పండుగ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ బంపర్ ఆఫర్.. ఈ రోజు నుంచే ఈ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లు.!
మరికొద్ది రోజుల్లో దసరా పండుగ రానుంది. ఫెస్టివ్ సీజన్ సందర్భంగా ప్రజలు వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. అందుకు అనుగుణంగా వాహన తయారీదారులు సరికొత్త ఆఫర్లను ప్రకటించి కస్టమర్లను ఆకట్టుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్.. పండుగ సందర్భంగా గొప్ప ట్రీట్‌ను అందిస్తోంది.
ఓలా ఎలక్ట్రిక్(Ola Electric) భారత్ ఈవీ ఫెస్ట్(Bharat EV Fest) పేరుతో నేటి(అక్టోబర్ 16) నుంచి ప్రత్యేక మేళాను నిర్వహిస్తోంది. ఈ మేళాలో భాగంగా కస్టమర్లకు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై వారంటీ ఆఫర్, ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ పలు ఆఫర్లను అందిస్తోంది. అంతే కాకుండా ఈ నెలలో టెస్ట్ డ్రైవ్ నిర్వహించే వారికి సైతం బహుమతులు పంపిణీ చేయనుంది.

అయితే ఈ ఆఫర్‌ను దీపావళికి కూడా అందిస్తుందా లేదా అనేదానిపై సమాచారం అందుబాటులో లేదు. భారత్ ఈవీ ఫెస్ట్ ద్వారా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు ఓలా అందించే ఆకర్షణీయమైన ఆఫర్లను సద్వినియోగం చేసుకోవచ్చు. మరి ఏయే మోడల్ స్కూటర్‌పై ఏ ఆఫర్లు ప్రకటించిందో ఈ కథనంలో మీ కోసం..
ఓలా అందిస్తున్న డిస్కౌంట్, ఆఫర్లలో ఎక్స్‌టెండెండ్ బ్యాటరీ లైఫ్ వారంటీ కూడా ఉంది. కొత్త 2వ తరం Ola S1 ప్రో ఈవీని కొనుగోలు చేసే కస్టమర్లకు 5 సంవత్సరాల extended battery వారంటీని అందిస్తోంది. S1 Air ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన వారికి.. 5 సంవత్సరాల పొడిగించిన బ్యాటరీ వారంటీపై 50 శాతం తగ్గింపును పొందవచ్చు. కాగా ఓలా ప్రస్తుతం మూడేళ్ల బ్యాటరీ వారంటీని అందిస్తోంది.

ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్లపై వాహన ఎక్స్‌ఛేంజ్ తగ్గింపును కూడా ప్రకటించింది. ఈ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ రూ.10,000 వరకు ఉంటుంది. ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునేవారు తమ వద్ద పెట్రోల్ స్కూటర్ ఉన్నట్లయితే దాని ఎక్స్‌ఛేంజ్‌పై ఈ ఆఫర్ వర్తిస్తుందని ఓలా తెలిపింది.
అయితే ఓలా సిబ్బందిని ముందుగా పాత పెట్రోల్ స్కూటర్‌ను తనిఖీ చేస్తారు. అది సంతృప్తి స్థాయిలో ఉన్నట్లయితేనే ఈ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వర్తిస్తుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఓలా S1 ధర రూ. 85,099 నుంచి రూ. 1.10 లక్షలుగా ఉంది.
ఇక ఓలా ఎలక్ట్రిక్ తన ఈవీలను టెస్ట్ డ్రైవ్ చేయాలనుకునేవారికి బహుమతుల రూపంలో బంపర్ ఆఫర్ ప్రకటిస్తోంది. ప్రతి రోజు లక్కీ డ్రా ద్వారా గెలుపొందిన విజేతకు Ola S1 X+ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఉచితంగా అందిస్తామని ఓలా ప్రకటించింది. ఇంకా కస్టమర్లు.. ఓలా ఎంపిక చేసిన కార్డుల ద్వారా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ. 7,500 వరకు తగ్గింపును పొందవచ్చు.
ఓలా ఇటీవల దేశీయ మార్కెట్లో S1 Pro Gen 2 ను ఈవీ డెలివరీలను ప్రారంభించింది. దీని ధర రూ. 1.48 లక్షలు(ఎక్స్ షో రూమ్). అప్‌డేటెడ్ ఛాసిస్, మోటార్‌తో పాటు బ్యాటరీ ప్యాక్, కొత్త టెక్ ఆన్ బోర్డుతో అధునాతన మార్పులు పొందింది. ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు నగరంలో 100 కు పైగా నగరాల్లో ప్రారంభమయ్యాయని.. త్వరలో మరిన్ని నగరాలను విస్తరిస్తామని ఓలా తెలిపింది.
కాగా Ola S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ 11 kW గరిష్ఠ శక్తిని ఉత్పత్తి చేయడంతో పాటు పూర్తి ఛార్జ్‌పై 195 కిమీ రేంజ్‌ను అందిస్తుంది. గరిష్టంగా 120 kmph వేగంతో దూసుకెళ్తుంది. ఇది 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో ఈ స్కూటర్ నియో మింట్, కోరల్ గ్లామ్, జెట్ బ్లాక్‌తో సహా అనేక ఆకర్షణీయమైన కలర్స్‌లో అందుబాటులో ఉంది.
ఇక మిడ్-లెవల్ వెర్షన్ Ola S1 Air ధర రూ.1,19,999(ఎక్స్ షోరూమ్). ఇది 3 kWh బ్యాటరీ ప్యాక్‌తో పూర్తి ఛార్జింగ్‌పై 151 కిమీ రేంజ్‌ను ఇస్తుంది. గంటకు 90 km వేగంతో ప్రయాణిస్తుంది. Ola S1X బేస్ వేరియంట్ మోడల్ ధర రూ. 89,999(ఎక్స్-షోరూమ్).
ఈ స్కూటర్‌లో 2 kWh, 3 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. పూర్తి ఛార్జింగ్‌పై 151 కి.మీల వరకు రేంజ్ ఇస్తుంది. గరిష్ఠంగా 90 కి.మీ ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ 3.5 అంగుళాల డిస్‌ప్లేతో సహా పలు ఆకర్షణీయ ఫీచర్లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








