Ola EV: వేగంగా విస్తరిస్తోన్న ఓలా EV.. HYDలో కొత్తగా మూడు ఎక్స్‌పీరియన్స్ సెంటర్స్ ఏర్పాటు..!

దేశంలో ఓలా ఎలక్ట్రిక్ దూసుకుపోతుంది. గత ఏడు నెలలుగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో తొలి స్థానంలో కొనసాగుతోంది. అందులో వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు దేశంలో ఎక్స్‌పీరియన్స్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది.తమ సర్వీస్ ను పేరొందిన పట్టణ స్థాయిలో తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

అందులో భాగంగా ఈ అతిపెద్ద ఈవీ (EV) కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ దేశవ్యాప్తంగా ఒకే రోజున 50 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా వీటి సంఖ్యను భవిష్యత్ లో పెంచనుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ.. వినియోగదారులకు వాహనాలు, తన సేవలను మరింత అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు, దేశ వ్యాప్తంగా అంతటా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను (ECs) ప్రారంభించేందుకు చురుకుగా పనిచేస్తుంది.

ఓలా ఎలక్ట్రిక్

3 కేంద్రాలు ఏర్పాటు..
ఈ సంస్థ హైదరాబాద్ లో మాదాపూర్ లోని శ్రీరామ కాలనీ లో (హైటెక్ సిటీ రోడ్), నాగోల్ లోని ఆదర్శ్ నగర్ లో, మెహదీపట్నంలో రేతిబౌలిలో వీటిని ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ఓలా ప్రారంభింది. దీంతో, హైద్రాబాద్లో ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్స్ సంఖ్య మొత్తం ఏడుకు చేరుకుంది. ఇంకా వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఓలా ఈవీలను సులభంగా కొనుగోలు చేసేలా.. కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ప్రధాన నగరాల్లో ఎక్స్పీరియన్స్ సెంటర్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ తెలిపారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో మా ఆఫ్‌లైన్ ఉనికిని దూకుడుగా విస్తరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మేము మా ఆఫ్‌లైన్ సేవలను విస్తరించే వేగాన్ని ఇంకా పెంచాలని భావిస్తున్నట్లు వివరించారు.

మారుమూల గ్రామాలకు విస్తరించేందుకు..
దేశంలోని మారుమూల ప్రాంతాలలో ఉన్న లక్షలాది భారతీయులు మా ఉత్పత్తులు సేవలను సజావుగా అనుభవించడానికి వీలు కల్పిస్తామని ఆయన హామి ఇచ్చారు. అందులో భాగంగా ఎక్స్పీరియన్స్ సెంటర్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు చెప్పారు. సేల్స్ తో పాటు వినియోగదారులకు అన్ని విధాలా ఇవి ఉపయోగపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు వినియోగదారులకు ఒకే ప్రదేశంలో సమగ్రమైన సేవలను అందించేలా డిజైన్ చేశారు. దాదాపు 90% మంది ఓలా వినియోగదారులు ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌కు 20 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్నారు. ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు వినియోగదారులకు S1, S1 ప్రో మోడళ్లను టెస్ట్ రైడ్ చేసే అవకాశాన్ని అందిస్తాయి.

భారతదేశంలో 2025 నాటికి మొత్తం 2వీలర్లను ఎలక్ట్రిక్‌గా మార్చాలనే దృక్పథంతో, స్థిరమైన ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు ప్రపంచ మార్పును వేగవంతం చేసేందుకు ఓలా ఎలక్ట్రిక్ వాహనాల కోసం దృఢమైన ప్రణాళికతో చురుకుగా పనిచేస్తుంది. మార్కెట్ లో లభిస్తున్న ఏథర్, TVS లతో పాటు కొత్తగా పుట్టుకొస్తున్న బ్రాండ్ లు తమ సంస్థకు దరి చేరకుండా ఉండాలని కీలక నిర్ణయాలతో దూసుకెళ్తుంది.

ఓలా ఎలక్ట్రిక్

అమ్మకాల్లో జోరు..
ఓలా మార్చి 2023లో విక్రయాల గణాంకాలను విడుదల చేసింది. గత నెలలో ఓలా మొత్తం 27,000 యూనిట్ల విక్రయాలను సేల్ చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇప్పటి వరకు ఉన్న సేల్సో లో ఈ మార్చి అతిపెద్ద నెలవారీ విక్రయాల సంఖ్య అని పేర్కొంది. దీంతో ఓలా మార్కెట్ షేర్ 30 శాతానికి పైగా పెరిగిందని కంపెనీ తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరం అమ్మకాల్లో అద్భుతమైన వృద్ధిని సాధించింది.

బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రెండు లక్షల వాహనాలను విక్రయించి 2022-2023 ఇయర్ ని ఘనంగా ముగించింది. ఓలా భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి ప్రవేశించిన మొదట్లో వినియోగదారుల పల్స్ ని పట్టుకోవడంలో చాలా కష్టపడింది. అనతి కాలంలోనే కొన్ని మార్పులు చేసి ప్రస్తుత మార్కెట్ ని ఏలుతోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, April 5, 2023, 9:10 [IST]
English summary
Ola electric launched 3 experience centers in hyderabad
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+