ఓలా నుంచి మరో గుడ్‌న్యూస్.. ఆకర్షణీయమైన కలర్స్‌లో జూలైలో రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు..
దేశీయ మార్కెట్‌లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ కారణంగానే కంపెనీ అమ్మకాల్లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో యువ వినియోగదారులను ఆకర్షించేందుకు ఓలా తమ స్కూటర్లలో కొత్త కలర్ ఆప్షన్‌ను అందించాలని నిర్ణయించింది. ఆ వివరాలు చూద్దాం.
ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం జూలైలో రెండు కొత్త కలర్ ఆప్షన్‌లను పరిచయం చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించి కంపెనీ నుంచి అధికారికంగా టీజర్‌ను విడుదల అయింది. అయితే కలర్స్ పేర్లు మాత్రం వెల్లడించలేదు. కాగా నియాన్ గ్రీన్ మరియు బ్లూ కలర్ స్కీమ్ కలర్స్ ఉండవచ్చని అంచనా.

జూలైలో జరిగే ఈవెంట్‌లో ఓలా ఈ కొత్త కలర్ ఆప్షన్‌తో కూడిన స్కూటర్‌లను విడుదల చేయనుంది. కానీ వేడుక జరిగే తేదీ గురించి స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. ప్రస్తుతం, ఓలా S1 ఎయిర్ మొత్తం 4 కలర్స్‌లో, S1 స్కూటర్ 11 రంగులు, S1 ప్రో 12 రంగుల్లో భారత మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
జూలైలో ఓలా నిర్వహించే ఈవెంట్‌పై ఇప్పటికే మార్కెట్‌లో అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికీ ఓ కారణం ఉంది. ఆ రోజున కంపెనీ సరికొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని ఆవిష్కరించనుంది. చాలా మంది ఇది ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ఉంటుందని భావిస్తున్నారు. మరికొందరు ఓలా తమ మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరిస్తుందని అంచనా వేస్తున్నారు.

ఓలా యొక్క ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా పేర్కొనబడిన S1 ఎయిర్ డెలివరీలు జూలై నుంచి ప్రారంభమవుతాయి. ఇది 4.5 kW తో 6 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 3 kWh బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంటుంది. ఈ స్కూటర్‌ను ఫుల్ ఛార్జింగ్ చేస్తే 125 కి.మీల రేంజ్‌ను అందిస్తుంది. గరిష్ఠంగా గంటకు 85 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.
మిడ్-లెవల్ వెర్షన్ ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్ S1 ఎయిర్ మాదిరిగానే 3kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. అయితే, ఇది గరిష్ఠంగా 8.4kW తో 11.3 bhp పవర్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే 141 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. ఇది కేవలం 3.8 సెకన్లలో 0 నుంచి 40 kmph వేగవంతం అవుతుంది. గరిష్ఠంగా గంటకు 95 కియమీ వేగంతో ప్రయాణిస్తుంది.

టాప్-ఎండ్ మోడల్ ఓలా S1 Pro పెద్ద 4 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. 8.5kW తో 11.3bhp శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఇది కేవలం 2.9 సెకన్లలో 0-40 kmph వరకు మరియు 4.5 సెకన్లలో 0-60 kmph వరకు వేగవంతం అవుతుంది. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే 181 కిమీ రేంజ్‌ను ఇస్తుంది.
కేంద్ర ప్రభుత్వం FAME II సబ్సిడీని తగ్గించడంతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర పెరిగింది. దీని కారణంగా, ఎస్1 ఎయిర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.10 లక్షలు, ఎస్1 రూ.1.30 లక్షలు మరియు ఎస్1 ప్రో రూ.1.40 లక్షలకు చేరింది. గత మేలో కంపెనీ 30,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి అమ్మకాల్లో దూసుకుపోతోంది.


Click it and Unblock the Notifications








