాణం చేసేందుకు, కస్టమర్ సమస్యలను పరిష్కరించడానికి.. రైడ్‌ ను మరింత ఆనందదాయకంగా మార్చడానికి ట్యూన్ చేయబడిందని వెల్లడించింది. కంపెనీ ఈ అప్‌డేట్‌ను వినియోగదారులకు ఉచితంగా అందిస్తుంది. ఈ సేవను పొందేందుకు, కస్టమర్‌లు తమ సమీపంలోని ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ లేదా సర్వీస్ సెంటర్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. మార్చి 22 నుంచి అపాయింట్‌మెంట్‌లు స్వీకరిస్తారు.

ఓలా ఎలక్ట్రిక్ తన కస్టమర్ల పల్స్‌ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేందుకు సిద్ధంగా ఉంటుంది. అలానే బెంగళూరుకు చెందిన సంస్థ Ola S1 ప్రో ఫ్రంట్ సస్పెన్షన్ సెటప్ కోసం ఉచిత అప్‌గ్రేడ్‌ను అందిస్తోంది. కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరించడానికి ఇది మంచి ఉదాహరణగా పరిగణించవచ్చు. Ola S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ భారతీయ మార్కెట్లో బాగా అమ్ముడవుతోంది.

ఓలా ఎస్1 ప్రో

ఇప్పటికి అగ్రస్థానంలో..

S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌తో కస్టమర్ల ఎంపికలో Ola ఎలక్ట్రిక్ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో Move OS 2.0 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ఇచ్చింది. Ola Electric కంపెనీ కొత్త S1 ప్రో మోడల్‌లో Move OS 2.0 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా గరిష్ట ఫీచర్లను తన వినియోగదారులకు అందిస్తోంది.కొత్త S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మొదటిసారిగా మ్యూజిక్ ప్లేబ్యాక్ ఫీచర్ అందించబడింది.

రైడర్‌లు ఇప్పుడు తమ ఫోన్‌లను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయవచ్చు మరియు జియోసావన్, స్పోర్టిఫై యాప్‌ల ద్వారా ప్రయాణంలో తమకు ఇష్టమైన ట్యూన్‌లను ఆస్వాదించవచ్చు. ప్యాసింజర్ EV స్కూటర్ సెగ్మెంట్‌లో ఒక రకమైన అనుభవాన్ని అందిస్తూ, ఇది ఓపెన్ రోడ్లపై ఎక్కువ సౌకర్యాన్ని మరియు సున్నితమైన రైడింగ్ అనుభవాన్ని నిర్ధారిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, March 15, 2023, 12:06 [IST]
English summary
Ola electric announced free front suspension upgrade for s1 pro
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+