హోలీ ఫోటో పెట్టు.. స్కూటర్ పట్టు.. ఓలా ఎలక్ట్రిక్ బంపర్ ఆఫర్..
హోలీని పురస్కరించుకుని ఓలా ఎలక్ట్రిక్ ప్రత్యేక ఎడిషన్ స్కూటర్ ను ప్రకటించింది. కంపెనీ నుంచి బాగా పేరొందిన S1 మోడల్ లో ఈ కలర్ ఫుల్ స్కూటర్ ను తీసుకురానుంది. దేశవ్యాప్తంగా కేవలం 5 ఓలా S1 హోలీ స్పెషల్ ఎడిషన్లను యూనిట్లను మాత్రమే విడుదల చేయనుంది. అయితే ఇందులో ఒక దాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. దానికి మీరు ఏం చేయాలో తెలుసా..
హోలీ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిష్ అగర్వాల్ తమ కస్టమర్లకు ఆఫర్ ను ప్రకటించారు.హోలీని పురస్కరించుకుని మల్టీ-కలర్ పెయింట్ థీమ్ తో 5 స్కూటర్లను తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆరెంజ్, ఎల్లో, బ్లూ, రెడ్య గ్రీన్ కలర్స్ థీమ్ కలర్లతో సూపర్ లుక్ స్కూటర్ కి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో పంచుకున్నారు.

బెస్ట్ ఫోటో/వీడియో ద్వారా ఎంపిక..
ఓలా S1 స్కూటర్ తో హోలీ సెలబ్రేట్ చేసుకున్న వారు వీడియో లేదా ఫోటోలను తమతో పంచుకుంటే బెస్ట్ ఐదులోని ఒకరు ఈ స్కూటర్ ను ఉచితంగా సొంతం చేసుకోవచ్చని ప్రకటించారు. మిగతా వాటిని అమ్మకాలకు పెట్టనున్నారు. అయితే ఈ మల్టీ కలర్ స్కూటర్ ఫీచర్లలో ఎలాంటి మార్పులు ఉండబోవని కంపెనీ తెలిపింది.
ఓలా S1 స్టాండర్డ్ మోడల్ లో ప్రత్యేకమైన పెయింట్ థీమ్ స్కూటర్ రానుంది. స్టాండర్డ్ ఓలా S1లోని ఫీచర్లతో పాటు సేమ్ టూ సేమ్ దానిని పోలినట్లే ఈ స్కూటర్ ఉండనుంది. దీనికి సంబంధించి మరిన్నీ వివరాలు త్వరలోనే కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది. ఇది క్లిక్ అయితే అధిక సంఖ్యలో వీటిని ప్రవేశ పెట్టిన ఆశ్యర్య పోనక్కర్లేదు.
కొద్దిగా పెరగనున్న ధర..
ఇక ఈ స్కూటర్ ధర విషయానికి వస్తే.. రూ.85,099 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా ఉండనుంది. హోలీ ఎడిషన్ S1 స్టాండర్డ్ మోడల్ కంటే కొంచెం ఎక్కువ ధరతో వచ్చే అవకాశం ఉంది. లిమిటెడ్ ఎడిషన్ కావడం, దానితో పాటు ప్రత్యేక థీమ్ కలర్లలో ఈ స్కూటర్ వస్తుండటంతో ధర పెరిగే అవకాశం ఉంది.
ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్ 3kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. సింగిల్ ఛార్జ్ తో 131 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్‌ను (ARAI సర్టిఫైడ్) అందిస్తుందని కంపెనీ పేర్కొంది. రియల్ వరల్డ్ రైడింగ్ కండిషన్స్ లో ఇది పూర్తి చార్జ్ పై 100 కిమీ పైగా రేంజ్ ను అందిస్తుంది. ఎస్1 ప్రో మాదిరిగానే ఎస్ కూడా రైడింగ్ చేయడానికి చాలా సరదాగా ఉంటుందని ఓలా తెలిపింది.
ఆకర్షించేలా యూజర్ ఫ్రెండ్లీ డిస్ప్లే..
8.5kW (11.3 bhp) వద్ద 58 Nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. హైపర్ డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటారు ను ఈ స్కూటర్ కలిగి ఉంటుంది. 7.0 ఇంచ్ కలర్ టచ్ స్క్రీన్ డిస్ ప్లే కలిగిన ఓలా S1 యూజర్ ను బాగా ఆకర్షిస్తుంది. రైడర్ కు కావల్సిన అనేక రకాల సమాచారం ఇందులో సులభంగా చూడవచ్చు. ఇది రైడర్ మనసును కచ్చితంగా గెలుచుకుంటుంది.
ఓలా ఎస్1 ట్యూబ్లర్ ఛాసిస్ పై ఆధారపడి నిర్మించబడింది. ఈ స్కూటర్ ముందు భాగంలో సింగిల్ ఫోర్క్ వెనుక వైపున మోనో షాక్ యూనిట్ ఉంటాయి. ఇక బ్రేకింగ్ విషయానికొస్తే, ముందు భాగంలో 220 మిమీ హైడ్రాలిక్ డిస్క్, వెనుకవైపున 180 మిమీ హైడ్రాలిక్ డిస్క్ ఉంటాయి. సిబిఎస్ (కాంబి బ్రేక్ సిస్టమ్)కు ఇది సపోర్ట్ చేస్తుంది. అల్యూమినియం అల్లాయ్ వీల్స్, వాటిపై ఇరువైపులా 110/70 - R12 ప్రొఫైల్ తో కూడిన టైర్లు అమర్చబడి ఉంటాయి.


Click it and Unblock the Notifications








