మార్కెట్లో అదరగొడుతున్న ఓలా కొత్త స్కూటర్లు.. రెండు వారాల్లోనే 75,000 కు పైగా బుకింగ్స్..

దేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్ ఓలా ఎలక్ట్రిక్ గురించి ప్రత్యేకంగా చెప్పవనసరం లేదు. ఎలక్ట్రిక్ సెగ్మెంట్లోకి ప్రవేశించిన అనతి కాలంలోనే మార్కెట్లో టూ వీలర్స్ సేల్స్‌లో దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా ఓలా ఎలక్ట్రిక్ మరో అరుదైన ఘనతను సాధించింది.

ఓలా ఎలక్ట్రిక్ తన స్కూటర్ పోర్ట్‌ఫోలియోను 5 స్కూటర్లకు విస్తరించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర రూ.90,000 నుంచి రూ.1,50,000 మధ్య ఉంది. అంతే కాకుండా ఈ సరికొత్త S1 లైనప్‌కు కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Ola-S1-Bookings

ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల విడుదల చేసిన ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. కేవలం రెండు వారాల్లో 75,000 పైగా బుకింగ్స్ రావడం విశేషం. రెండు వారాల్లోనే 75,000 కంటే ఎక్కువ బుకింగ్స్ రావడంపై ఓలా ప్రతినిధి ఒకరు హర్షం వ్యక్తం చేశారు.

తమ కొత్త S1 లైనప్‌కి వచ్చిన స్పందనతో సంతోషిస్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యుదీకరణలో దేశ నాయకత్వానికి మద్దతు ఇవ్వడానికి స్పష్టమైన దృష్టితో పని చేస్తున్నట్లు వెల్లడించారు. S1 ప్రో, S1 X పోర్ట్‌ఫోలియో, S1 ఎయిర్‌తో ఇకపై ఇంధనంతో నడిచే వాహనాలకు స్వస్తి పలకవచ్చని పేర్కొన్నారు.

Ola-S1-Bookings

ఇటీవల విడుదల చేసిన ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్‌తో కస్టమర్లు ఇంధనంతో నడిచే స్కూటర్‌తో పోలిస్తే నెలకు రూ.2,600, సంవత్సరానికి రూ.30,000 ఆదా చేయవచ్చని ఓలా ఎలక్ట్రిక్ స్పష్టం చేసింది. ఈ సేవింగ్స్‌తో, వినియోగదారులు తమ స్కూటర్ ధరను కేవలం మూడేళ్లలో తిరిగి పొందవచ్చని వివరిస్తోంది.

అదేవిధంగా, S1 ఎయిర్ వినియోగదారులు సంవత్సరానికి గరిష్ఠంగా నెలకు రూ.1,900, ఏడాదికి రూ.23,000 ఆదా చేయవచ్చని ఓలా పేర్కొంది. S1 ప్రో కస్టమర్లు నెలకు రూ.1,100, ఏడాదికి రూ.13,000 ఆదా చేయవచ్చని తెలిపింది. సగటు రోజువారీ ప్రయాణం 30 కిలోమీటర్ల ఆధారంగా ఓలా గణాంకాలను అంచనా వేసింది.

స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఓలా ఎలక్ట్రిక్ S1X మోడల్‌ను పరిచయం చేసింది. ఇందులో కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా S1 X+, S1 X (2kWh), S1 X (3kWh) వేరియంట్‌లను ప్రవేశపెట్టింది. S1 X+ (3kWh), S1 X (3kWh) రెండూ శక్తివంతమైన 6kW మోటార్‌, 3 kWh బ్యాటరీ, 151 కి.మీ రేంజ్, గంటకు 90 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో అందుబాటులోకి రానున్నాయి.

S1 X (2kWh) కూడా శక్తివంతమైన 6kW మోటార్‌ను కలిగి ఉంది. రేంజ్ 91 కి.మీ కాగా, గంటకు 85 కి.మీ గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. సిటీ అవసరాలకు అనుగుణంగా ఉండేందుకు మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎదురు చూసే వినియోగదారులకు ఈ S1 లైనప్ మంచి ఆప్షన్..

ఇక S1 X+ స్కూటర్ రూ.1,09,999 ధరలో అందుబాటులో ఉంది. కాగా స్కూటర్ డెలివరీలు సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయి. S1 X (3kWh), S1 X (2kWh) ప్రీ-రిజర్వేషన్ విండో రూ. 999 తో కొనసాగుతోంది. వాటి డెలివరీలు డిసెంబర్‌లో ప్రారంభం కానున్నాయి. S1 X (3kWh), S1 X (2kWh) స్కూటర్లు తక్కువ ధరలో అంటే వరుసగా రూ.99,999, రూ. 89,999 వద్ద అందుబాటులో ఉన్నాయి.

ఇంకా ఓలా ఎలక్ట్రిక్ తన సెకండ్ జనరేషన్ S1 ప్రోను కొత్త, మరింత సమీకృత ప్లాట్‌ఫారమ్‌లో కూడా విడుదల చేసింది. రూ.1,47,499 ధరతో, Gen-2 S1 Pro ఇప్పుడు ట్విన్-ఫోర్క్ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్‌తో పాటు మెరుగైన 195 కి.మీ రేంజ్ ఇస్తుంది.

గంటకు 120 కి.మీ అత్యుత్తమ వేగంతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది. S1 Pro Gen 2 కోసం ఇప్పటికో ఓలా ఎలక్ట్రిక్ కొనుగోలు విండోను ఓపెన్ చేసింది. కాగా డెలివరీలు సెప్టెంబర్ మధ్యలో ప్రారంభమవుతాయని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Monday, August 28, 2023, 20:31 [IST]
English summary
Ola electric receives more than 75000 bookings within two weeks for s1x portfolio
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+