OLA నుంచి ఎలక్ట్రిక్‌ బైక్‌.. ఆగస్టు 15న ఆవిష్కరణ.. 300KM రేంజ్‌..!

ప్రముఖ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఆగస్టు 15న మరో ఈవీని విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించి ఓలా సీఈవో భవిష్‌ అగర్వాల్‌ ట్విట్‌ చేశారు. ఈ టీజర్‌లో త్వరలో విడుదల కానున్న ఎలక్ట్రిక్‌ బైక్‌ ఫోటోను విడుదల చేశారు. ఆగస్టు 15న MoveOS 4ను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు.

ఈ ఓలా కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ KTM సిరీస్‌ మోటార్‌ సైకిళ్లను పోలి ఉంటుంది. ఇది ప్రీ కన్‌స్ట్రక్షన్‌ లేదా కాన్సెప్ట్‌ సేజ్‌లో ఉంటుందని భావిస్తున్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తుందని భావిస్తున్నారు.

Ola Electric bike

ఈ బైక్‌పై ఇప్పటికే అనేక రకాల వార్తలు బయటకు వచ్చాయి. దీని ఆధారంగా త్వరలో ఆవిష్కరించనున్న ఓలా MoveOS 4 బైక్‌ 300 నుంచి 350 మధ్య రేంజ్‌ అందించే అవకాశం ఉంది. మెరుగైన పనితీరును అందించే అవకాశం ఉంది. రోజువారీ వినియోగానికి ఈ ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ మంచి ఎంపిక అవుతుందని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి.

ఓలా నుంచి రానున్న ఎలక్ట్రిక్‌ బైక్‌ ధర రూ.2.50 లక్షలకు పైగా ప్రారంభ ధరను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే ధర గురించి ఓలా సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. రానున్న రోజుల్లో ధర, ఇతర వివరాలు విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

MoveOS 4 అప్‌డేట్‌ MoveOS 4.. ఎలక్ట్రిక్‌ బైక్‌, ఓలా S1 శ్రేణి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లకు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది. MoveOS 4తో పరిచయం చేయనున్న కన్సర్ట్‌ మోడ్‌.. పార్టీ మోడ్‌ పొడిగింపుగా రానున్నట్లు సమాచారం. ఇది కాకుండా ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కు మరిన్ని Moodsలో అందించగలదు.

ఈ మూడ్‌ అనేది ఓలా తన స్కూటర్లలో డిజిటల్ డిస్‌ప్లే కోసం అందించే విభిన్న హోం స్క్రీన్‌లను కలిగి ఉంటుంది. రైడర్ ఎంపికను బట్టి స్కూటర్‌ ఎగ్జాస్ట్‌ నోట్‌ ధ్వనిగా మారుతుంది. ప్రస్తుతం లైట్‌, ఆటో, డార్క్‌ ఆప్షన్లలతో మూడ్‌ ఆప్షన్‌లు ఉన్నాయి.

ఓలా సంస్థ మ్యాప్‌పై పనిచేస్తుందని సీఈవో భవిష్‌ అగర్వాల్‌ చెప్పారు. వాటిని ఓలా మ్యాప్స్‌గా పిలుస్తున్నారు. భవిష్యత్‌లో నావిగేషన్‌ కోసం ఈ మ్యాప్స్‌ ఉపయోగించాలని భావిస్తోంది. ఏథర్‌ ట్రిప్‌ ప్లానర్‌ వంటి ఫీచర్‌ను ఓలా ఎలక్ట్రిక్‌ సంస్థ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది.

ఓలా MoveOS 4, ఎలక్ట్రిక్‌ బైక్ పూర్తి డిజైన్‌, స్పెసిఫికేషన్లు, ఇతర వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్‌ బైక్‌ను ఆవిష్కరణ రోజున కచ్చితమైన ధర సహా వేరియంట్లు, ఇతర సమాచారం ఓలా సంస్థ వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, August 12, 2023, 18:45 [IST]
English summary
Ola electric bike unveiled will be on august 15
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+