ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి అదిరిపోయే ఆఫర్.. పైసా ఖర్చు లేకుండా తక్కువ వడ్డీతో ఇంటికి తీసుకెళ్లవచ్చు

భారత్‌లో ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ ఓలా.. ఈవీ మార్కెట్‌లో దూసుకోపోతోంది. ఆకర్షణీయమైన ఫీచర్లతో, సరసమైన ధరలో ఎలక్ట్రిక్‌ టూ వీలర్స్‌ను ప్రవేశపెట్టి వినియోగదారుల్లో క్రేజ్‌ సంపాదించుకుంది. ఈ క్రమంలో తాజాగా ఓలా.. వినియోగదారుల కోసం ఈవీ కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసింది.

ఓలా ఎలక్ట్రిక్‌ దేశంలోని చిన్న నగరాలకు సైతం ఓలా EVలను తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో, 48 నెలల కాలవ్యవధికి కేవలం 8.99 శాతం వడ్డీ రేటుతో ఫైనాన్సింగ్ ఫ్లెక్సిబిలిటీని అందిస్తోంది.

Ola Electric

శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ ఫైనాన్స్‌ ద్వారా వినియోగదారులకు మరింత చేరువ అవుతూ ఓలా ఎలక్ట్రిక్ EVలను అందరికీ అందుబాటులో ఉండేలా చేయనుంది. శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ భారతదేశంలోని ప్రముఖ NBFC మాత్రమే కాదు. దేశంలో టూ వీలర్‌కు సంబంధించి అతిపెద్ద ఫైనాన్షియర్‌లలో ఒకటి. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 2,800 శాఖలు ఉన్నాయని కంపెనీ తెలిపింది.

ఓలా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకుష్ అగర్వాల్ దీనిపై మాట్లాడారు. టైర్-1 నగరాలకు మాత్రమే కాకుండా చిన్న నగరాలకు సైతం ఓలా సేవలను విస్తరిస్తున్నట్లు తెలిపారు. అందుకోసం ఫైనాన్సింగ్ పరిష్కారాలను సులభంగా, అందరికీ అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా తమ స్కూటర్లను సరసమైన ధరలకు అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

Ola-S1-Pro

శ్రీరామ్ సిటీ యూనియన్‌ ఫైనాన్స్‌తో భాగస్వామ్యం ద్వారా వినియోగదారులను ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు మళ్లించడమే తమ ఉద్దేశమని అంకుష్‌ అగర్వాల్‌ అన్నారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ టూ వీలర్లను వేగవంతంగా విస్తరించేందుకు మార్గం సుగమం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

వినియోగదారులు ఓలా యాప్ ద్వారా కొనుగోలు ప్రక్రియను చేసే ముందు ఫైనాన్సింగ్ ఎంపికలపై పూర్తి సమాచారం కోసం సమీపంలోని ఓలా ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను సందర్శించవచ్చు. దీని ద్వారా ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో ఈ ఫైనాన్సింగ్ విధానాలను తెలుసుకోవడం ద్వారా మీరు ఈవీ కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ప్రక్రియ సులభతరం అవుతుంది.

ఓలా ప్రస్తుతం 850+ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్స్‌తో భారతదేశపు అతిపెద్ద D2C ఆటోమొబైల్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఆగస్టులో 1,000వ ECని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓలా ఇటీవల ప్రకటించింది. ఓలా ప్రస్తుతం దాని S1 లైనప్‌లో మూడు మోడళ్లతో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న EVగా నిలిచింది.

Ola లైనప్‌లో S1 ప్రో, S1 మరియు S1 ఎయిర్ ఎలక్ట్రిక్‌ టూ వీలర్లు ఉన్నాయి. ఈ ఈవీలు అధునాతన సాంకేతికత, మంచి పనితీరుతో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్‌ కంపెనీ ఇప్పుడు వరుసగా మూడు త్రైమాసికాల్లో అమ్మకాలలో టూ వీలర్‌ EV విభాగంలో అగ్రస్థానంలో ఉంది. దాదాపు 40 శాతం మార్కెట్ వాటాతో అగ్రగామిగా కొనసాగుతోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, July 13, 2023, 20:37 [IST]
English summary
Ola electric partnership with sriram city union finance with low interest rate full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+